నిరుపమ రావు
నిరుపమ రావు | |
---|---|
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు భారత రాయబారి | |
In office 2011 ఆగస్టు 1 – 2013 నవంబరు 5 | |
అంతకు ముందు వారు | మీరా శంకర్ |
తరువాత వారు | సుబ్రహ్మణ్యం జైశంకర్ |
28వ భారతదేశ విదేశాంగ కార్యదర్శి | |
In office 2009 ఆగస్టు 1 – 2011 జులై 31 | |
అంతకు ముందు వారు | శివశంకర్ మీనన్ |
తరువాత వారు | రంజన్ మథాయ్ |
చైనాలో భారత రాయబారి | |
In office 2006 నవంబరు 1 – 2009 జులై 31 | |
అంతకు ముందు వారు | నలిన్ సూరీ |
తరువాత వారు | సుబ్రహ్మణ్యం జైశంకర్ |
శ్రీలంకలో భారత హైకమిషనర్ | |
In office 2004 ఆగస్టు 1 – 2006 సెప్టెంబరు 30 | |
అంతకు ముందు వారు | నిరుపమ్ సేన్ |
తరువాత వారు | అలోక్ ప్రసాద్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మలప్పురం, కేరళ, భారతదేశం | 1950 డిసెంబరు 6
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) |
నైపుణ్యం | సివిల్ సర్వీస్ |
నిరుపమా మీనన్ రావు (జననం 1950 డిసెంబరు 6) 1973 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్(IFS) కేడర్‌కు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వెంట్, ఆమె 2009 నుండి 2011 వరకు భారతదేశ విదేశాంగ కార్యదర్శిగా పనిచేసింది, అలాగే, ఆమె కెరీర్ లో అమెరికా, చైనా, శ్రీలంకలలో భారత రాయబారిగానూ చేసింది.
జలై 2009లో, ఆమె భారత విదేశాంగ కార్యదర్శిగా, భారత విదేశాంగ శాఖ అధిపతిగా పనిచేసిన రెండవ మహిళగా గుర్తింపుపొందింది. మొదట చోకిలా అయ్యర్ భారతదేశపు మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శిగా పనిచేయడం గమనార్హం.
నిరుపమ రావు కెరీర్‌లో వాషింగ్టన్ డిసిలో ప్రెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ మినిస్టర్, మాస్కోలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ లతో సహా పలు హోదాల్లో పనిచేసింది. ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఎ)కు మొదటి మహిళా ప్రతినిధిగా, పెరూ, చైనాలకు రాయబారిగా, శ్రీలంకకు హైకమిషనర్‌గానూ చేసింది.[1][2]
ప్రారంభ జీవితం
[మార్చు]నిరుపమా రావు కేరళలోని మలప్పురంలో జన్మించింది. ఆమె తండ్రి పి.వి.ఎన్ మీనన్ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్, కాగా, తల్లి మీంపట్ నారాయణికుట్టి, ఆమె కుటుంబంలో మొదటి మహిళా కళాశాల గ్రాడ్యుయేట్, 1947లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి బిఎ గణితం (ఆనర్స్) పట్టా పొందింది.[3]
బెంగళూరు, పూణే, లక్నో, కూనూర్‌లతో సహా వివిధ నగరాల్లో నిరుపమ చదువుకుంది. ఆమె బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ నుండి 1970లో ఆంగ్లంలో బిఎ డిగ్రీ పట్టా పొందింది.[4] బెంగుళూరు విశ్వవిద్యాలయంలో అగ్రస్థానంలో నిలిచింది.[5] సెప్టెంబరు 1970లో జపాన్‌లో జరిగిన ఎక్స్‌పో 70కి అప్పటి మైసూర్ ప్రభుత్వ యువ ప్రతినిధి బృందంలో ఆమె సభ్యురాలు.[6] ఆ తర్వాత ఆమె మహారాష్ట్రలోని మరఠ్వాడా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందింది.[7]
1973లో, ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీస్(IFS), ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS) రెండింటికీ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరింది.[2]
కెరీర్
[మార్చు]ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత, ఆమె 1976 నుండి 1977 వరకు ఆస్ట్రియాలోని వియన్నాలోని ఇండియన్ ఎంబసీలో పనిచేసింది, అక్కడ ఆమె వియన్నా విశ్వవిద్యాలయంలో జర్మన్ భాషా శిక్షణను పూర్తి చేసింది. 1978 నుండి 1981 వరకు, ఆమె న్యూ ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)లో వరుసగా దక్షిణాఫ్రికా, నేపాల్ డెస్క్‌లలో అండర్ సెక్రటరీగా పనిచేసింది.[8]
1981లో, ఆమె శ్రీలంకలోని భారత హైకమిషన్‌లో మొదటి కార్యదర్శిగా నియమించబడింది.[9]
గుర్తింపు
[మార్చు]- ఆమె విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సమయంలో దౌత్యవేత్తగా సాధించిన విజయాలకు, 2010లో కెపిఎస్ మీనన్ అవార్డు, 2011లో శ్రీ చిత్తిర తిరునాళ్ అవార్డు అందుకుంది.[10][11]
- మే 2012లో, ఆమెకు పాండిచ్చేరి విశ్వవిద్యాలయం వారి కాన్వొకేషన్‌లో డాక్టర్ ఆఫ్ లెటర్స్ (హానోరిస్ కాసా) డిగ్రీని ప్రదానం చేసారు.[12]
- 2012లో, www.ForeignPolicy.com ద్వారా ట్విట్టర్‌లో అత్యంత ప్రభావవంతమైన వంద మంది మహిళల జాబితాలో ఆమె చోటు దక్కించుకుంది.[13]
- ఫిబ్రవరి 2016లో, ఆమె కేరళ ప్రభుత్వం నుండి వనితా రత్నం అవార్డును అందుకుంది.[14]
మూలాలు
[మార్చు]- ↑ Nirupama Rao takes over as Foreign Secy Press Trust of India / New Delhi, Business Standard, 1 August 2009.
- ↑ 2.0 2.1 Nirupama Rao is India's new foreign secretary The Times of India, 1 August 2009."Chokila Iyer was first woman, Indian Foreign Secretary in 2001."
- ↑ "Nirupama Rao bereaved". Business Standard. 1 December 2013.
- ↑ "Nirupama Rao To Replace Menon As Foreign Secretary". The Economic Times. ET Bureau. 1 July 2009.
- ↑ "Taking Bangalore inside out". Bangalore Mirror. 2 July 2009.
- ↑ "Diva of Diplomacy". Deccan Herald. 13 November 2019.
- ↑ "Ex-Foreign Secretary Visits Bamu". The Times of India. Times News Network. 24 June 2016.
- ↑ Matt Bewig (2 November 2011). "Ambassador From India: Who Is Nirupama Rao". All Gov.
- ↑ V.S. Sambandan (18 September 2004). "Nirupama Rao presents credentials to Chandrika". The Hindu. Archived from the original on 18 January 2015.
- ↑ "K.P.S Menon Memorial Award to be Presented to Nirupama Rao on Monday". The Hindu. 26 December 2010.
- ↑ "Sree Chitra Tirunal Award for Nirupama Rao". Outlook. 3 August 2011.
- ↑ "Awards for Diplomat, Former CJ". News 18. 16 May 2012.
- ↑ Jillian C. York (20 June 2012). "Introducing the FPwomerati". Foreign Policy.
- ↑ "Vanitha Rathnam Award". Calicut New Media. 29 February 2016.
- 1950 జననాలు
- చైనాకు భారతదేశ రాయబారులు
- భారత విదేశాంగ కార్యదర్శులు
- అమెరికాకు భారత రాయబారులు
- బెంగళూరు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు
- ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులు
- భారతీయ కవయిత్రులు
- కేరళ రాజకీయాల్లో మహిళలు
- భారతీయ కవులు
- భారతీయ రచయిత్రులు
- భారతీయ మహిళా రాజకీయ నాయకులు
- డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు
- మౌంట్ కార్మెల్ కళాశాల, బెంగళూరు పూర్వ విద్యార్థులు
- భారత మహిళా రాయబారులు