బోగనంపాడు
బోగనంపాడు | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°16′59″N 79°48′00″E / 15.283°N 79.8°ECoordinates: 15°16′59″N 79°48′00″E / 15.283°N 79.8°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | పొన్నలూరు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,713 హె. (6,704 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 2,931 |
• సాంద్రత | 110/కి.మీ2 (280/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08599 ![]() |
పిన్(PIN) | 523111 ![]() |
బోగనంపాడు, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 111. ఎస్.టి.డి కోడ్:08599.
పెద్ద చెరువు:- గ్రామంలోని ఈ పురాతన చెరువు మండలంలోని పెద్దచెరువులలో ఒకటి. దీనిని ఎప్పుడో అంగ్లేయుల కాలంలో త్రవ్వించారు. ఈ చెరువుకు 250 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో పూడిక పేరుకుపోయి, 30% పైగా నీటి నిలువ సామర్ధ్యం కోల్పోయింది. దీనితో ఆయకట్టుదారులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుచున్నారు. ఈ పరిస్థితులలో ప్రభుత్వం, నీరు-చెట్టు కార్యక్రమం క్రింద, రు. 4.7 లక్షలు మంజూరుచేసి, ఈ చెరువులో 25 రోజులనుండి, మూడు జె.సి.బిలతో, పూడికతీత కార్యక్రమం పెద్ద యెత్తున చేపట్టినది. అయకట్టుదారులైన బోగనంపాడు, చెరువుకొమ్ముపాలెం, రాజోలుపాడు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు, సారవంతమైన పూడికమట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఇంత వరకు, 15,000 క్యూబిక్ మీటరల మట్టిని తరలించుకొనివెళ్ళినారు. మొత్తం 50,000 క్యూబిక్ మీటర్ల పూడికమట్టిని తరలించాలని ప్రభుత్వ లక్ష్యం. దీనివలన భూములలో దిగుబడులు గూడా పేరుగుతవి. భూగర్భజలాలు పెరుగుతవి. పంచాయతీ ఆదాయం గూడా పెరుగుతుంది. మండువేసవిలో గూడా చెరువులో సమృద్ధిగా నీరు నిలువ ఉంటుందని గ్రామస్థులు సంబరపడిపోవుచున్నారు.[2]
గణాంకాలు[మార్చు]
1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,610. ఇందులో పురుషుల సంఖ్య 1.361, మహిళల సంఖ్య 1,249, గ్రామంలో నివాస గృహాలు 586 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,713 హెక్టారులు.
2.జనాభా (2011) - మొత్తం 2,931 - పురుషుల సంఖ్య 1,522 -స్త్రీల సంఖ్య 1,409 - గృహాల సంఖ్య 704
సమీప గ్రామాలు[మార్చు]
రాజోలుపాడు 2 కి.మీ, నేరేడుపల్లి 7 కి.మీ, చెన్నిపాడు 7 కి.మీ, పెద అలవలపాడు 7 కి.మీ, పోతవరం 8 కి.మీ, తంగెళ్ళ 8 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
పెదచెర్లోపల్లి 11.1 కి.మీ, పొన్నలూరు 13.4 కి.మీ, వోలేటివారిపాలెం 15.కి.మీ, కనిగిరి 21.3 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
దక్షణాన వోలేటివారిపాలెం మండలం, పశ్చిమాన కనిగిరి మండలం, దక్షణాన లింగసముద్రం మండలం.
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2015, మే నెల-21వతేదీ; 8వపేజీ.