బైరు రఘురాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైరు రఘురాం
జననం1949
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
రంగంచిత్రకారుడు

బైరు రఘురాం (జననం 1949) తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు.[1] అతని చిత్రాలు సరళమైనవిగా, గ్రామీణ జీవిత నేపథ్యం, రోజువారీ జీవితంలో స్త్రీల జీవన విధానం గురించి ఉంటాయి. ఇతను ఎక్కువగా తెలంగాణ గ్రామీణ జీవన విధానం నుండి స్ఫూర్తిని పొందాడు.

తొలి జీవితం

[మార్చు]

బైరు రఘురాం 1949లో బాలయ్య – రాములమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని ఇస్లామిక్‌ ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తిచేసి, తరువాత కర్ణాటకలోని ఐఎఫ్ఏఐ గుల్బర్గా నుండి డ్రాయింగ్, పెయింటింగ్‌లో డిప్లొమా పూర్తిచేశాడు.

ఉద్యోగం

[మార్చు]

1970 నుంచి ముప్పై మూడేండ్లపాటు జనాభా లెక్కల శాఖలో సీనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశాడు.

చిత్రకళారంగం

[మార్చు]

నాల్గవ తరగతి చదువుతున్న రోజులలోనే చిన్న చిన్న బొమ్మలు వేయడం ప్రారంభించాడు. ఒకరోజు రంగులలో చిన్న కృష్ణుడి బొమ్మచూసి అది ఉన్నదున్నట్టుగా గీశాడు. అది చూసిన ఉపాధ్యాయులు మెచ్చుకొని డ్రాయింగ్‌ లో శిక్షణ ఇచ్చారు. అంతర పాఠశాలల చిత్రకళ పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. బైరు రఘురాం వార, మాస పత్రికలకు ఫ్రీలాన్సర్‌ చిత్రకారుడిగా పనిచేశాడు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ మొదలైన జిల్లాలు పర్యటించి చిత్రాలను వేస్తాడు. తొలినాళ్ళలో డ్రాయింగ్‌లు, ఆ తర్వాత పెయింటింగ్‌లు, పిదప ఎచ్చింగ్‌ తదితర ప్రింటులు వేయడం, ప్రస్తుతం ఒకానొక తరహా ఆకృతి మారిన పెయింటింగ్‌ వేస్తున్నాడు.

ఎగ్జిబిషన్స్

[మార్చు]

1999లో అమెరికాలోని గ్లోబల్‌ విలేజ్‌ ఆర్ట్స్‌, 2001లో అమెరికాలోని మాస్‌ బెస్ట్‌ గ్రీన్‌ ఫీల్డ్‌లోని పుష్కిన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, 2005లో లండన్ నెహ్రూ సెంటర్ లో, హాంకాంగ్ లోని హాకాంగ్ విజువల్ సెంటర్ లో, 2006లో న్యూయార్క్‌లోని స్టోన్‌ సీన్స్‌ గ్యాలరీ, 2008లో దుబాయ్‌లోని దుబాయ్‌ కమ్యూనిటీ థియేటర్‌ అండ్‌ ఆర్ట్స్‌ సెంటర్‌, 2010లో దక్షిణ ఆఫ్రికాలోని సనావా ప్రిటోరియా, 2013లో రాయల్‌ ఒపెరా ఆర్కెడ్‌, లండన్‌లోని ఆర్ట్‌ గ్యాలరీ, న్యూయార్క్‌లోని జెడబ్ల్యు మారిట్‌ సెంట్రల్‌ పార్క్‌లు, 2008లో చెన్నైలోని అయ్యా ఆర్ట్ గ్యాలరీస్‌లో ట్రెజర్స్ ఆఫ్ ది సౌత్ పేరుతో చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాడు. ది ఐడియల్ ఫైన్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ (గుల్బర్గా, కర్ణాటక), లలిత కళా అకాడమీ (న్యూఢిల్లీ), విక్టోరియా క్యాపిటల్ వెంటారెస్ లిమిటెడ్ (ముంబై), హాల్‌బర్టన్ ఆయిల్‌ఫీల్డ్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (ముంబై), అలయన్స్ ఫ్రాన్సిస్ (హైదరాబాద్), భారత్ భవన్ (భోపాల్), యునైటెడ్ కింగ్ డమ్, యునైడెట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా మొదలైన ప్రాంతాలలో చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాడు.[2] ”గ్రాఫిక్‌ ఆర్ట్‌ ఇన్‌ ఇండియా”లో 1850 నుంచి ఎంపికైన చిత్రాలలో రఘురాం చిత్రం కూడా ఉంది.

అవార్డులు

[మార్చు]
 • ప్రతిభా పురస్కారం 2012 - తెలుగు విశ్వవిద్యాలయం, 2014[3][4]
 • భారత కళా పరిషత్ (1981, 1985)
 • హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుండి బంగారు పతకం (1990)
 • హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ అవార్డులు (1983, 1987, 1996)
 • కదలిక అనే ఇచ్చింగ్‌కు నేషనల్ అకాడమీ అవార్డు (1997)
 • ఆంధ్రప్రదేశ్‌ లలితకళా సమితి అవార్డులు (1987, 1989)
 • కేంద్ర సాంస్కృతికశాఖ ఫెలోషిప్‌ (2011)
 • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కళారత్న అవార్డు (2012)

ఇతర వివరాలు

[మార్చు]

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు తెలంగాణకు చెందిన చిత్రకళాకారులు నిర్వహించిన ‘‘ఆర్ట్‌ బియాండ్‌ బౌండరీ్‌స’’(ఎల్లలెరుగని కళావైభవం) కళాశిబిరంలో రఘురాం కూడా పాల్గొన్నాడు.[5]

మూలాలు

[మార్చు]
 1. "చిత్తానికి హత్తుకునే చిత్రాలకు | Telangana Magazine". magazine.telangana.gov.in. Archived from the original on 2016-05-29. Retrieved 2021-09-20.
 2. "Artist Gellary - BAIRU RAGHURAM". goaartgallery.com. Retrieved 2021-09-20.
 3. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 20 September 2021. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 9 సెప్టెంబరు 2017 suggested (help)
 4. సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
 5. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (16 October 2015). "అమరావతికి టి- కళాకారుల చేయూత". andhrajyothy. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.

బయటి లింకులు

[మార్చు]