పాత నౌపాడ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?నౌపడ
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
శ్రీకాకుళం జిల్లా పటములో నౌపడ మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో నౌపడ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°34′00″N 84°18′00″E / 18.5667°N 84.3°E / 18.5667; 84.3
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము టెక్కలి
జిల్లా(లు) శ్రీకాకుళం


పాత నౌపడ (Naupada), శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామము.[1]

పాత నౌపాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం టెక్కలి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,308
 - పురుషుల సంఖ్య 1,110
 - స్త్రీల సంఖ్య 1,198
 - గృహాల సంఖ్య 675
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నౌపడ తూర్పు సముద్ర తీరాన ఉన్న ఒక అందమైన చిన్న గ్రామం.[1] ముఖ్యమైన పంట ఉప్పు. టెక్కలి నుండి సుమారు 8 కి.మీ దూరంలో ఉంది.

భౌగోళికం[మార్చు]

నౌపడ అక్షాంశరేఖాంశాలు 18.5667N 84.3E.[2] వద్ద ఉంది. ఈ ప్రాంతపు సగటు ఎత్తు 5 మీటర్లు (19 అడుగులు) మాత్రమే.

విశేషాలు[మార్చు]

  • నౌపడ రైల్వే జంక్షన్ [3] నౌపడ నుండి రైల్వే లైను రాయగడ జిల్లాలోని గుణుపూర్ వరకు నిర్మించబడింది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైల్వే లైన్ తో జంక్షన్ ఏర్పరుస్తుంది. ఈ రైలు మార్గం 1889 సంవత్సరంలో పర్లాకిమిడి మహారాజు శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ చేత నిర్మించబడింది.[4] దీనిని 'పర్లాకిమిడి లైట్ రైల్వే' (Parlakimidi Light Railway) అని పిలిచేవారు. ఇందు కోసం సుమారు Rs.99.00 లక్షలు ఖర్చుచేశారు. కేంద్ర నిధులతో ప్రస్తుతం ఈ మార్గం బ్రాడ్ గాజ్ గా మార్చబడుతున్నది. కొన్ని ముఖ్యమైన రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.[5]
  • నౌపడ ఉప్పు క్షేత్రాలు నౌపడ, మూలపాడు మరియు భవానీపాడు ప్రాంతాలలో సుమారు 3,000 ఎకరాల (12 కి.మీ.) విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో 500 పైగా ఉత్పత్తిదారుల నుండి ప్రతి ఏడు సుమారు 56,,000 టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుంది.[6]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,308 - పురుషుల సంఖ్య 1,110 - స్త్రీల సంఖ్య 1,198 - గృహాల సంఖ్య 675

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=పాత_నౌపాడ&oldid=1996458" నుండి వెలికితీశారు