నోంగ్‌పొ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోంగ్‌పొ
పట్టణం
నోంగ్‌పొ is located in Meghalaya
నోంగ్‌పొ
నోంగ్‌పొ
భారతదేశంలోని మేఘాలయలో ప్రాంతం ఉనికి
నోంగ్‌పొ is located in India
నోంగ్‌పొ
నోంగ్‌పొ
నోంగ్‌పొ (India)
నోంగ్‌పొ is located in Asia
నోంగ్‌పొ
నోంగ్‌పొ
నోంగ్‌పొ (Asia)
నిర్దేశాంకాలు: 25°54′N 91°53′E / 25.9°N 91.88°E / 25.9; 91.88Coordinates: 25°54′N 91°53′E / 25.9°N 91.88°E / 25.9; 91.88
దేశం భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లారి-భోయ్
సముద్రమట్టం నుండి ఎత్తు
485 మీ (1,591 అ.)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం17,055
భాష
 • అధికారికఇంగ్లీష్[2]
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
వాహనాల నమోదు కోడ్ఎంఎల్ - 10
వాతావరణంCwa

నోంగ్‌పొ, మేఘాలయ రాష్ట్రంలోని రి-భోయ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. నాంగ్‌పొ పట్టణం 40వ జాతీయ రహదారిలో, రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నుండి 52 కిలోమీటర్లు, అసోం రాష్ట్రంలోని గువహాటి నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భౌగోళికం[మార్చు]

నాంగ్‌పొ పట్టణం 25°54′N 91°53′E / 25.9°N 91.88°E / 25.9; 91.88 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది సముద్రమట్టానికి 485 మీటర్ల (1,591 అడుగుల) ఎత్తులో ఉంది. బ్రహ్మపుత్రా నదికి దగ్గరగా ఉండడంవల్ల ఇక్కడ వేసవికాలంలో వాతావరణం తేమగా, వేడిగా.. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పైనాపిల్స్, అరటి, బొప్పాయి, లిచి వంటి పండ్లను పండిస్తారు. నాంగ్‌పొ నుండి గువహాటికి వెళ్ళే రోడ్డమార్గంలో తమలపాకు గింజ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి .

జనాభా[మార్చు]

మేఘాలయలోని నాంగ్‌పొలో పిల్లలకు స్వీట్లు పంపిణీ చేస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నాంగ్‌పొ పట్టణంలో 17,055 జనాభా ఉంది. ఇందులో 8,536 మంది పురుషులు, 8,519 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 2,993 మంది 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణంలోని అక్షరాస్యుల సంఖ్య 11,610 (68.1%) గా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 68.8% కాగా, స్త్రీల అక్షరాస్యత 67.3% గా ఉంది. నాంగ్‌పొలో 3160 గృహాలు ఉన్నాయి.[1] ఇక్కడ షెడ్యూల్డ్ కులాల వారు 30 మంది, షెడ్యూల్డ్ తెగల వారు 14,206 మంది ఉన్నారు.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] నాంగ్‌పొ పట్టణంలో13,165 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు. నాంగ్‌పొ సగటు అక్షరాస్యత రేటు 61% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 63% కాగా, స్త్రీల అక్షరాస్యత 59% గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 21% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

మతం[మార్చు]

నోంగ్‌పొ (2011)[5]

  ఇతరులు (1.37%)

నాంగ్‌పొ పట్టణంలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Census of India: Nongpoh". www.censusindia.gov.in. Retrieved 2 January 2021.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 2 జనవరి 2021. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  3. Falling Rain Genomics, Inc - Nongpoh
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 2 January 2021.
  5. "C-1 Population By Religious Community". census.gov.in. Retrieved 2 January 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=నోంగ్‌పొ&oldid=3584741" నుండి వెలికితీశారు