తెలంగాణ గ్రామజ్యోతి పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ గ్రామజ్యోతి పథకం
తెలంగాణ గ్రామజ్యోతి పథకం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనఆగష్టు 15, 2015
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ గ్రామజ్యోతి పథకం తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం.

ప్రారంభం

[మార్చు]

తెలంగాణ గ్రామజ్యోతి పథకాన్ని 2015, ఆగస్టు 17వ తేదీన వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు.[1]

కమిటీ

[మార్చు]

ఈ పథకం అమలు కోసం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసారు. ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, టి. హరీశ్ రావు, జోగు రామన్న సభ్యులుగా ఉన్నారు.[2]

వివరాలు

[మార్చు]

గ్రామజ్యోతి పథకం అమలుకు ఒక్కో మండలానికి ఒక్కో అధికారిని, గ్రామగ్రామాన ‘గ్రామజ్యోతి' పేరిట వారోత్సవాలకోసం పంచాయితీలకు సిబ్బందిని నియమించారు.[1]

ఈ పథకంలో భాగంగా రానున్న 5 ఏళ్లలో గ్రామాల అభివృద్ధికి రూ. 25 వేల కోట్లు ఖర్చ చేయాలని... జనాభాను బట్టి అన్ని గ్రామాల అభివృద్ధికి రూ.2 నుంచి 6 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి నిధులు అందివ్వనున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తెలుగు వన్ ఇండియా. "గ్రామజ్యోతి: ప్రారంభం ఎప్పుడు ఎక్కడ, కేసీఆర్ ఏమన్నారు?". telugu.oneindia.com. Archived from the original on 6 ఆగస్టు 2015. Retrieved 6 February 2017.
  2. సాక్షి. "తెలంగాణలో గ్రామజ్యోతి పథకం". Retrieved 6 February 2017.
  3. ఆంధ్రజ్యోతి. "ఆగస్టు 15 నుంచి 'గ్రామజ్యోతి పథకం'". Retrieved 6 February 2017.[permanent dead link]