Coordinates: 27°15′N 92°24′E / 27.25°N 92.4°E / 27.25; 92.4

బోమ్‌డిలా

వికీపీడియా నుండి
(బొమ్డిలా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బోమ్‌డిలా
నగరం
బోమ్‌డిలా is located in Arunachal Pradesh
బోమ్‌డిలా
బోమ్‌డిలా
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో స్థానం
బోమ్‌డిలా is located in India
బోమ్‌డిలా
బోమ్‌డిలా
బోమ్‌డిలా (India)
Coordinates: 27°15′N 92°24′E / 27.25°N 92.4°E / 27.25; 92.4
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లావెస్ట్ కమెంగ్
Elevation
2,415 మీ (7,923 అ.)
Population
 (2001)
 • Total6,685
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-AR
Vehicle registrationAR

బోమ్‌డిలా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ కమెంగ్ జిల్లా ప్రధాన పరిపాలనాకేంద్రం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో బోమ్‌డిలా ఒకటి.

బోమ్‌డిలా టౌన్
బోమ్‌డిలా లోని డిసి కార్యాలయం.

భౌగోళిక[మార్చు]

బోమ్‌డిలా 27°15′N 92°24′E / 27.25°N 92.4°E / 27.25; 92.4 వద్ద ఉంది. [1] ఇది 2415 మీటర్లు (7923 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.

వాతావరణం[మార్చు]

బోమ్‌డిలా ప్రాంతం తడి కాలంలో చల్లగా ఉంటుంది. ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. పొడి కాలం స్పష్టంగా చల్లగా ఉంటుంది. సంవత్సరంలో, ఉష్ణోగ్రత 31 °F నుండి 66 °F వరకు సాధారణంగా మారుతుంది. అరుదుగా 27 °F కన్నా తక్కువ లేదా 70 °F. పైన నమోదవుతుంది. [2]

జనాభా[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం బోమ్‌డిలా పట్టణ జనాభా మొత్తం 6685 మంది ఉండగా, అందులో పురుషులు 54% మందికాగా, స్త్రీలు 46% మంది ఉన్నారు. పట్టణ సరాసరి అక్షరాస్యత రేటు 69%, ఇది జాతీయ సగటు అక్షరాస్యత 59. 5%; కన్నా ఎక్కువ. పురుషు అక్షరాస్యులు 75% మంది ఉండగా, స్త్రీల అక్షరాస్యులు 63% మంది ఉన్నారు. పట్టణ జనాభాలో 6 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు 13% మంది ఉన్నారు. పట్టణ జనాభాలో మోన్పా, షేర్డుక్పెన్, మిజి, బుగన్ (ఖోవా), అకా తెగలుకు చెందిన ప్రజలునివసిస్తున్నారు. [3]

రవాణా[మార్చు]

కచ్చా రోడ్లు, కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, బోమ్‌డిలా గువహతి (264 కి.మీ.) నుండి చక్కటి రవాణా సౌకర్యం ఉంది. తవాంగ్ నుండి 167 కి.మీ., తేజ్‌పూర్ నుండి 162 కి.మీ. దూరంలో ఉంది. రహదారిలో ప్రయాణించేటప్పుడు కొండచరియలు విరిగిపడటం గురించి ముందుగా తెలుసుకోవాలి. సమీప విమానాశ్రయం తేజ్‌పూర్ (అస్సాం) లో ఉంది. ఇక్కడ బస్సులు, ఇతర చిన్న వాహనాలు సులభంగా పొందవచ్చు. సమీప రైల్వే స్టేషన్ బోమ్‌డిలా నుండి 145 కి. మీ. దూరంలో రంగపారా రైల్వే స్టేషన్ (అస్సాం). [4]

లక్షణాలు[మార్చు]

ఈగ్లెనెస్ట్ వన్యప్రాణుల అభయారణ్యం బోమ్‌డిలా సమీపంలో ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా పర్యాటకం బోమ్‌డిలాలో పెద్ద ఆదాయ వనరుగా మారింది. చాలా కొత్త హోటళ్ళు, హోమ్‌స్టేలు వచ్చాయి. తవాంగ్ వెళ్లే పర్యాటకులకు ఇది విశ్రాంతి కేంద్రంగా మారింది. ఇక్కడ చాలా ఆహారం స్థానిక వంటకాలుతో ఉంటాయి. అయితే ఉత్తర భారత ఆహారాన్ని కోరుటద్వారా పొందవచ్చు. బోమ్‌డిలా పాస్ కాంగ్టో, గోరిచెన్ శిఖరాల దృశ్యాలను అందిస్తుంది. ఇది రాష్ట్రంలో ఎత్తైంది. జిఆర్ఎల్ బౌద్ధ మఠం, బుద్ధ పార్క్, గురు రిన్‌పోచే విగ్రహం తప్పక చూడవలసిన ప్రదేశాలు. న్యూ బోమ్‌డిలా విమానాశ్రయం ద్వారా మొత్తం పట్టణ దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. పట్టణం చుట్టూ, ఆపిల్ తోటలు, ఆర్చిడ్ పొలాలు చాలా మందికి ఆసక్తి కలిగించే ప్రదేశాలు. మోర్షింగ్ గ్రామంలో 17 వ శతాబ్దపు చారిత్రక లగ్యాల ఆశ్రమం బోమ్‌డిలా నుండి 70 కి. మీ దూరంలో ఉంది

మీడియా[మార్చు]

బోమ్‌డిలాలో అఖిల భారత రేడియో ప్రసార కేంద్రం ఉంది. దీనిని ఆకాశవాణి, బోమ్‌డిలా అని పిలుస్తారు. ఇది ఎఫ్ఎమ్ పౌనఃపున్యాలపై ప్రసారం చేస్తుంది.

ప్రస్తావనలు[మార్చు]

  1. Falling Rain Genomics, Inc - Bomdila
  2. "Average Weather".
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  4. "How to Reach Bomdila".