Jump to content

ఎన్.శంకర్

వికీపీడియా నుండి
(నిమ్మల శంకర్ నుండి దారిమార్పు చెందింది)
ఎన్.శంకర్
జననంనిమ్మల శంకర్
India చింతపల్లి గ్రామం , వేములపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ, ఇండియా
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుఎన్‌కౌంటర్ శంకర్
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత
తండ్రిగురువయ్య
తల్లిసక్కుబాయమ్మ

నిమ్మల శంకర్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. జయం మనదే రా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కమర్షియల్ మెయిన్‌ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించాడు. 2011లో శంకర్ తీసిన జై బోలో తెలంగాణ సినిమా ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. 2011 సెప్టెంబరులో గోవాలో జరిగిన 6వ దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో [1][2] ప్రదర్శించబడింది.

జననం

[మార్చు]

గురువయ్య, సక్కుబాయమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో 1968 అక్టోబర్ 3 నా జన్మించాడు .[3]

సినీరంగం

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]

1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా,[4][5] భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

తెలుగు
  1. 2 కంట్రీస్ (2017)[6][7]
  2. జై బోలో తెలంగాణా - (04.02.2011)
  3. రామ్ -(30 మార్చి 2006)
  4. ఆయుధం -(2003)
  5. భద్రాచలం - (2001)
  6. జయం మనదేరా -(07.10.2000)
  7. యమజాతకుడు - (1999)
  8. శ్రీరాములయ్య - (28.09.1999)
  9. ఎన్‌కౌంటర్ - (14.08.97)
కన్నడ
  1. నమ్మణ్ణ (2005)

నటుడిగా

[మార్చు]

రామ్‌కీ హీరోగా, కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందిన రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయమయ్యాడు.

అవార్డులు

[మార్చు]

పదవులు

[మార్చు]
  • ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యునిగా
  • నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)
  • గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
  • తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)
  • తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు (2018)[8][9]

ఇతర వివరాలు

[మార్చు]

2020 సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో హైదరాబాదు నగరంలో వచ్చిన వరద నష్టానికి సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి శంకర్ 10లక్షల రూపాయల చెక్కును 2020 అక్టోబరు 22న మంత్రి కేటీఆర్ కి అందిచాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. "Jai Bolo Telangana selected for South Asian Film Festival - Telugu cinema". www.idlebrain.com. Retrieved 2021-10-05.
  2. "South Asian Film Festival begins in Goa | NDTV Movies.com". Archived from the original on 2014-05-27. Retrieved 2014-09-18.
  3. "The Hindu : Andhra Pradesh / Nalgonda News : Movie to highlight plight of archakas". web.archive.org. 2009-02-07. Archived from the original on 2009-02-07. Retrieved 2021-10-05.
  4. "The Hindu : Metro Plus Hyderabad / Cinema : On a south stint". web.archive.org. 2012-11-05. Archived from the original on 2012-11-05. Retrieved 2021-10-05.
  5. "N Shanaker to direct Balayya". archive.ph. 2013-02-02. Archived from the original on 2013-02-02. Retrieved 2021-10-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. ప్రజాశక్తి, మూవీ (26 December 2017). "హిట్లు, ఫ్లాప్‌లు కామన్‌ - ఎన్‌. శంకర్‌". Retrieved 13 March 2018.
  7. సాక్షి, సినిమా (26 December 2017). "ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు : ఎన్. శంకర్". Sakshi. Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  8. నమస్తే తెలంగాణ, సినిమాడెస్క్ (12 March 2018). "తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా శంకర్". Retrieved 13 March 2018.
  9. సాక్షి, సినిమా (12 March 2018). "తెలుగు చలనచిత్ర దర్శకుల మండలి అధ్యక్షునిగా ఎన్‌. శంకర్‌". Retrieved 13 March 2018.
  10. తెలుగు ఏసియన్ నెట్, తెలంగాణ. "వరద బాధితుల కొరకు దర్శకుడు ఎన్ శంకర్ ఆర్ధిక సాయం". Asianet News Network Pvt Ltd. Archived from the original on 1 November 2020. Retrieved 5 October 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎన్.శంకర్&oldid=3906873" నుండి వెలికితీశారు