Jump to content

బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే

వికీపీడియా నుండి
బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే (జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే 7)
Map Bengaluru-Chennai Expressway.svg
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI)
పొడవు258 కి.మీ. (160 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరహోస్కోటె,కర్ణాటక
తూర్పు చివరశ్రీపెరుంబుదూరు, కాచీపురం జిల్లా, తమిళనాడు
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలు
Districts
Towns
రహదారి వ్యవస్థ

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు, చెన్నై నగరాల మధ్యనిర్మాణంలో ఉన్న 258 కి.మీ. (160 మై.) పొడవున్న, 4- వరుసల[1] యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వే. కేంద్ర ప్రభుత్వం దీన్ని నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే 7 (NE-7) గా గుర్తించింది. ఇది బెంగళూరు మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని హోస్కోట్ నుండి చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలోని శ్రీపెరంబుదూర్ వరకు నడుస్తుంది. 120 కిమీ./గం వేగంతో వాహనాలు వెళ్ళేలా ఈ రహదారిని నిర్మిస్తారు.[2] 2021 జనవరి 1 న ఈ రహదారిని జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేగా ప్రకటించారు.[3] మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం 17,930 కోట్లు.[4] ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం 2025 చివరికల్లా పూర్తవుతుందని భావిస్తున్నట్లు జాతీయ రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పాడు.[5][6][7]

వేలూరు జిల్లాలోని మేల్పాడి, రాణిపేట్ జిల్లాల్లోని పొనపంతంగల్ ల వద్ద ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటౌతాయి. స్థిరాస్తి వ్యాపారాల కోసం ఇవి ప్రధాన కూడలి కేంద్రాలుగా ఉంటాయి.[8]

కొత్త ప్రాజెక్టు

[మార్చు]

టాటా మోటార్స్ రాణిపేటలో ₹ 9,000 కోట్ల కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఖరారు చేసింది. ఇది రాణిపేట జిల్లాలోని నెమిలి తాలూకాలో చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే వెంట పొనపంతంగల్ - పనపాక్కం రహదారికి సమీపంలో ఉంది. ఇక్కడి రియల్ ఎస్టేట్ ధరలు 25 రెట్లు పెరిగాయి.

నిర్మాణం

[మార్చు]

258 కి.మీ. పొడవున ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులను NHAI మొత్తం 10 ప్యాకేజీలతో 3 దశలుగా విభజించింది. 6 నిర్మాణ సంస్థలు ఏకకాలంలో నిర్మాణం చేస్తారు.

సర్. నం ప్యాకేజీ కిమీలో పొడవు కాంట్రాక్టర్
1. హోస్కోటే - మలూరు 18 దిలీప్ బిల్డ్‌కాన్ [9]
2. మాలూరు - బంగారపేట 27.1 దిలీప్ బిల్డ్‌కాన్ [9]
3. బంగారుపేట - బేతమంగళ 17.5 KCC బిల్డ్‌కాన్

ఫేజ్-2

[మార్చు]
సర్. నం ప్యాకేజీ కిమీలో పొడవు కాంట్రాక్టర్
1. బేతమంగళ - బైరెడ్డిపల్లె 25.0 మోంటెకార్లో కన్‌స్ట్రక్షన్
2. బైరెడ్డిపల్లె - బంగారుపాలెం 31.0 ఆప్కో ఇన్‌ఫ్రాటెక్ [10]
3. బంగారుపాలెం - గుడిపాల 29.0 దిలీప్ బిల్డ్‌కాన్

ఫేజ్-3

[మార్చు]
సర్. నం ప్యాకేజీ కిమీలో పొడవు కాంట్రాక్టర్
1. గుడిపాల - వాలాజాపేట 24.0 మోంటెకార్లో కన్‌స్ట్రక్షన్
2. వాలాజపేట్టై - అరక్కోణం 24.5 KCC బిల్డ్‌కాన్
3. అరక్కోణం - కాంచీపురం 25.5 DP జైన్ & కో.
4. కాంచీపురం - శ్రీపెరంబుదూర్ 32.1 రామలింగం కన్‌స్ట్రక్షన్ కంపెనీ

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sharma, Anurakti (6 January 2023). "Bengaluru-Chennai Expressway to be completed by March 2024". Times Now (in ఇంగ్లీష్). Retrieved 10 January 2023.
  2. "Project report on Chennai Expressway may get ready by March". The Hindu. 21 October 2011. Archived from the original on 2 May 2012. Retrieved 16 August 2012.
  3. Gazette notification dated 1 January 2021
  4. Akram Mohammed (December 18, 2018). "Expressway to reduce travel time between Bengaluru, Chennai". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved March 23, 2023.
  5. Vivan, Sridhar (7 December 2023). "Bengaluru-Chennai Expressway to be ready only by July 2025". Bangalore Mirror. Retrieved 26 January 2024.
  6. "Bangalore–Chennai Expressway – Information & Status". Metro Rail Guy. Retrieved 26 January 2024.
  7. "Bengaluru-Chennai Expressway to be operational in January 2024: Nitin Gadkari". The Hindu. Retrieved 26 January 2024.
  8. "Real Estate in Bangalore & Chennai to get elevated with the upcoming Bangalore-Chennai Expressway!". www.sulekha.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-05-05.
  9. 9.0 9.1 "Dilip Buildcon declared L1 bidder for projects worth Rs 2,439 crores". Business Standard. 24 February 2021.
  10. "Apco will build NHAI's Bangalore-Chennai Expressway segment". Construction World. 18 March 2021.