తిల్యార్ సరస్సు
తిల్యార్ సరస్సు, రోహ్తాక్, హర్యానా, భారతదేశం | |
---|---|
ప్రదేశం | రోహ్తాక్, హర్యానా, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 28°52′44″N 76°38′09″E / 28.87889°N 76.63583°E |
సరస్సులోకి ప్రవాహం | కెనాల్ వాటర్ |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 132 ఎకరాలు (0.53 కి.మీ2) |
సరాసరి లోతు | 10 అ. (3.0 మీ.) |
తిల్యార్ సరస్సు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల ఒక పర్యాటక ప్రదేశం. ఇది ఢిల్లీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హర్యానాలోని రోహ్తక్ నగరానికి దగ్గరగా ఉంటుంది. ఈ సరస్సు ను ప్రదర్శించడానికి ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈ సరస్సు లోని చేపలను పట్టడానికి ప్రత్యేక రుసుము చెల్లించి అనుమతి పొందాలి.[1][2]
విస్తీర్ణం
[మార్చు]ఈ సరస్సు 132 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[3]
ప్రత్యేకత
[మార్చు]ఇది విశాలమైన పచ్చిక బయళ్ళు కలిగి ఉంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం. ప్రజలు చాలా దూరం నుండి ఈ సరస్సు ను సందర్శించడానికి వస్తారు. ఈ సరస్సు మధ్యలో ఉన్న చిన్న ద్వీపంలో అనేక రకాల పక్షులను చూడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. సరస్సు దగ్గరలో రోహ్తక్ జూ కూడా ఉంది.
జంతు ప్రదర్శనశాల
[మార్చు]హర్యానాలో రాష్ట్రవ్యాప్తంగా అనేక చిన్న జంతుప్రదర్శనశాలలు ఉన్నాయి. 2001 లో హర్యానా ప్రభుత్వం వీటిని మూసివేసి, బాగా అభివృద్ధి చెందిన జంతుప్రదర్శనశాలలతో భర్తీ చేయాలని నిర్ణయించుకుంది, ఇందులో భాగంగా తిల్యార్ సరస్సు దగ్గర ఉన్న రోహ్తక్ జంతుప్రదర్శనశాలను ఏర్పాటు చేయబడింది. ఇందువలన దీనిలో ప్దెంపుడు జంతువుల కొరకు ఆవరణలు, పక్షుల కొరకు నిర్మాణాలు నిర్మించబడ్డాయి. అలాగే ఇందులో సందర్శకులకు తగిన సౌకర్యాలను కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి.[4][5]
చిత్రాలు
[మార్చు]-
తోడేలు
-
దుప్పి
మూలాలు
[మార్చు]- ↑ Page 149, India: A Travel Guide, By B.R. Kishore, published 2001, Diamond Pocket Books (P) Limited, ISBN 81-284-0067-3
- ↑ India Mapped: Tilyar Zoo
- ↑ http://myjourneythroughindia.wordpress.com/tag/tilyar-zoo-rohtak-haryana/ My journey through India
- ↑ "Tilyar lake travalogue". Archived from the original on 2017-11-13. Retrieved 2021-07-15.
- ↑ List of zoos who have submitted their master plan Archived 4 మార్చి 2016 at the Wayback Machine
- ↑ Haryana Forests Dept Archived 12 మే 2014 at the Wayback Machine