పుదుచ్చేరి శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుదుచ్చేరి శాసనసభ
పుదుచ్చేరి శాసనసభ
15వ పుదుచ్చేరి శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం1 జూలై 1963; 60 సంవత్సరాల క్రితం (1963-07-01)
అంతకు ముందువారుపుదుచ్చేరి ప్రతినిధి సభ
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2021 ఏప్రిల్ 6
తదుపరి ఎన్నికలు
2026
సమావేశ స్థలం
పుదుచ్చేరి శాసనసభ
Map of Assembly constituencies in Puducherry
Map of Assembly constituencies in Puducherry

పుదుచ్చేరి శాసనసభ, అనేది పుదుచ్చేరిలోని భారత కేంద్రపాలిత ప్రాంతం ఏకసభ శాసనసభ. ఇది నాలుగు జిల్లాలను కలిగి ఉంది. పుదుచ్చేరి, కారైకల్, మాహె, యానాం. శాసనసభలో 30 స్థానాలు ఉన్నాయి. వాటిలో 5 షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. అదనంగా ముగ్గురు సభ్యులు భారత ప్రభుత్వంచే నామినేట్ చేయబడతారు. మొత్తం 33 మంది సభ్యులలో 30 మంది సార్వత్రిక వయోజన ఫ్రాంచైజీ ఆధారంగా ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారు.

చరిత్ర[మార్చు]

గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ చట్టం, 1963 నిబంధనల ప్రకారం శాసనసభ త్వరగా రద్దు చేయబడితే తప్ప శాసనసభ సాధారణ పదవీకాలం ఐదు సంవత్సరాలు. శాసనసభలో 16 సంఘాలు ఉన్నాయి.

2001 భారతదేశ జనాభా లెక్కల ఆధారంగా పుదుచ్చేరి లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలు డిలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీడిజైన్ చేసింది.[1] 2008 జనవరి 4న, రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCPA) డిలిమిటేషన్ కమిషన్ ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది.[2] దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం అదనంగా శాసనసభకు ముగ్గురు సభ్యులను నామినేట్ చేయవచ్చు.[3]

1963 డీలిమిటేషన్ తర్వాత[మార్చు]

కేంద్రపాలిత ప్రాంతాల చట్టం 1963 ప్రకారం, ప్రత్యక్ష ఓటు హక్కు ద్వారా ముప్పై మంది సభ్యులును ఎన్నుకుంటారు.[4][5] 1964 ఆగస్టులో మొదటి పాండిచ్చేరి శాసనసభను ఏర్పాటు చేయడానికి ఎన్నికలు జరగడానికి ముందు, నియోజకవర్గాలను డీలిమిటేషన్ కమిషన్ (డీలిమిటేషన్ కమిషన్ చట్టం, 1962 ప్రకారం) విభజించింది. మొత్తం భూభాగాన్ని పాండిచ్చేరి ప్రాంతానికి 30 ఏకసభ్య నియోజకవర్గాలు - 21గా విభజించారు. కారైకల్ ప్రాంతానికి 6, మహే ప్రాంతానికి 2, యానాం ప్రాంతానికి 1 . వీటిలో 5 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు కేటాయించగా, [5] నాలుగు పాండిచ్చేరి ప్రాంతంలో, ఒకటి కారైకల్ ప్రాంతంలో కేటాయించబడ్డాయి.[6] : 965 

2008 డీలిమిటేషన్‌కు ముందు[మార్చు]

పుదుచ్చేరి శాసనసభలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 21 నియోజకవర్గాలు పుదుచ్చేరికి చెందినవిగా, కారైకల్‌లో 6, మాహెలో 2, యానాంలో ఒకే నియోజకవర్గం ఉంది.

పుదుచ్చేరి ఈ 21 శాసనసభ నియోజకవర్గాల మధ్య విభజించబడింది: ముత్యాల్‌పేట్, కాసికేడ్, రాజ్ భవన్, బుస్సీ, ఊపాలం, ఓర్లీంపేత్, నెల్లితోప్, మోడెలియార్‌పేత్, అరియన్‌కుప్పం, ఎంబాలోమ్ (ఎస్‌సి), నెట్‌పాక్కం, కురువినాథం, బహూర్ (ఎస్‌సి), తిరుబువనై (ఎస్‌సి, ఒస్నాడిపెత్), (ఎస్.సి), విల్లెనూర్, ఓజుకరై, తట్టంచవాడి, రెడ్డిర్పాయాళయం, లాస్పేట్.

కారైకాల్ జిల్లా పరిధిలోని ప్రాంతం కింది 6 శాసనసభ నియోజకవర్గాల మధ్య విభజించబడింది.కోచేరి, కారైకాల్, కారైకల్ సౌత్, నెరవి-గ్రాండ్ ఆల్డే, తిరునల్లార్ నెడున్‌కాడు ( ఎస్.సి.) మాహె, పల్లూరు శాసనసభ నియోజకవర్గాలు మాహె జిల్లాకు చెందాయి. యానాం జిల్లా ఒకే ఒక నియోజకవర్దం యానాం మాత్రమే ఉంది.

2008 డీలిమిటేషన్ తర్వాత[మార్చు]

డీలిమిటేషన్ తర్వాత, పుదుచ్చేరి పార్లమెంట్ నియోజకవర్గాలు మునుపటిలాగా 30 శాసనసభ నియోజకవర్గాల మధ్య విభజించబడ్డాయి. ఇప్పుడు, యానాం, మాహె జిల్లాలు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఏర్పరుస్తాయి, అవి వరుసగా యానాం, మాహె.[1] కారైకాల్ జిల్లా పరిధిలోని ప్రాంతం 5 శాసనసభ నియోజకవర్గాలను ఏర్పరుస్తుంది. అవి నెడుంగడు, తిరునల్లార్, కారైకాల్ నార్త్, కారైకాల్ సౌత్, నెరవి టిఆర్ పట్టినం.[1] పుదుచ్చేరి జిల్లా పరిధిలోని ప్రాంతం 23 అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పరుస్తుంది.[1] తిరుబువనై, ఒస్సుడు, ఎంబాలం, నెట్టపాక్కం, నెడుంగడు నియోజకవర్గాలు ఎస్సీ అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.[1]

నియోజకవర్గాల జాబితా[మార్చు]

2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన జరిగినప్పటి నుండి పుదుచ్చేరి శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. 30 నియోజకవర్గాల్లో 23 పుదుచ్చేరి, కారైకల్‌లో 5 నియోజకవర్గాలు ఉండగా, మహే, యానాంలో ఒక్కో నియోజకవర్గం ఉన్నాయి.తిరుబువనై, ఒస్సుడు, ఎంబాలం, నెట్టపాక్కం, నెడుంగడు నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల (ఎస్.సి) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి.[7][8]

వ.సంఖ్య జిల్లా నియోజకవర్గం పేరు లోక్‌సభ నియోజకవర్గం కేటాయింపు ఓటర్లు
(2021 నాటికి) [9]
నియోజకవర్గం పటం
1 పుదుచ్చేరి మన్నాడిపేట పుదుచ్చేరి జిల్లా None 32,324
2 తిరుబువనై SC 32,908
3 ఒసుడు 32,176
4 మంగళం None 38,004
5 విలియనూర్ 42,329
6 ఓజుకరై 41,890
7 కదిర్కామం 34,471
8 ఇందిరా నగర్ 35,492
9 తట్టంచవాడి 30,483
10 కామరాజ్ నగర్ 37,491
11 లాస్‌పేట్ 32,359
12 కాలాపేట్ 34,547
13 ముత్యాలపేట 29,924
14 రాజ్ భవన్ 26,349
15 ఊపాలం 27,913
16 ఓర్లీంపేత్ 24,723
17 నెల్లితోప్ 33,609
18 ముదలియార్‌పేట్ 35,597
19 అరియాంకుప్పం 39,001
20 మనవేలీ 34,509
21 ఎంబాలం SC 34,810
22 నెట్టపాక్కం 32,707
23 బహూర్ None 29,762
24 కారైకాల్ జిల్లా నెడుంగడు SC 31,494
25 తిరునల్లార్ None 31,204
26 కారైకాల్ నార్త్ 35,598
27 కారైకాల్ సౌత్ 31,891
28 నెరవి టిఆర్ పట్నం 31,277
29 మహే మహే 31,092
30 యానాం యానాం 37,747

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Delimitation of Parliamentary and Assembly Constituencies in the UT of Pondicherry on the basis of 2001 Census" (PDF). Election Commission of India. 30 March 2005. Retrieved 25 January 2013.
  2. Sunil Gatade (2008). "Delimitation process now gets CCPA nod".
  3. "Centre can nominate 3 MLAs to Puducherry Assembly: SC". Deccan Herald (in ఇంగ్లీష్). 2018-12-06. Retrieved 2021-11-29.
  4. Grover, Verinder, and Ranjana Arora. Encyclopaedia of India and Her States. Vol. 10. New Delhi [India]: Deep & Deep, 1996. p. 11
  5. 5.0 5.1 Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1964 TO THE LEGISLATIVE ASSEMBLY OF PONDICHERRY Archived 27 జనవరి 2013 at the Wayback Machine
  6. G.C. Malhotra (1964). Cabinet Responsibility to Legislature. Metropolitan Book Co. Pvt. Ltd. p. 464. ISBN 9788120004009.
  7. "Schedule XXII Puducherry Table A - Assembly Constituencies" (PDF). Election Commission of India. Retrieved 2011-05-13.
  8. PUDUCHERRY ELECTIONS 2016 RESULTS
  9. "Integrated Electoral Rolls of 2021, published on 20th January, 2021 - Assembly Constituency-wise Electors". ceopuducherry.py.gov.in. 20 January 2021. Archived from the original on 7 March 2021. Retrieved 7 March 2021.

వెలుపలి లంకెలు[మార్చు]