ప్రసాద్ పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసాద్ పథకం (PRASAD)
దేశంభారతదేశం
ప్రధానమంత్రి(లు)నరేంద్ర మోదీ
ప్రారంభం2014-15
స్థితిఅమలులో ఉంది
వెబ్ సైటుhttps://tourism.gov.in/schemes-and-guidelines/schemes/scheme-guidelines-prasad

ప్ర‌సాద్ పథకం - భారతదేశం అంతటా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి పరచడం తద్వారా మతపరమైన పర్యాటక అనుభవాన్ని సుసంపన్నం చేసే పథకం.[1][2] తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధే లక్ష్యంగా ఈ పథకాన్ని 2014-15లో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రసాద్ (PRASHAD) పథకం అనగా తీర్థయాత్ర పునరుజ్జీవనం, స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (Pilgrimage Rejuvenation And Spirituality Augmentation Drive).

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, అన్నవరం, సింహాచలం, తెలంగాణలోని రామప్ప, భద్రాచలం, జోగులాంబ పుణ్యక్షేత్రాలను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసి ప్రసాద్ పథకం కింద అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతుండగా కేంద్ర ప‌ర్యాట‌కశాఖ మంత్రి కిష‌న్ రెడ్డికి తెలుగు రాష్ట్రాలనుంచి మరికొన్ని ప్రాంతాలను ప‌ర్యావ‌ర‌ణ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా మ‌లిచేందుకు వినతులు వస్తున్నాయి.[3]

నిధులు

[మార్చు]

ప్రసాద్ పథకం కింద పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని (CFA) అందిస్తుంది. ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం 100% ఖర్చులను భరిస్తుంది. అలాగే నిరంతర నిర్వహణకై పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP), కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు సమకూర్చుకోవాలి.

లక్ష్యాలు

[మార్చు]
  • తీర్థయాత్రలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధించడం.
  • స్థానిక కళలు, సంస్కృతి, హస్తకళలు, వంటకాలు మొదలైన వాటిని ప్రోత్సహించడం,.
  • పుణ్యక్షేత్రాలలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం.

వ్యూహం

[మార్చు]
  • తీర్థయాత్ర, మతపరమైన ప్రదేశం లేదా ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చగల సామర్థ్యం ఉన్న ప్రాంతాలను గుర్తించడం
  • అందుబాటులో ఉన్న స్థలాన్ని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించడం లేదా భూ యజమానులు, వాటాదారులను సంప్రదించి భూమిని సమీకరంచడం

గుర్తించబడిన తీర్థయాత్ర కేంద్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ramappa Temple: PRASAD Scheme:తెలంగాణకు కేంద్రం శుభవార్త.. రామప్ప ఆలయానికి మరో గుర్తింపు - pilgrimage rejuvenation and spiritual augmentation drive, prasad scheme, ramappa temple, | Samayam Telugu". web.archive.org. 2022-05-10. Archived from the original on 2022-05-10. Retrieved 2022-05-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "'ప్రసాద్‌' పథకంలో అన్నవరం - Andhrajyothy". web.archive.org. 2022-05-10. Archived from the original on 2022-05-10. Retrieved 2022-05-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "MP Lavu Sri Krishnadevarayulu urges Centre to develop Kotappakonda". web.archive.org. 2022-05-10. Archived from the original on 2022-05-10. Retrieved 2022-05-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)