Jump to content

బిష్ణుపూర్

అక్షాంశ రేఖాంశాలు: 24°38′00″N 93°46′00″E / 24.6333°N 93.7667°E / 24.6333; 93.7667
వికీపీడియా నుండి
బిష్ణుపూర్
పట్టణం
బిష్ణుపూర్ is located in Manipur
బిష్ణుపూర్
బిష్ణుపూర్
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
బిష్ణుపూర్ is located in India
బిష్ణుపూర్
బిష్ణుపూర్
బిష్ణుపూర్ (India)
Coordinates: 24°38′00″N 93°46′00″E / 24.6333°N 93.7667°E / 24.6333; 93.7667
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాబిష్ణుపూర్
జనాభా
 (2001)
 • Total16,704
భాషలు
 • అధికారికమీటిలాన్ (మణిపురి)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795126
Vehicle registrationఎంఎన్

బిష్ణుపూర్, మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. 15వ శతాబ్దంలో స్థాపించబడిన పురాతన విష్ణు ఆలయం నుండి దీనికి ఈ పేరు వచ్చింది.

పౌర పరిపాలన

[మార్చు]

మున్సిపల్ కౌన్సిల్ గా మారిన బిష్ణుపూర్ పట్టణంలో 12 వార్డులు ఉన్నాయి.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [1] ఈ పట్టణంలో సుమారు 16,704 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% (5,324) మంది పురుషులు, 48% (4,940) మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 82% ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 82% కాగా, స్త్రీల అక్షరాస్యత 72%గా ఉంది. మొత్తం జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఈ పట్టణంలో మీటీలు, పంగలులు (మణిపురి ముస్లింలు), షెడ్యూల్డ్ తెగలవారు ఉన్నారు.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

వ్యవసాయం

[మార్చు]

వ్యవసాయం, ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. ఈ ప్రాంతంలో వరి, బంగాళాదుంప, క్యాబేజీ, పప్పుధాన్యాలు, వంకాయ, టమాటో మొదలైన పంటలు పండిస్తారు.

పర్యాటక ప్రాంతాలు

[మార్చు]

ఇది అనేక పర్యాటక ప్రాంతాలకు నిలయంగా ఉంది.[2]

  1. విష్ణు దేవాలయం: ఇది 15వ శతాబ్దంలో నిర్మించిన పురాతన విష్ణు దేవాలయం. ప్రస్తుత మయన్మార్‌లోని కబావ్ లోయలోని కయాంగ్‌ (షాన్ రాజ్యం) ను పాంగ్ రాజు చౌఫా ఖే ఖోంబాతో పాటు మణిపూర్ రాజు కయాంబా స్వాధీనం చేసుకున్నాడు. ఆ విజయంతో సంతోషించిన పాంగ్ రాజు, కయాంబ రాజుకు విష్ణువు విగ్రహాన్ని కానుకగా ఇచ్చాడు. కయాంబ రాజు ఈ విగ్రహాన్ని ఆరాధించడం ప్రారంభించాడు. దాంతో అది బిష్ణుపూర్ (విష్ణువు నివాసం) గా పిలువబడింది. ఆ తరువాత రాజు అక్కడ విష్ణు ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు అది భారత ప్రభుత్వ పురావస్తు మంత్రిత్వ శాఖ పరిధిలో రక్షిత చారిత్రక కట్టడంగా మార్చబడింది.
  2. రాస్మంచ
  3. జోరేబంగ్ల ఆలయం
  4. పంచరత్న ఆలయం
  5. దాల్ మదోల్
  6. సుసునియా పహార్
  7. శ్యామ్రాయ్ ఆలయం
  8. సిద్ధేశ్వర్ ఆలయం
  9. రాధా శ్యామ్ ఆలయం
  10. శ్రీధర ఆలయం

రాజకీయాలు

[మార్చు]

ఇది మణిపూర్ ఇన్నర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 7 January 2021.
  2. "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 7 January 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]