Jump to content

తుర

అక్షాంశ రేఖాంశాలు: 25°31′N 90°13′E / 25.52°N 90.22°E / 25.52; 90.22
వికీపీడియా నుండి
తుర
;zhzLg
తుర ప్రభుత్వ కళాశాల ప్రవేశ ద్వారం
తుర ప్రభుత్వ కళాశాల
తుర is located in Meghalaya
తుర
తుర
భారతదేశంలోని మేఘాలయలో ప్రాంతం ఉనికి
తుర is located in India
తుర
తుర
తుర (India)
Coordinates: 25°31′N 90°13′E / 25.52°N 90.22°E / 25.52; 90.22
దేశం భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లాపశ్చిమ గారో హిల్స్
ఎత్తు
349 మీ (1,145 అ.)
జనాభా
 (2011)
 • మొత్తం
74,858
భాషలు
 • అధికారికగారో, ఇంగ్లీష్
కాల మండలంUTC+5:30 (భారత కాలమానం)
టెలిఫోన్ కోడ్03651
Vehicle registrationఎంఎల్ - 08

తుర, మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. మున్సిపాలిటీగా కూడా మార్చబడింది. మేఘాలయలోని అతిపెద్ద పట్టణాల్లో ఒకటైన తుర పట్టణం, కొండల పర్వత ప్రాంతంలో తురా శిఖరానికి దిగువన ఉన్న ఒక లోయ. ఇక్కడ ఏడాది పొడవునా వాతావరణం మితంగా ఉంటుంది. దురామ కొండలలో దేవుడు నివసిస్తారని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

రాజధాని షిల్లాంగ్ నగరానికి 323 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణానికి బస్సులు, హెలికాప్టర్ సర్వీసు ద్వారా చేరుకోవచ్చు. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకి 50 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఇక్కడ రోంగ్‌బాంగ్‌దారే, పెల్‌గడారే, గాండ్రాక్ జలపాతాలు, రంగోల్వారీ, నోక్మావారి, గానోల్, డాచిమా ప్రవాహాలు ఉన్నాయి.

భౌగోళికం, వాతావరణం

[మార్చు]

తుర పట్టణం 25°31′N 90°13′E / 25.52°N 90.22°E / 25.52; 90.22 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1]ఇది సముద్రమట్టానికి 349 మీటర్ల (1145 అడుగుల) ఎత్తులో ఉంది. ఇక్కడ తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం[2], తుర పట్టణంలో 74,858 జనాభా ఉంది. పట్టణ జనాభాలో స్వదేశీ గారో ప్రజలు, హజోంగ్ ప్రజలు, బెంగాలీలు, నేపాలీలు, కోచెలు, రభాలు, బోడోలు, ఇతర స్వదేశీ గిరిజన జాతులతోపాటు వలస ముస్లింలు, బిహారీలు ఉన్నారు. ఇందులో గారో ప్రజలు 54,750 (73%) మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు. తుర పట్టణ సగటు అక్షరాస్యత రేటు 70% కాగా, ఇది జాతీయ సగటు 56% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 70% కాగా, స్త్రీల అక్షరాస్యత 67% గా ఉంది. మొత్తం జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.


<div style="border:solid transparent;position:absolute;width:100px;line-height:0;<div style="border:solid transparent;position:absolute;width:100px;line-height:0;

తుర పట్టణంలో మతాలు (2011)[3]

  తెలియని వారు (0.84%)

సమాజం

[మార్చు]

ఇక్కడ గారో తెగ (స్థానిక ప్రజలు)కు చెందినవారు ప్రధాన నివాసితులు. ఇక్కడ ప్రధానంగా క్రైస్తవ మతం ఉంది. ఇందులో బాప్టిస్ట్, కాథలిక్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రిస్టియన్ రివైవల్ చర్చి వంటి విభిన్న క్రైస్తవ వర్గాల ప్రజలు ఉన్నారు. గారో తెగ ప్రజలు, హజాంగు హిందువులు కూడా ఉన్నారు.

గారో తెగలతోపాటు హజాంగు, కోచె ప్రజలు, రభా ప్రజలు, బోడో ప్రజలు వంటి తెగలవారు కూడా ఇక్కడ ఉన్నారు. వలస బెంగాలీ, బిహారీ, నేపాలీ మాట్లాడే వారు కూడా ఉన్నారు.

రవాణా

[మార్చు]

తుర, మేఘాలయ పశ్చిమ భాగంలో బంగ్లాదేశ్ జాతీయ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ రోడ్డు మార్గమే ప్రధాన రవాణా సౌకర్యం. గువహాటి నుండి పగలు సుమో, రాత్రిపూట బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పవన్ హన్స్ ఆధ్వర్యంలో గువహాటి, షిల్లాంగ్ నుండి వారానికి 3 రోజులు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది.

గువహాటి నగరంలో సమీప విమానాశ్రయం ఉంది. తుర పట్టణంకు 30 కి.మీ.ల దూరంలో బాల్జెక్ విమానాశ్రయం ఉంది, అయితే ఇది ఇంకా పనిచేయడం లేదు. దీనిని అప్పటి భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ పట్టణ పర్యటన సందర్భంగా ప్రారంభించారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Maps, Weather, and Airports for Tura, India". www.fallingrain.com. Retrieved 2021-01-03.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-03.
  3. https://www.in/data/town/801536-tura-meghalaya.html

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తుర&oldid=3947638" నుండి వెలికితీశారు