దేవుని గెలిచిన మానవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవుని గెలిచిన మానవుడు
(1967 తెలుగు సినిమా)
TeluguFilm Devuni gelichina manavudu.jpg
దర్శకత్వం హుణుసూరు కృష్ణమూర్తి
నిర్మాణం వై.వి. రావు
తారాగణం కాంతారావు,
వాణిశ్రీ,
చలం,
గీతాంజలి,
రాజనాల,
వల్లూరి బాలకృష్ణ,
మిక్కిలినేని
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ గౌరీ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దేవుని గెలిచిన మానవుడు 1967 లో హుణుసూరు కృష్ణమూర్తి దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. కాంతారావు, వాణిశ్రీ, చలం, గీతాంజలి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇదే సినిమాను కన్నడభాషలో రాజ్‌కుమార్, జయంతి జంటగా దేవర గెద్ద మానవ పేరుతో ఏకకాలంలో నిర్మించారు.

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాత: వై.వి.రావు
  • దర్శకత్వం: హుణుసూరు కృష్ణమూర్తి
  • కథ, స్క్రీన్‌ప్లే: ఎస్.భావనారాయణ
  • మాటలు: పాలగుమ్మి పద్మరాజు
  • పాటలు: సి.నారాయణరెడ్డి, వీటూరి
  • నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, రఘురాం, సౌమిత్రి, ఎల్.వి.కృష్ణ
  • సంగీతం: రాజన్ - నాగేంద్ర
  • ఛాయాగ్రహణం: చంద్రు

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

కథ[మార్చు]

విజయదత్తుడు నిజాయితీ కల జూదరి. తోటి జూదరుల చేత మోసగింపబడి సర్వస్వం కోల్పోతాడు. ఒకానొక సందర్భంలో శివాలయంలో బంధించబడతాడు. ఉబుసుపోక శివునితో జూదమాడుతాడు. ఓడిపోయిన పరమశివుడూ తన ఢమరుకాన్ని ఇచ్చేస్తాడు. ఆ ఢమరుకాన్ని వాయించగానే రంభ వచ్చి నాట్యం చేస్తుంది. జూదం కూడా ఆడి ఓడిపోతుంది. ఫలితంగా విజయదత్తుడికి భార్య అవుతుంది. రంభ ఒకనాడు విజయదత్తుని ఇంద్రసభకు తీసుకువెళ్ళి దేవవ్రతుని కుమార్తె మిత్రవిందతో తన నాట్యపోటీని చూపిస్తుంది. దానితో ఇంద్రుని శాపానికి గురై శిలగా మారుతుంది. చంద్రోదయం కాగానే నిజరూపం వస్తుంది కానీ ప్రియాసంగమం నిషిద్ధం. ఆ నిషేధాన్ని ఉల్లంఘించి శాశ్వతంగా శిల అయ్యింది. విజయదత్తుడు అకాలమృత్యువు పాలైనా పరమశివుని వద్దకే చేరుకుంటాడు. తన పందెం కథ కమామీషు విన్నవించుకుంటాడు. ఒక రోజు దేవేంద్రపదవిని వరంగా పొందుతాడు. ఇంద్రలోకంలోని శాసనాలన్నీ మార్చేస్తాడు. తనకి తిరిగి కొత్తఖాతా పెట్టించి ప్రాణప్రతిష్ట గావించుకుంటాడు. రంభకు శాపవిమోచన నిమిత్తం స్వర్ణనగరానికి చేరుకుని అక్కడ అతిబలుడనే రాక్షసుని సంహరించి స్వర్ణలింగాన్ని సువర్ణపుష్పాలతో అభిషేకించి ఆ జలాన్ని శిలాప్రతిమపై జల్లుతాడు. రంభకు శాపవిమోచనమయ్యింది[1].

మూలాలు[మార్చు]

  1. డి.కె.యం. (16 July 1967). "చిత్రసమీక్ష- దేవుని గెలిచిన మానవుడు". ఆంధ్రపత్రిక దినపత్రిక.[permanent dead link]