పువ్వుల రాజేశ్వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జననంరాజేశ్వరి పువ్వుల
1948 ఫిబ్రవరి 28
విజయనగరం
నివాస ప్రాంతంవిజయనగరం
ఇతర పేర్లురాజేశ్వరి పువ్వుల
ప్రసిద్ధిరంగస్థల కళాకారులు
తండ్రిసి.హెచ్. జగన్నాధరావు
తల్లిపైడి రాజమ్మ

వీరు 1948 ఫిబ్రవరి 28న శ్రీమతి పైడి రాజమ్మ, సి.హెచ్. జగన్నాథరావు దంపతులకు విజయనగరంలో జన్మించారు. శ్రీకృష్ణతులాభారం (సత్యభామ), సీతాకళ్యాణం (సీత), వేంకటేశ్వర మహాత్మ్యం (పద్మావతి), చింతామణి (చింతామణి), బాలనాగమ్మ (సంగు), బొబ్బిలియుద్ధం (మల్లమ్మ) మొదలగు పద్యనాటకాల్లో పాత్రధారణ గావించారు.

పోతుగడ్డ, ఆశ్రయం, అతిథి, రాతి మనిషి, మహనీయులు, తప్పెవరిది, శిరోమణి, దొంగాటకం, పంజరం, రాగశోభిత, కృష్ణపక్షం, ఉలిపికట్టె, కన్యాశుల్కం, బొమ్మా-బొరుసా, శ్రావణి, నాభూమి, నటనాలయం, ఎలుకలబోను, పరమాత్మా వ్యవస్థితః, సంఘం చెక్కిన శిల్పం, తులసితీర్థం, ఓటున్న ప్రజలకు కోటి దండాలు, హిరోషిమా, అతిథి దేవుళ్ళు, కరుణించని దేవతలు, పల్లెపడుచు, అన్నాచెల్లెలు, కులంలేని పిల్ల, సామ్రాట్ అశోక్, వలయం, కీర్తిశేషులు, బ్రహ్మ నీరాత తారుమారు, నారీనారీ నడుమ మురారీ, బొమ్మ డాట్ కామ్, పక్కింట్లో పుట్టండి మొదలగు సాంఘిక నాటక/నాటిక ప్రదర్శనల్లో శతాధికంగా పాత్రపోషణ గావించారు. రంగస్థల నటిగానేకాక రేడియో, టి.వి., సినిమాల్లోనూ నటించారు.

చాట్ల శ్రీరాములు, అత్తిలి కృష్ణారావు, కొర్రపాటి గంగాధరరావు, కె.ఎస్.టి. శాయి, దాడి వీరభద్రరావు, గొల్లపూడి మారుతీరావు, సాక్షి రంగారావు, పి.ఎల్. నారాయణ తదితర ప్రముఖుల సరసన నటించారు. రాఘవ కళానిలయం –నిడదవోలు, అభిరుచి – విజయవాడ, సుమధుర కళానికేతన్ – విజయవాడ, ఇమ్మడి లింగయ్య సరోజిని మెమోరియల్స్ – విజయవాడ తదితర సాంస్కృతిక సంస్థలచే సత్కారాలుపొందిన ఈవిడ, యల్.కె.ఎన్. రాజమండ్రి వారిచే రాఘవ, కన్నాంబ అవార్డులు అందుకొన్నారు.

మూలాలు[మార్చు]

రాజేశ్వరి పువ్వుల, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 84.