పవర్ ప్లే
పవర్ ప్లే | |
---|---|
దర్శకత్వం | విజయ్ కుమార్ కొండా |
నిర్మాత | మహిధర్, దేవేశ్ |
తారాగణం | రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ |
ఛాయాగ్రహణం | ఐ. ఆండ్రూ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థ | వనమాలి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 5 మార్చి 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పవర్ ప్లే 2021లో విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా. వనమాలి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శ్రీమతి పద్మ సమర్పణలో దేవేష్, మహిధర్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 5 మార్చ్ 2021లో విడుదలైంది.
కథ
[మార్చు]విజయ్ (రాజ్ తరుణ్) ఓ మధ్య తరగతి కుర్రాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. అతడికి కీర్తి (హేమల్) అనే అమ్మాయిని నిశ్చితార్థం జరుగుతుంది. జీవితం సాఫీగా సాగుతున్న ఆ సమయంలో అతను అనుకోకుండా దొంగ నోట్ల కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసులోంచి తనను ఎవరూ బయటపడేయలేని స్థితిలో తనే సొంతంగా పరిశోధన మొదలుపెడతాడు. అసలు విజయ్ ను ఈ కేసులో ఎవరు ఇరికించారు ? ఈ కేసు నుండి బయట పడటానికి విజయ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- రాజ్ తరుణ్ [2]
- హేమల్ ఇంగ్లే
- పూర్ణ
- ప్రిన్స్
- మధునందన్
- అజయ్
- సత్యం రాజేష్
- కోట శ్రీనివాసరావు
- రాజా రవీంద్ర
- ధన్రాజ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- సమర్పణ: శ్రీమతి పద్మ
- బ్యానర్: వనమాలి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
- నిర్మాతలు: మహిధర్, దేవేశ్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
- కథ-మాటలు: నంద్యాల రవి
- సంగీతం: సురేష్ బొబ్బిలి
- ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ
- కూర్పు: ప్రవీణ్ పూడి
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (5 March 2021). "రివ్యూ: పవర్ ప్లే - raj tarun power play telugu movie review". www.eenadu.net. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
- ↑ Telugu, TV9 (6 March 2021). "Raj Tarun : నేను ఇంతవరకు ట్రై చేయని కొత్త జోనర్లో చేసిన థ్రిల్లర్ మూవీ ఇది : యంగ్ హీరో రాజ్ తరుణ్ - raj tarun about his movie 'power play'". TV9 Telugu. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)