Jump to content

నిర్మల్ చిత్రపటాలు

వికీపీడియా నుండి
(నిర్మల్ చిత్రకళ నుండి దారిమార్పు చెందింది)


నిర్మల్ చిత్రాలు
Nirmal Paintings
స్త్రీ పురుషుల నృత్య భంగిమలు
కళాకారుడునిర్మల్ కళాకారులు
రకంవర్ణచిత్రం
ఉపయోగించే వస్తువులుచెక్కచట్రాలు, సహజ రంగులు
కొలతలు77.4 cమీ. × 123.87 cమీ. (30.48 in × 48.768 in)
ప్రదేశంనిర్మల్
Coordinates19°1′00.30″N 78°35′00″E / 19.0167500°N 78.58333°E / 19.0167500; 78.58333
యజమానినిర్మల్ కళాకారులు
ప్రవేశాం400 యేండ్ల నుండి

నిర్మల్ చిత్రాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లా నందుగల నిర్మల్ పట్టణంలో తయారవుతున్న హస్తకళ.[1][2] ఈ చిత్రాలు బంగారు రంగులతో కూడుకొని ఉంటాయి[3][4]

విశేషాలు

[మార్చు]

ఈ చిత్రాలు సహజంగా వివిధ రంగులతో ఉండి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చిత్రాలను చెట్ల రసాల్ని, పువ్వులనుండి తీసిన రంగులను వాడుకొని కళాకారులు వేస్తారు. వర్ణచిత్రాల్ని కొత్త అందాల్లో సజీవ రీతుల్లో చిత్రించగల నేర్పుగలవారు నిర్మల్ కళాకారులు.

చరిత్ర

[మార్చు]

కాకతీయుల సామంతరాజు నిమ్మనాయుడు పద్మనాయక వంశానికి చెందినవాడు. స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకొని నిర్మల్ ప్రాంతాన్ని పాలించాడు. కళారాధన, కళాపోషణ అభిమాన వ్యాపకాలుగా గల నిమ్మనాయుడు మరట్వాడ ప్రాంతంలో నివసించే "నకాశి" కళాకారులను రప్పించి వారికి ఉపాధి కల్పించాడు. "నకాశి" కళాకారులకు కసుబా ప్రాంతంలో గృహాలు నిర్మించాడు. సారగమ్మ దేవాలయం కసుబాకు తూర్పున అభిముఖంగా ఉన్న గ్రామదేవత. సారగమ్మ దేవాలయం వెనుక నకాని కళాకారుల నివాసగృహాలున్నాయి. వీరు తయారుచేసిన బొమ్మలు, ఏరు వేసిన చిత్రాలు పొరుగు రాజ్యాధిపతులను ఆకట్టుకోవడం వీరి సృజనాత్మక కళా వైశిష్ట్యానికి మచ్చుతునకగా నిలిచాయి. ఇక్కడి కళాఖండాలు, బొమ్మలు 17వ శతాబ్దంలోని ఇరుగు విరుగు రాజులైన నిజాం రాజులు, మహారాష్ట బోంస్లేరాజులు, గోండు రాజులు బహమనీ సుల్తానులు, వెలమరాజులు మొదలగు ఎందరో రాజులకు ఇవి ప్రీతి పాత్రమైనాయి. నిమ్మనాయుడి ఆదరణతో నకాశి కుటుంబీకులకు గౌరవవూపదమైన జీవనోపాధి లభించింది. ఆయన పాలనలో నిర్మల్ పేరు నాలుగు దిక్కులా వ్యాపించి విశ్వవ్యాప్తమైంది. వీరి అనంతరం పాలించిన శ్రీనివాసరావు, జలపతిరావు, వెంగళరావు, కుంటి వెంకవూటాయుడు, థంసా ఈ కుటుంబాలను ఆదుకొని నిర్మల్ కళలు అంతరించిపోకుండా వెన్నుదన్నుగా నిలిచారు. వీరి కళాఖండాలను నిశితంగా పరిశీలిస్తే శాతవాహన కాలం నుండే ఈ కళ పరంపరగా వస్తున్నట్లు తెలుస్తుంది. అజంతాలోని వర్ణచివూతాలను పోలిన బొమ్మలు వేయడమే ఇందుకు సాక్ష్యం.[5]

ఈ నిర్మల్ నాకాశి కుటుంబాల నుండి ఒక కళాకారుని కుతుంబం ఈ చిత్రకళలో వివిధ శైలులను చేర్చి నిర్మల్ చిత్రాల ఖ్యాతిని పెంచారు. నిర్మల్ కళాకారులు కర్ణాటక నుండి ఈ ప్రాంతానికి వచ్చారు. కొయ్యబొమ్మలు, చిత్రాలను ఆద్భుతంగా తయారుచేసి ఆ ప్రాంతనామాన్ని చరిత్రలో నిలిపారు. కొయ్యబొమ్మల తయారీ నకాశీ కుటుంబాల ద్వరా తయారవుతున్నాయి. కానీ చిత్రకళ మాత్రం బ్రహ్మరౌతు పద్మారావు ద్వారా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ చిత్రాలను డ్యూకో రంగులనుపయోగించి చెక్కతో చేసిన చట్రాలపై వేస్తారు. ఈ చట్రాల పరిమాణం 1.6 అడుగులు X 1 అడుగు ఉంటాయి. ఈ చిత్రాలు బహుమతులుగా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ చిత్రాలలో గీతోపదేశం, కృష్ణుడు, మీరాబాయి వంటి ఇతిహాసాలు, చేపలవాడు వలతో ఉన్నట్లు ఉన్నవి ఉంటాయి. అచట 150 వివిధ రకాల శైలులతో చిత్రాలు లభ్యమవుతాయి.

1948లో పద్మారావు తండ్రి గారైన రాజేష్, బూసాని రాములు కలసి "నిర్మల్ ఇండస్ట్రీస్"ను హైదరాబాదు నగరంలోని ఖైరతాబాదు ప్రాంతంలో నెలకొల్పారు. ఈ సంస్థలో ఉత్పత్తి చేయుటయే కాకుండా నకాశి కళాకారులు తయారుచేసిన బొమ్మలు, చిత్రాలను విక్రయిస్తారు.[6]

లభ్యత

[మార్చు]

ఈ చిత్రాలు ఆంధ్ర ప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ "లేపాక్షి"లో కూడా లభ్యమవుతాయి.[7]

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nirmal Paintings". Archived from the original on 2016-01-06. Retrieved 2016-01-25.
  2. "Lepakshi expo begins - ANDHRA PRADESH". The Hindu. 2007-08-12. Archived from the original on 2007-10-17. Retrieved 2015-12-19.
  3. "Traditional art emporium at its finest - HYDB". The Hindu. 2008-01-12. Archived from the original on 2008-04-29. Retrieved 2015-12-19.
  4. "Lepakshi expo inaugurated - ANDHRA PRADESH". The Hindu. 2010-07-22. Retrieved 2015-12-19.
  5. నిర్మల్ చిత్రాలు[permanent dead link]
  6. "A hazy future for Nirmal paintings?". S. Harpal Singh. The Hindu. November 12, 2007. Retrieved 24 January 2016.
  7. "Nirmal paintings-types". Archived from the original on 2016-01-19. Retrieved 2016-01-25.

ఇతర లింకులు

[మార్చు]