ఫ్రెంచి భారతదేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలో ఫ్రెంచి వలసలు
Établissements français dans l'Inde  (French)
Location of ఫ్రెంచి భారతదేశం
Capitalపాండిచ్చేరి
Government వలస పాలన
Legislature ఫ్రెంచి భారతదేశంలో ప్రతినిధుల సభ
Currency రూపీ

ఫ్రెంచి భారతదేశం అంటే, భారత ఉపఖండంలో భౌగోళికంగా విడివిడిగా ఉన్న ఐదు ఎన్‌క్లేవ్‌లతో కూడుకుని, ఫ్రెంచి వారి పాలనలో ఉన్న వలస ప్రాంతం. ఇది మొదట్లో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కర్మాగారాలు. అవి 1950, 1954లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. పాండిచ్చేరి, కారైకల్, కోరమాండల్ తీరంలో యానాం, మలబార్ తీరంలో మాహె, బెంగాల్‌లోని చందర్‌నగర్ లు ఈ ఎన్‌క్లేవ్‌లలో ఉన్నాయి. వీటితో పాటు, ఇతర పట్టణాలలో ఫ్రెంచి వారికి అనేక లాజ్‌లు కూడా ('లాడ్జీలు', చిన్న అనుబంధ వ్యాపార స్టేషన్లు) ఉన్నాయి. కానీ 1816 తర్వాత, బ్రిటిష్ వారు, వాటిపై ఫ్రెంచి వాదనలను తిరస్కరించారు. దానిపై ఫ్రెంచి వారు ఎదురు మాట్లాడలేదు.

1950 నాటికి, ఫ్రెంచి వలసల మొత్తం వైశాల్యం 510 కి.మీ2 (200 చ. మై.)కు చేరుకుంది. ఇందులో 293 కి.మీ2 (113 చ. మై.) పాండిచ్చేరి భూభాగానికి చెందినది. 1936 లో, వలస ప్రాంతపు మొత్తం జనాభా 2,98,851. అందులో 63% (1,87,870) మంది పాండిచ్చేరి భూభాగంలో నివసించేవారు.[1]

చరిత్ర

[మార్చు]

17 వ శతాబ్దంలో తూర్పు భారతదేశ వాణిజ్యంలోకి ప్రవేశించిన ప్రధాన యూరోపియన్ సముద్ర శక్తులలో ఫ్రాన్స్ చివరిది. ఇంగ్లీషు, డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీలు స్థాపించిన (1600, 1602లో) ఆరు దశాబ్దాల తర్వాత, ఆ రెండు కంపెనీలు భారతదేశ తీరంలో కర్మాగారాలను (ట్రేడింగ్ పోస్టులు) బహుళంగా స్థాపించుకుంటున్న సమయంలో, ఫ్రెంచివారు ఇంకా వ్యాపార సంస్థ లేదు, ఒక్క వ్యాపార శిబిరమూ లేదు.

భారతదేశానికి తొలి సముద్ర ప్రయాణాలు (16వ శతాబ్దం)

[మార్చు]

భారతదేశానికి మొట్టమొదటి ఫ్రెంచి వాణిజ్య యాత్ర 16వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో, కింగ్ ఫ్రాన్సిస్ I పాలనలో జరిగింది. తూర్పు సముద్రాలలో వ్యాపారం చేయడానికి రెండు ఓడలను రూయెన్ కు చెందిన కొంతమంది వ్యాపారులను పంపినపుడు జరిగింది. వారు లే హవ్రే నుండి వెళ్ళారు, ఆ తరువాత మళ్ళీ వాళ్ళ సంగతి తెలియరాలేదు. 1604 లో కింగ్ హెన్రీ IV ఒక కంపెనీకి లెటర్స్ పేటెంట్ మంజూరు చేసాడు గానీ, ఆ ప్రాజెక్టు విఫలమైంది. 1615 లో మరో అనుమతితో రెండు నౌకలు భారతదేశానికి వెళ్ళాయి. వాటిలో ఒకటి మాత్రమే తిరిగి వచ్చింది.[2]

1642 లో కార్డినల్ రిచెలీయు ఆధ్వర్యంలో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ (లా కంపానీ ఫ్రాన్స్వా దే ఇండీస్ ఓరియెంటాలెస్) ఏర్పడింది. 1664 లో దాన్ని పునర్నిర్మించి, జీన్-బాప్టిస్ట్ కోల్‌బర్ట్ ఆధ్వర్యంలో మడగాస్కర్‌కు యాత్రను పంపారు. [3][4]

భారతదేశంలో మొదటి కర్మాగారం (1668)

[మార్చు]

1667 లో ఫ్రెంచి ఇండియా కంపెనీ, ఫ్రాంకోయిస్ కారన్ (మర్కారా అనే పర్షియన్‌ అతనికి తోడుగా ఉండేవాడు) నేతృత్వంలో మరో సాహసయాత్రను పంపింది, అది 1668 లో సూరత్‌కు చేరుకుని భారతదేశంలో మొదటి ఫ్రెంచి ఫ్యాక్టరీని స్థాపించింది.[3][4]

భారతదేశంలో ఫ్రెంచి వారి విస్తరణ (1669-1672)

[మార్చు]

1669 లో, మసూలిపటంలో మరో ఫ్రెంచి ఫ్యాక్టరీని స్థాపించడంలో మార్కారా విజయం సాధించాడు. 1672 లో, ఫ్రెంచి వారు ఫోర్ట్ సెయింట్ థామస్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుదీర్ఘమైన, ఖరీదైన ముట్టడి తర్వాత డచ్చివారు వారిని తరిమికొట్టారు. బెంగాల్ మొఘల్ గవర్నర్ నవాబ్ షయిస్త ఖాన్ అనుమతితో 1692 లో చందర్‌నాగోర్ (ప్రస్తుత చందన్‌నగర్) లో స్థావరాన్ని స్థాపించుకున్నారు. 1673 లో ఫ్రెంచి వారు బీజాపూర్ సుల్తాన్ ఆధ్వర్యంలోని వాలికొండాపురం ఖిలాదార్ నుండి పాండిచ్చేరి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తద్వారా పాండిచేరికి పునాది పడింది. 1720 నాటికి, ఫ్రెంచి వారు సూరత్, మసూలిపటం, బాంటమ్‌లోని తమ కర్మాగారాలను బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి కోల్పోయారు.

పాండిచేరిలో కాలనీ స్థాపన (1673)

[మార్చు]

1673 ఫిబ్రవరి 4 న, బెల్లంజర్ డి ఎల్'ఎస్పినే అనే ఫ్రెంచి అధికారి పాండిచేరిలోని డానిష్ లాడ్జ్‌లో నివాసం ఏర్పరచుకుని, పాండిచేరిలో ఫ్రెంచి పరిపాలనను ప్రారంభించాడు. 1674 లో ఫ్రాంకోయిస్ మార్టిన్ అక్కడి మొదటి గవర్నరుగా, పాండిచ్చేరిని ఒక చిన్న మత్స్యకార గ్రామం నుండి అభివృద్ధి చెందుతున్న ఓడరేవు-పట్టణంగా మార్చడానికి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభించాడు. అయితే, ఫ్రెంచి వారు డచ్చి, ఆంగ్లేయులతో నిరంతరం పోరులో ఉండేవారు. 1693 లో డచ్చి వారు పాండిచ్చేరిని స్వాధీనం చేసుకుని కోటలను బలోపేతం చేసారు. 1697 సెప్టెంబరు 20 న చేసుకున్న రిస్విక్ ఒప్పందం ద్వారా ఫ్రెంచి వారు 1699 లో ఆ పట్టణాన్ని తిరిగి పొందారు.

యానాం (1723), కారైకల్ (1739)లో కాలనీల స్థాపన

[మార్చు]

బ్రిటిషు వారి లాగానే ఫ్హ్రెంచి వారు వచ్చినప్పటి నుండి 1741 వరకు, వారి లక్ష్యాలు పూర్తిగా వాణిజ్యపరమైనవి. ఈ కాలంలో, ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ 1723 లో యానాం, 1725లో మలబార్ తీరంలో మాహే, కారైకాల్ లను శాంతియుతంగా స్వాధీనం చేసుకుంది. 1739 లో 18వ శతాబ్దం ప్రారంభంలో, పాండిచేరి పట్టణాన్ని ఒక గ్రిడ్ నమూనాలో నిర్మించారు. అది గణనీయంగా విస్తరించింది. పియరీ క్రిస్టాఫ్ లే నోయిర్ (1726–1735), పియరీ బెనోయిట్ డ్యుమాస్ (1735–1741) వంటి సమర్థులైన గవర్నర్లు పాండిచేరి ప్రాంతాన్ని విస్తరించి, దానిని పెద్ద పట్టణంగా మార్చారు.

భారతదేశంలో ఫ్రెంచి సామ్రాజ్య స్థాపన ఆశయం, ఓటమి (1741–1754)

[మార్చు]

1741 లో ఫ్రెంచి భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గవర్నర్, జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ వచ్చిన వెంటనే, తన ఉన్నతాధికారుల, ఫ్రెంచి ప్రభుత్వపు ఆసక్తి లేని వైఖరిని గమనించినప్పటికీ, భారతదేశంలో ఫ్రెంచి ప్రాదేశిక సామ్రాజ్య స్థాపన ఆశయాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. బ్రిటిష్ వారిని రెచ్చగొట్టడం ఇష్టం లేదు. డుప్లెక్స్ ఆశయం భారతదేశంలోని బ్రిటిషువారి ప్రయోజనాలతో విభేదించింది. ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్లు అధికారికంగా శాంతితో కాలాల్లో కూడా సైనిక ఘర్షణలు జరిగాయి. మార్క్విస్ డి బస్సీ-కాస్టెల్‌నౌ ఆధ్వర్యంలో, డుప్లెక్స్ సైన్యం హైదరాబాద్, కేప్ కొమోరిన్ మధ్య ప్రాంతాన్ని విజయవంతంగా నియంత్రించింది. అయితే, రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిషు అధికారి 1744లో భారతదేశానికి వచ్చి, భారతదేశంలో ఫ్రెంచి సామ్రాజ్యాన్ని సృష్టించాలనే డుప్లెక్స్ ఆశలను వమ్ము చేశాడు.

ఓటమి, విఫలమైన శాంతి చర్చల తరువాత, డుప్లెక్స్‌ తప్పుకోవలసి వచ్చింది. అతన్ని 1754 లో ఫ్రాన్స్‌కు వెనక్కి పిలిపించారు.

ఫ్రెంచి vs బ్రిటిష్ కుట్రలు (1754–1871)

[మార్చు]

భారతదేశంలోని వ్యవహారాల్లో పరస్పరం జోక్యం చేసుకోకూడదని బ్రిటిషు, ఫ్రెంచి వారి మధ్య ఒప్పందం జరిగినప్పటికీ, వారి వలసవాద కుట్రలు కొనసాగాయి. ఫ్రెంచి వారు బెంగాల్ నవాబు ఆస్థానంలో తమ ప్రభావాన్ని పెంచుకుని, బెంగాల్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను పెంచుకున్నారు. 1756లో, ఫ్రెంచి వారు కలకత్తాలో బ్రిటిషువారి ఫోర్ట్ విలియంపై దాడి చేసి స్వాధీనం చేసుకోమని నవాబు సిరాజ్ ఉద్-దౌలాని ప్రోత్సహించారు. ఇది 1757లో ప్లాసీ యుద్ధానికి దారితీసింది, ఇక్కడ బ్రిటిషు వారు నవాబును, అతని ఫ్రెంచి మిత్రులనూ నిర్ణయాత్మకంగా ఓడించారు. ఫలితంగా బెంగాల్ ప్రావిన్స్ మొత్తం మీద బ్రిటిషువారి అధికారం విస్తరించింది.

తదనంతరం, కోల్పోయిన ఫ్రెంచి ఆస్తులను తిరిగి పొందేందుకూ, భారతదేశం నుండి బ్రిటిష్ వారిని వెళ్లగొట్టడానికీ ఫ్రాన్స్, లాలీ-టోలెండల్‌ను పంపింది. లాలీ 1758 లో పాండిచ్చేరికి చేరుకుని, మొదట్లో కొంత విజయం సాధించి, 1758లో కడలూర్ జిల్లాలోని సెయింట్ డేవిడ్ కోటను నేలమట్టం చేశాడు. అయితే లాలీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు హైదరాబాద్ ప్రాంతాన్ని కోల్పోవడానికి, వాండివాష్ యుద్ధం, పాండిచ్చేరి ముట్టడికీ దారితీసింది. 1760. 1761లో, ఫ్రెంచి దోపిడీలకు ప్రతీకారంగా బ్రిటిషు వారు పాండిచేరిని నేలమట్టం చేశారు; అది నాలుగేళ్లపాటు శిథిలావస్థలో పడింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా ఫ్రెంచివారు పట్టు కోల్పోయారు.

1765 లో బ్రిటన్‌తో 1763 లో చేసుకున్న శాంతి ఒప్పందం ప్రకారం, పాండిచేరి ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చింది. గవర్నర్ జీన్ లా డి లారిస్టన్ పట్టణాన్ని దాని పూర్వపు లేఅవుట్‌లో పునర్నిర్మించాడు. ఐదు నెలల తర్వాత 200 యూరోపియన్, 2000 తమిళ గృహాలను నిర్మించారు. 1769 లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ, ఆర్థికంగా తనను తాను పోషించుకోలేని పరిస్థితికి చేరినపుడు, ఫ్రెంచి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి, భారతదేశంలో ఫ్రెంచి ఆస్తుల పరిపాలనను స్వయంగా చేపట్టింది. తరువాతి 50 సంవత్సరాలలో, ఇరు దేశాల యుద్ధాలు, శాంతి ఒప్పందాలను అనుసరించి పాండిచేరి ఫ్రాన్స్ బ్రిటన్‌ల మధ్య చేతులు మారింది.

1816లో, నెపోలియన్ యుద్ధాలు ముగిసిన తర్వాత, పాండిచ్చేరి, చందర్‌నాగోర్, కారైకల్, మహే, యానాం - ఈ ఐదు స్థావరాలనూ, మచిలీపట్నం, కోజికోడ్, సూరత్‌లోని లాడ్జీలనూ ఫ్రెంచి వారు తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. పాండిచేరి దాని పూర్వ వైభవాన్ని కోల్పోగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిటిష్ మహానగరమైన కలకత్తాకు ఉత్తరాన చందర్‌నాగోర్ ఒక చిన్న ఔట్‌పోస్ట్‌గా మారింది. తదుపరి 138 సంవత్సరాలలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, చట్టం, విద్యను మెరుగుపరచడానికి వరుసగా వచ్చిన గవర్నర్‌లు ప్రయత్నించారు.  

స్వాతంత్ర్య ఉద్యమం (18వ-20వ శతాబ్దం), భారతదేశంలో విలీనం (1954)

[మార్చు]

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం తరువాత, మాజీ బ్రిటిష్ ఇండియాతో ఫ్రెంచి భూభాగాల విలీనానికి ఊపు వచ్చింది. మచిలీపట్నం, కోజికోడ్, సూరత్‌ల లోని లాడ్జీలు 1947 అక్టోబరు 6 న భారతదేశంలో విలీనమయ్యాయి.[5] 1948 లో ఫ్రాన్స్, భారతదేశాల మధ్య జరిగిన ఒక ఒప్పందంలో, ఫ్రెంచి భూభాగాల్లోని ప్రజలు తమ రాజకీయ భవిష్యత్తును ఎంచుకోవడానికి ఎన్నికలు జరపాలని అంగీకరించారు. చందర్‌నాగోర్‌ను 1950 మే 2 న భారతదేశానికి అప్పగించారు. దాన్ని 1954 అక్టోబరు 2 న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విలీనం చేసారు. 1954 నవంబరు 1 న పాండిచ్చేరి, యానాం, మాహే, కారైక్కల్ లను ఇండియన్ యూనియన్‌కి బదిలీ చేసారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. భారతదేశంతో చేసుకున్న ఒప్పందాన్ని 1962 లో పారిస్‌లోని ఫ్రెంచి పార్లమెంటు ఆమోదించే వరకు ఫ్రెంచి వలస ప్రాంతాలు భారతదేశంలో విలీనం అధికారికంగా జరగలేదు.

భారతదేశంలోని ఫ్రెంచి స్థావరాల జాబితా

[మార్చు]

1839 నాటికి భారత ద్వీపకల్పంలో ఫ్రెంచి స్థాపనలు: [6]

  1. కోరమాండల్ తీరం,
    • పాండిచ్చేరి, దానిలో ఉన్న పాండిచ్చేరి, విల్లెనూర్, బహౌర్ జిల్లాలు.
    • కారైకల్, దాని మీద ఆధారపడిన మాగ్నమ్స్ లేదా జిల్లాలు.
  2. ఆంధ్రప్రదేశ్ తీరంలో,
  3. మలబార్ తీరం,
  4. బెంగాల్...
  5. గుజరాత్...

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. The French Factory at Masulipatam was founded in 1669
  2. It is the largest and most significant loge among all others and was located on the outskirts of Masulipatam. It included two bungalows, a chapel and some other buildings. Its total area is around 61 acres (0.28sqkm).[7]: 64 
  3. This French Loge was within the British-held Calicut town and consisted of 6 acres on the seashore about half a mile north of the Calicut Lighthouse and adjoins the old district jail site.
  4. This factory supplied silk goods cargoes and situated in the heart of silk belt.
  5. This factory supplied ordinary fabrics to the French East India Company. It was established in 1735 by Dupleix.
  6. This factory exported muslins of 4 lakh rupees per annum by the mid-eighteen century. It was founded in 1722.
  7. This factory was founded at the end of the seventeenth century but suffered from a lack of proper road transport and it lost its commercial activity during the next century.
  8. This factory used to sell drapes from Europe and bought saltpetre and opium. It was founded in 1727.
  9. This factory was founded in 1668 after securing a firman and a factory site from Emperor Aurangazeb.

మూలాలు

[మార్చు]
  1. Jacques Weber, Pondichéry et les comptoirs de l'Inde après Dupleix, Éditions Denoël, Paris, 1996, p. 347.
  2.  One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "India, French". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press.
  3. 3.0 3.1 Lach, Donald Frederick (1998), Asia in the making of Europe, University of Chicago Press, p. 747, ISBN 9780226467672Lach, Donald Frederick (1998), Asia in the making of Europe, University of Chicago Press, p. 747, ISBN 9780226467672.
  4. 4.0 4.1 Benians, Ernest Alfred; Newton, Arthur Percival; Rose, John Holland (1940), The Cambridge history of the British Empire, p. 66Benians, Ernest Alfred; Newton, Arthur Percival; Rose, John Holland (1940), The Cambridge history of the British Empire, p. 66.
  5. Accord par échange de lettres relatif à la date de la cession des anciennes loges françaises de l'Inde au gouvernement de l'Inde [Agreement by exchange of letters relating to the date of the cession of the former French lodges of India to the Government of India] (in French). Paris: Ministère de l'Europe et des Affaires étrangères. 1947. p. 5. Archived from the original on 2 సెప్టెంబర్ 2022. Retrieved 2 September 2022. the Government of India note and accept with pleasure the decision of the Government of France that October 6th will be the day from which the historic rights which France has exercised in the areas known as the French Loges in India will be renounced. {{cite book}}: Check date values in: |archive-date= (help)CS1 maint: unrecognized language (link)
  6. Chapitre II, Notices statistiques sur les colonies françaises, 1839.
  7. Thomas Bowrey (1993). A Geographical Account of Countries Round the Bay of Bengal, 1669 to 1679. Asian Educational Services. ISBN 9788120608481.
  8. Claude Markovits (2004). A History of Modern India, 1480-1950. Anthem Press. p. 210. ISBN 9781843311522.