Jump to content

తేజ

వికీపీడియా నుండి
(ధర్మ తేజ నుండి దారిమార్పు చెందింది)
తేజ
దర్శకుదు తేజ
జననం
ధర్మ తేజ

(1966-02-22) 1966 ఫిబ్రవరి 22 (వయసు 58)
వృత్తిదర్శకుడు
నిర్మాత
ఛాయగ్రాహకుడు
స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1977–ఇప్పటివరకు
జీవిత భాగస్వామిశ్రీవల్లి
పిల్లలుఅమితోవ్ తేజ, ఐల తేజ
తల్లిదండ్రులు
  • బలరామకృష్ణ చౌదరి (తండ్రి)

తేజ గా పిలువబడే జాస్తి ధర్మ తేజ ఒక తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.[1] ఛాయాగ్రాహకుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దర్శక నిర్మాతగా మారాడు. చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.


నేపథ్యము

[మార్చు]

ధర్మ తేజ 1966 ఫిబ్రవరి 22వ తేదీన మద్రాస్ లో జన్మించాడు.[2] 1960వ దశకంలో తేజ కుటుంబం బాగా కలిగిన కుటుంబం. నాలుగంతస్తుల పెద్ద ఇల్లు వారిది. తండ్రి జె. బి. కె. చౌదరి కొరియా, జపాన్ దేశాలకు బెరైటీస్, మైకా, తిరుమల నుంచి వెంట్రుకలు మొదలైనవి ఎగుమతి వ్యాపారం చేసేవాడు. తేజ బాల గురుకుల పాఠశాలలో చదివాడు. సినీ నటి జీవిత, నృత్య దర్శకురాలు సుచిత్ర చంద్రబోస్ ఈయన ఒకే తరగతిలో చదువుకున్నారు. దర్శకుడు శంకర్ ఈయనకు సీనియరు. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ పర్వతవర్ధనమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె ఇతనికి రామాయణ, మహాభారత, భాగవతాలను కథలుగా చెప్పేది.

తల్లి మరణం తర్వాత తండ్రి వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబం రోడ్డున పడింది. బంధువులు తేజతో సహా ముగ్గురు పిల్లల బాధ్యతను తీసుకున్నారు. దాంతో తేజ బాబాయి ఇంట్లో ఉంటూ బతుకు తెరువు కోసం సినిమా ఆఫీసుల్లో చిన్న చితకా పనులు చేస్తుండేవాడు. తర్వాత చెన్నై నుంచి హైదరాబాదు వచ్చాడు. కొద్ది రోజులు పోస్టరు ఇన్ చార్జిగా పనిచేశాడు. తర్వాత కెమెరా సహాయకుడిగా పనిచేశాడు. దర్శకుడు టి. కృష్ణ ఇతన్ని బాగా చూసుకునే వాడు. ఛాయా గ్రాహకులు రవికాంత్ నగాయిచ్, ఎస్. గోపాల రెడ్డి, మహీధర్ దగ్గర కొద్ది రోజులు సహాయకుడిగా పనిచేశాడు. రాం గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడి శివ సినిమాకు మొదటి నుంచి చివరి వరకు అనేక విభాగాల్లో పనిచేశాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాతో ఛాయాగ్రాహకుడిగా మారాడు. తర్వాత అదే హోదాలో అంతం, మనీ సినిమాలకు కూడా పనిచేశాడు.

సినీ ప్రస్థానం

[మార్చు]
విభాగము చిత్రం భాష వివరాలు
ఛాయాగ్రహణం శివ (1989 సినిమా) తెలుగు
ఛాయాగ్రహణం శివ హిందీ
ఛాయాగ్రహణం క్షణక్షణం తెలుగు
ఛాయాగ్రహణం అంతం తెలుగు
ఛాయాగ్రహణం రాత్రి తెలుగు తొలి తెలుగు చిత్రం - నంది ఉత్తమ ఛాయాగ్రహణం పురస్కారము
ఛాయాగ్రహణం రాత్ హిందీ
ఛాయాగ్రహణం గోవిందా గోవిందా తెలుగు
ఛాయాగ్రహణం రంగీలా హిందీ
ఛాయాగ్రహణం మనీ తెలుగు
ఛాయాగ్రహణం బాజీ హిందీ
ఛాయాగ్రహణం గులాం హిందీ
ఛాయాగ్రహణం సంఘర్ష్ హిందీ
ఛాయాగ్రహణం అఫ్సానా ప్యార్ కా హిందీ
ఛాయాగ్రహణం విశ్వవిధాత హిందీ
ఛాయాగ్రహణం మేళా హిందీ
ఛాయాగ్రహణం తేరే మేరే సప్నే హిందీ
ఛాయాగ్రహణం రక్షక్ హిందీ
ఛాయాగ్రహణం రక్షణ హిందీ
ఛాయాగ్రహణం జిస్ దేశ్ మే గంగా రెహతాహై హిందీ
ఛాయాగ్రహణం ప్రేం హిందీ
ఛాయాగ్రహణం ద డాన్ హిందీ
ఛాయాగ్రహణం సౌగంధ్ హిందీ
ఛాయాగ్రహణం ఖిలాడి హిందీ
ఛాయాగ్రహణం దీదార్ హిందీ
ఛాయాగ్రహణం రాజా హిందుస్తానీ హిందీ
ఛాయాగ్రహణం దిల్ తో పాగల్ హై హిందీ
ఛాయాగ్రహణం సర్ఫరోష్ హిందీ
ఛాయాగ్రహణం ఏలాన్ హిందీ
ఛాయాగ్రహణం జంజీర్ హిందీ
కథారచయిత పితా హిందీ కథారచయితగా తొలి చిత్రం
దర్శకుడు వెయ్యి అబద్దాలు[3] తెలుగు
దర్శకుడు నీకూ నాకా డాష్ డాష్ తెలుగు
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, నిర్మాత కేక తెలుగు
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు లక్ష్మీ కళ్యాణం తెలుగు
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు. ధైర్యం తెలుగు
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు. ఔనన్నా కాదన్నా తెలుగు
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, నిర్మాత. జై తెలుగు
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, నిర్మాత నిజం తెలుగు నంది ఉత్తమ దర్శకుడు పురస్కారము, నంది ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారము, ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారము
నిర్మాత సంబరం తెలుగు
నిర్మాత జయం తమిళ్
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, నిర్మాత జయం తెలుగు నంది ఉత్తమ దర్శకుడు పురస్కారము, నంది ఉత్తమ చిత్రం పురస్కారము, నంది ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారము, నంది ఉత్తమ కథ పురస్కారము, ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారము
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు. నువ్వు నేను తెలుగు నంది ఉత్తమ దర్శకుడు పురస్కారము, నంది ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారము
దర్శకుడు, ఛాయాగ్రహణం ఫ్యామిలీ సర్కస్ తెలుగు
దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు,. చిత్రం తెలుగు

దర్శకుడిగా తొలి చిత్రం
నంది ఉత్తమ దర్శకుడు పురస్కారము, నంది ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారము, ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారము

మూలాలు

[మార్చు]
  1. వట్టికూటి, చక్రవర్తి. "నాలుగంతస్తుల నుంచి నడిరోడ్డు మీదకు..." eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 30 October 2017. Retrieved 30 October 2017.
  2. TV9 Telugu, TV9 (22 February 2021). "Happy Birthday Director Teja : చిత్రం, నువ్వునేను, జయం వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ పుట్టిన రోజు నేడు - Happy Birthday Director Teja". Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-06. Retrieved 2013-07-01.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తేజ&oldid=3787807" నుండి వెలికితీశారు