చెరుకూరు (పొన్నలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెరుకూరు
—  రెవిన్యూ గ్రామం  —
చెరుకూరు is located in Andhra Pradesh
చెరుకూరు
చెరుకూరు
అక్షాంశరేఖాంశాలు: 15°15′51″N 79°44′57″E / 15.264034°N 79.7491°E / 15.264034; 79.7491
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం పొన్నలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,275
 - పురుషుల సంఖ్య 3,732
 - స్త్రీల సంఖ్య 3,543
 - గృహాల సంఖ్య 1,748
పిన్ కోడ్ 523109
ఎస్.టి.డి కోడ్ 08599

చెరుకూరు, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్: 523 109. ఎస్.టి.డి కోడ్:08599.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఇప్పగుంట 6 కి.మీ, పొన్నలూరు 8 కి.మీ, రావులకొల్లు 8 కి.మీ, అంక భూపాలపురం 8 కి.మీ, మాలెపాడు 8 కి.మీ, బోగనంపాడు 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన వోలేటివారిపాలెం మండలం, పశ్చిమాన పెదచెర్లోపల్లి మండలం, దక్షణాన లింగసముద్రం మండలం, తూర్పున కందుకూరుమండలం.

సమీప పట్టణాలు[మార్చు]

పొన్నలూరు 6.6 కి.మీ, వోలేటివారిపాలెం 9.3 కి.మీ, పెదచెర్లోపల్లి 18.1 కి.మీ, లింగసముద్రం 18.8 కి.మీ.

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల 1952లో స్థాపించబడినది. గత సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించున్నారు. ఈ పాఠశాల గ్రామస్థుల, దాతల సహాయ సహకారాలతో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధిచెందుచుండటంతో, విద్యార్ధులసంఖ్య ఏటికేడు పెరుగుచున్నది. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఆరికట్ల సుబ్బరత్నం సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామములోని విశేషాలు[మార్చు]

చెరుకూరు గ్రామానికి ఉత్తరంగా ఉన్న పొలాలలో వీరులస్థలంగా పిలువబడే ప్రత్యేక పొలం ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాలతోపాటు, పలువురు దేవతామూర్తులు, బొల్లావుల విగ్రహాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. కనిగిరి ప్రాంతాన్ని పరిపాలించిన కాటమరాజు కాలంలో ఇక్కడ ప్రతి సంవత్సరం, ఉత్సవాలు నిర్వహించి, రాత్రికి ఇక్కడే బసచేసి, పొంగళ్ళు పెట్టేవారని పూర్వీకులు చెబుతుంటారు. విగ్రహాల అడుగున గుప్త నిధులు దాచిపెట్టినారని ప్రచారం జరుగుచుండటంతో, అప్పుడప్పుడు ఇక్కడ సంఘవిద్రోహశక్తులు త్రవ్వకాలు జరుపుతుండటం జరుగుతున్నది. [2]

గణాంకాలు[మార్చు]

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,926. ఇందులో పురుషుల సంఖ్య 2,951, మహిళల సంఖ్య 2,975, గ్రామంలో నివాస గృహాలు 1,340 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 5,269 హెక్టారులు.

2.జనాభా (2011) - మొత్తం 7,275 - పురుషుల సంఖ్య 3,732 -స్త్రీల సంఖ్య 3,543 - గృహాల సంఖ్య 1,748

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2014,జూలై-30; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2016,నవంబరు-22; 5వపేజీ.