అక్షాంశ రేఖాంశాలు: 27°34′21″N 77°40′21″E / 27.5724669°N 77.6724919°E / 27.5724669; 77.6724919

ప్రేమమందిరం (బృందావనం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమమందిరం
ప్రేమ మందిరం ప్రధాన ద్వారం
ప్రేమ మందిరం ప్రధాన ద్వారం
ప్రేమమందిరం is located in Uttar Pradesh
ప్రేమమందిరం
ప్రేమమందిరం
భౌగోళికాంశాలు :27°34′21″N 77°40′21″E / 27.5724669°N 77.6724919°E / 27.5724669; 77.6724919
పేరు
దేవనాగరి :प्रेम मंदिर, वृंदावन
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:ఉత్తర ప్రదేశ్
జిల్లా:మథుర
ప్రదేశం:బృందావనం
ఎత్తు:169.77 మీ. (557 అ.)
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సీత రాముడు, రాధ కృష్ణ
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :రాజస్థానీ నిర్మాణశైలి,సోమనాథ్ నిర్మాణశైలి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:2012
ప్రేమమందిరం కాంప్లెక్స్ లో కాంటీన్

ప్రేమమందిరం ప్రసిద్ధ హిందూపుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని మధుర లోని బృందావనంకు సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయాలలో నవీనమైనది. ఈ దేవాలయ నిర్మాణం ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు అయిన "క్రిపాలు మహారాజ్" చే స్థాపించబడింది..[1]

విశేషాలు

[మార్చు]

ఈ దేవాలయ ప్రధాన నిర్మాణం చలువరాతితో తయారై అందంగా కనిపిస్తుంది. ఈ కట్టడం సనాతన ధర్మం యొక్క నిజమైన ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం నలువైపులా శ్రీకృష్ణుడు, అతని అనుయాయులతో కూడిన ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి.[2] ఈ దేవాలయ శంకుస్థాపన 2001 జనవరిలో "క్రిపాలు మహరాజ్" అనే ఆధ్యాత్మిక గురువుచే చేయబడింది.[3] ఈ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఫిబ్రవరి 17 2012 న జరిగినవి.[4] ఈ దేవాలయం ప్రజల దర్శనార్థం ఫిబ్రవరి 17 నుండి ప్రారంభించబడింది. ఈ దేవాలయ నిర్మాణ ఖర్చు 150 కోట్లు ($23 మిలియన్లు) అయినది.[5] ఈ దేవాలయ ప్రధాన దైవం రాధా గోవింద (రాధా కృష్ణ), శ్రీ సీతారామ. 73,000 చదవపు అడుగులు, చిన్న పిల్లరు, గోపురం ఆకారంలో గల సత్సంగ భవనం కూడా ప్రేమమందిరం నిర్మాణం తరువాత నిర్మింపబడుతున్నది. ఈ సత్సంగ భవనంలో ఒకేసారి 25,000 మంది ప్రజలు ప్రార్థనలు చేసుకొనే వీలుంది.[6]

నిర్మాణం

[మార్చు]

ఈ బృందావన ప్రాంతం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన "కృపాలు మహారాజ్" చే అభివృద్ధి చేయబడింది. ఈయన ప్రధాన ఆశ్రమం కూడా బృందావనం లోనే ఉంది.[7] ఈ దేవాలయ నిర్మాణ పనులు జనవరి 14 2001 మొదలుపెట్టడం జరిగింది. దీని నిర్మాణంలో 800 మంది కళాకారులు,నైపుణ్యముగల పనివారు, నిపుణులు పాలుపంచుకున్నారు. వీరు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రి,పగలు నిరంతరం కృషి చేసి అసలైన సోమనాథ్ దేవాలయం శైలిలోనే పూర్తిగా మార్బుల్స్ తో నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. దీనికయ్యే ఖర్చు 150 కోట్లు. దీని నిర్మాణానికి 30,000 టన్నుల ఇటాలియన్ మార్బుల్స్ వాడిరి. దీని నిర్మాణం కోసం మార్బుల్స్ చెక్కుటకు ప్రత్యేకంగా కూకా రోబోటిక్ యంత్రాలను వాడారు. ఈ దేవాలయం పొడవు 122 అడుగులు, వెడల్పు 115 అడుగులు.[8] దక్షిణ భారతదేశ సంస్కృతి ప్రభావం ఈ దేవాలయ నిర్మాణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయ ప్లాను, డిసైనింగ్ పనులు గుజరాత్కు చెందిన సుమన్, మనోజ్ భాయి సోంపురా లచే చేయబడింది. ఇది మందమైన గోడలు, స్వచ్ఛమైన మార్బుల్స్ కలిగిన భారీ మార్బుల్ నిర్మాణం. ఈ దేవాలయ ప్రధాన దేవతలు రాధాకృష్ణులు.

ఆలయ కార్యకలాపాల వివరాలు

[మార్చు]
షెడ్యూలు
  • ఉ. 5.30 : ఆర్తి, పరిక్రమ.
  • ఉ. 6.30 : భోగం, ప్రధాన మందిరం తలుపుల మూసివేత.
  • ఉ. 8.30 : దర్శనం, ఆర్తి
  • ఉ. 11.30 : భోగం.
  • మ. 12.00 : శయన ఆర్తి గూర్చి తలుపుల మూసివేత.
  • సా.4.30 : ఆర్తి, దర్శనం
  • రా. 8.00 : శయన ఆర్తి
  • రా. 8.30 : తలుపుల మూసివేత.
మ్యూసికల్, డిజిటల్ ఫౌంటైన్
    • వేసవికాలంలో : 7.30PM నుండి 8.00PM
    • శీతాకాలంలో : 7.00PM నుండి 7.30PM

కాంప్లెక్స్ లో సదుపాయములు

[మార్చు]
  • పాదరక్షలు ఉచితంగా భద్రపరచుటకు క్లాక్ రూం.
  • ఆహార మరియుపానీయాలకు భోజనఫలహారశాల
  • దేవాలయంలో పరిమితంగా వాహనాలను పార్కింగ్ చేయు స్థలం, ఎక్కువగా రోడ్డు ప్రక్కనే అవకాశం ఉంది.
  • వ్యక్తిగతమైన వస్తువులు అనగా కెమేరా, మొబైల్, హాండ్ బ్యాగులు మొదలగునవి తీసుకుని రావచ్చు. పొగతాగుట నిషిద్ధం.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Famous Krishna Temples in India : Prem Mandir
  2. "Kripaluji Maharaj's Prem Mandir will be inaugurated on 17th February-Aaj Ki Khabar". Archived from the original on 2014-03-30. Retrieved 2014-04-25.
  3. 1000 कारीगरों ने 11 साल में बनाया 'प्रेम मंदिर'!. [Dainik Bhaskar]. Retrieved April 6th 2014
  4. "Prem Mandir Inauguration (Vrindavan) | Jagadguru Kripaluji Yog". Archived from the original on 2014-03-29. Retrieved 2014-04-25.
  5. "Dream Of "एक झोंपड़ी हो कृष्ण के बृज में" Now Becomes A Reality". Archived from the original on 2014-03-30. Retrieved 2014-04-25.
  6. ब्रज का आकर्षण प्रेम मंदिर. [Dainik Jagran]. Retrieved April 6th 2014
  7. Sahara Samay Kripaluji Maharaj's 'Prem Mandir' inauguration on Friday Archived 2015-04-02 at the Wayback Machine FEBRUARY 13, 2012 "The much long awaited temple of Kripaluji Maharaj's 'Prem Mandir' will be inaugurated on Friday 16th for public in Vrindaban district of Uttar Pradesh."
  8. Agratoday News Service. 1 July 2010. Dream Of “एक झोंपड़ी हो कृष्ण के बृज में” Now Becomes A Reality Archived 2014-01-11 at the Wayback Machine. Retrieved 28 Dec 2011.

ఇతర లింకులు

[మార్చు]