Jump to content

భారతదేశంలోని ఏడు అద్భుతాలు

వికీపీడియా నుండి

ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన మానవ నిర్మిత కట్టడాలు, సహజసిద్ధ వస్తువుల పట్టికను రూపొందించేందుకు ప్రపంచ అద్భుతాలుతో కూడిన వివిధ జాబితాలను తరాలుగా సంగ్రహించడం జరుగుతోంది. అయితే, భారతదేశంలోని ఏడు అత్యద్భుతాలను ఎంపిక చేయడం కోసం మొదటిసారిగా టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) వార్తా పత్రిక 2007లో జూలై 21 నుంచి జూలై 31 వరకు ఒక SMS ఎన్నిక ప్రక్రియను నిర్వహించింది, ఇందుకోసం పురాతన లేదా మధ్యయుగ కాలం నాటి 20 ప్రదేశాలను ఒక జాబితాగా రూపొందించిన ఈ వార్తా పత్రిక అందులో నుంచి ఏడు అద్భుతాలను ఎన్నుకోవాల్సిందిగా కోరింది. ఆవిధంగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న భారతదేశ ఏడు అద్భుతాలు (ఇందులో నాలుగు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్) టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) పాఠకులచేత ఎన్నిక కాబడినవే. అద్భుతాలుగా పేర్కొంటూ పాఠకులు ఎంపిక చేసిన జాబితాలో ఘనకీర్తి కలిగిన ఏకశిలా విగ్రహం మొదలుకొని ప్రార్థనా మందిరం, ఒక సమాధి, ఒక విశ్వవిద్యాలయం వరకు చోటు చేసుకున్నాయి.[1]

స్వర్ణ దేవాలయం, తాజ్ మహల్ మినహా, ఏడు అద్భుతాలన్నీ చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కొలువుదీరినవే. అయితే, పాఠకులు ఎంపిక చేయడం కోసం ముందస్తుగా జాబితాపర్చబడిన ఇరవై స్మారక చిహ్నాల్లో నాలుగు మాత్రం మెట్రో నగరాల్లో కొలువుదీరినవి చోటుచేసుకున్నాయి, ఢిల్లీలోని లోటస్ దేవాలయం, కుతుబ్ మినార్, బాంబేలోని విక్టోరియా టెర్మినస్, కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జ్ లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన వింతలు

[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 2007 జూలై 21న నిర్వహించిన ఎస్.ఎం.ఎస్ ఓటింగు ఆధారంగా ఈ క్రింది పేర్కొన్న ప్రదేశాలను భారతదేశ ఏడు వింతలుగా ఎంపిక చేసింది.[2]

చిత్రం వింత ప్రదేశం తేదీ వివరణ
గోమటేశ్వర విగ్రహం శ్రావణబెళగొళ, కర్ణాటక AD 981 57-foot (17 m) గల జైన తీర్థంకరుడు అయిన బాహుబలి విగ్రహం.
హర్మందీర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం)
దర్బార్ సాహిబ్ / స్వార్ణదేవాలయం
పంజాబ్‌లోని అమృతసర్ 1585–1604 సిక్కుల గురుద్వారా
The Taj Mahal At Agra తాజ్ మహల్ ఆగ్రా, ఉత్తర ప్రదేశ్ 1632–53 పాలరాతితో కట్టబడిన విశేష కట్టడం
Lotus Mahal at the Zenana Enclosure హంపి
పంపా క్షేత్రం / కిష్కింద క్షేత్రం / భాస్కర క్షేత్రం
విజయనగరం, కర్ణాటక 1342-1565 విరూపాక్ష దేవాలయం గ్రామ గృహాలు
The Temple at Konark కోణార్క్ సూర్యదేవాలయం కోణార్క్, ఒడిషా 13వ శతబ్ద మధ్యభాగంలో కళింగ నిర్మాణశైలిలో నిర్మించబడిన సూర్య దేవాలయం
Ruins of Nalanda University నలందా నలందా, బీహార్ 5వ శతాబ్దం ప్రాచీన విశ్వవిద్యాలయమైన ప్రదేశం
An ornamented monument in Khajuraho ఖజురహో
ఖర్జూరవాహక
ఛత్రపూర్ జిల్లా, మధ్యప్రదేశ్ 9 వ శతాబ్దం హిందూ, జైన దేవాలయాల సమ్మిళితమైన నిర్మాణాలు

పైన పేర్కొన్న ఏడు అద్భుతాలకు సంబంధించిన సమాచారాన్ని సంక్షిప్తంగా ఇక్కడ అందించడం జరిగింది, అదేసమయంలో ఒక్కో అద్భుతానికి సంబంధించిన మరిన్ని వివరాలు సంబంధిత వికీ పేజీల్లో పొందుపర్చబడి ఉంది.

శ్రావణబెళగొళ లేదా గోమటేశ్వర

[మార్చు]
జైన ప్రబోధకుడైన భగవాన్ గోమటేశ్వర బాహుబలికి చెందిన 17.8 మీటర్ల ఏకశిలా విగ్రహం, సా.శ. 983లో రూపొందించబడిన ఈ విగ్రహం భారతదేశంలోని శ్రావణబెళగోళలో ఉంది, మహామష్టకాభిషేకోత్సవం పేరుతో ప్రతి 12 ఏళ్లకోసారి వేలాదిమంది భక్తులు ఇక్కడకు చేరుకుని ఈ విగ్రహానికి కుంకుమపువ్వుతో అభిషేకం నిర్వహిస్తారు.

బ్రహ్మాండమైన ఏకశిలా విగ్రహమైన గోమటేశ్వర (శ్రావణబెలగోల అనేది దీనికి పర్యాయపదం) ను జైన సన్యాసి అయిన బాహుబలి పేరుతో కూడా పిలుస్తారు, గంగా రాజైన రాచమల్ల (రాచమల్ల సత్యవాక్ IV సా.శ.975-986) కు మంత్రి అయిన చాముండరాయ ద్వారా సా.శ.983 ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెలగోల పట్టణానికి దగ్గర్లోని చంద్రగిరి కొండ (కొండమీద ఉండే ఈ విగ్రహాన్ని చేరేందుకు 618 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది) మీద ఈ విగ్రహం నిర్మితమైంది. ఏకశిలకు సంబంధించిన తెల్లటి గ్రానైట్‌ ద్వారా ఈ మహా విగ్రహం రూపొందించబడడంతో పాటు ఒక గొప్ప మత సంబంధమైన సంకేతంగాను ఈ విగ్రహం గుర్తింపును సాధించింది, జైనమతంలో మొదటగా మోక్షం (పుట్టుక, మరణం అనే చక్రబంధం నుంచి విముక్తి) పొందినది బాహుబలి అని జైనులు విశ్వసించడమే ఇందుకు కారణం. ఈ విగ్రహం ఒక తామరపుష్పంపై నిల్చి ఉంటుంది. తొడల ప్రాంతం వరకు ఈ విగ్రహానికి ఎలాంటి ఆధారం లేకపోవడంతో పాటు 60 ft m ల పొడవుతో ఉండే ఈ విగ్రహ ముఖం 6.5 ft m పరిమాణంలో ఉంటుంది. జైన ఆచారం ప్రకారం ఈ విగ్రహం పూర్తి నగ్నంగా ఉండడంతో పాటు దాదాపు 30 km దూరం నుంచి కూడా చక్కగా కనిపిస్తుంది.ఈ విగ్రహం పూర్తి ప్రశాంత వదనంతో కన్పించడంతో పాటు, దీని మనోహరమైన చూపులు, వంకీలు తిరిగిన జట్టు, చక్కటి శరీర సౌష్టవం, ఏకశిల పరిమాణం, కళానైపుణ్యం, హస్త నైపుణ్యాల మేలు కలయిక లాంటి అంశాల కారణంగా మధ్యయుగ కర్ణాటక[3] శిల్పకళకు సంబంధించి ఈ విగ్రహం ఒక విశిష్ట సాధనగా పేరు సాధించడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా విగ్రహంగానూ పేరు సాధించింది[4].

గోమటేశ్వర విగ్రహం మాత్రమే కాకుండా, శ్రావణబెలగోలకు సంబంధించిన మిగిలిన ప్రదేశమంతా జైనమతానికి సంబంధించిన విగ్రహాలతోను, జైన తీర్థంకరులకు చెందిన అనేక విగ్రహాలతో నిండి ఉంటుంది. చంద్రగిరి కోట నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతం ఒక అందమైన దృశ్యంగా దర్శనమిస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకోసారి వేలాదిమంది భక్తులు ఇక్కడికి చేరుకొని మహామస్టకాభిషేకం నిర్వహిస్తారు, బ్రహ్మాండమైన రీతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా వేయి సంవత్సరాల పురాతనమైన గోమటేశ్వర విగ్రహాన్ని పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపువ్వు, బంగారు నాణేలతో అభిషేకిస్తారు. ఈ రకమైన అభిషేకం చివరిసారిగా 2006 ఫిబ్రవరిలో నిర్వహించారు, దీని తర్వాత 2018లో ఈ రకమైన అభిషేకాన్ని నిర్వహించనున్నారు.[5]

స్వర్ణ దేవాలయం లేదా హర్మందీర్ సాహిబ్

[మార్చు]
రాత్రి సమయంలో స్వర్ణ దేవాలయం
హర్మందీర్ సాహిబ్ (దేవుని నివాసం) – అకల్ తఖ్త్ సాహిబ్‌తో సహా స్వర్ణ దేవాలయం (ప్రధాన భవనం) ప్రాంగణం. ఆగస్టు సా.శ. 1604 ఆగస్టులో దీని నిర్మాణం పూర్తయ్యింది.

హర్మిందీర్ సాహిబ్[6] (పంజాబీ: ਹਰਿਮੰਦਰ ਸਾਹਿਬ) లేదా దర్బార్ సాహిబ్ [7] (పంజాబీ: ਦਰਬਾਰ ਸਾਹਿਬ ) ను స్వర్ణ దేవాలయం లేదా దేవుని ఆలయం[6]గా వ్యవహరిస్తుంటారు, సంస్కృతిపరంగా ఇది సిక్కులకు అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ఉండడంతోపాటు పురాతనమైన సిక్కు గురుద్వారగానూ ఉంటోంది. అమృతసర్ నగరంలో ఇది కొలువై ఉంది, సిక్కుల నాల్గవ గురువైన గురు రామదాస్ ద్వారా ఇది ప్రారంభించబడింది, అలాగే స్వర్ణ దేవాలయం నిర్మితమైన కారణంగా అమృతసర్ సైతం ఒక పుణ్యక్షేత్రంగా వర్థిల్లుతోంది.

సిక్కు మతానికి నాల్గవ గురువైన గురు రామదాస్ సా.శ. 1577లో ఒక చెరువును తవ్వించాడు, కాలగమనంలో ఈ చెరువు అమృతసర్ లేదా అమృత సరోవర్ (అర్థం: శాశ్వతత్వాన్ని ప్రసాదించే అమృతాన్ని కలిగిన కొలను) [7]గా పేరు సాధించింది, అందువల్లే ఈ చెరువుకు చుట్టూ నిర్మితమైన నగరానికి చెరువు పేరే సొంతమైంది. కొంతకాలం తర్వాత, ఈ చెరువుకు మధ్య భాగంలో హర్మిందీర్ సాహిబ్ (అర్థం: దేవుని స్వర్గం) [7] పేరుతో ఒక అద్భుతమైన సిక్కు దేవాలయం నిర్మితమైంది, కాలగమనంలో ఇది సిక్కువాదంకు ఒక అద్వితీయ కేంద్రంగా రూపుదాల్చింది. ఇందులోని ప్రార్థన మందిరంలో కొలువుదీరిన ఆది గ్రంథ్‌ను గురు అర్జున్ దేవ్ సంకలనం చేశాడు, సిక్కు మతానికి సంబంధించిన విలువలు, తత్వాన్ని బోధించిన బాబా ఫరీద్, కబీర్, మొదలగు సిక్కు గురువులు, ఇతర మత గురువుల ప్రబోధాలు ఇందులో పొందుపర్చబడి ఉన్నాయి.

స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వాతంత్య్రానికి సంకేతంగా నిలిచే ఈ దేవాలయానికి సంబంధించిన పర్యావరణాన్ని ఆస్వాదించడం కోసం, ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ స్వర్ణ దేవాలయం ఒక దీర్ఘచతురస్త్రాకార పీఠంపై కొలువై ఉండడంతో పాటు అమృత్ సరోవర్ పేరుతో పిలిచే కొలను దీని చుట్టూ ఆక్రమించబడి ఉంటుంది. సాధారణంగా కనిపించే ఒకే ద్వారానికి బదులుగా స్వర్ణ దేవాలయానికి నాలుగు ద్వారాలను కలిగి ఉంటుంది. ఈ నాలుగు ద్వారాలనేవి సిక్కిజం యొక్క బాహ్యత్వానికి ప్రతీకగా నిలవడంతో పాటు అన్ని రకాల విశ్వాసాలను అనుసరించే వారందరూ లోపలికి అనుమతించబడుతారనే విషయాన్ని ఇది సూచిస్తుంది. స్వర్ణ దేవాలయం లోపల ఉండే గోడలన్నీ కలపతో చేసిన చిత్రకళతో అలంకరించిబడి ఉండడంతో పాటు వీటిని వెండి, బంగారంతో పొదగడం జరిగింది. ఇందులోని ఆది గ్రంథ్‌ను విలువైన వజ్రాలు పొదిగిన సింహాసనంపై ప్రతిష్ఠించారు. ఈ పవిత్ర గ్రంథంలోని భాగాలను మతగురువులు నిరంతరం పఠిస్తూ ఉంటారు.

తాజ్‌మహల్

[మార్చు]
రాణి ముంతాజ్ మహల్ స్మృతి చిహ్నంగా నిర్మితమైన తాజ్ మహల్

తాజ్ మహల్ ("తాజ్" అని కూడా పిలుస్తుంటారు), మొఘల్ సామ్రాజ్య శిల్పకల్పకు సంబంధించిన ఒక ఉత్కృష్ట నిర్మాణం అని * ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వర్ణన పేర్కొంది, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాణి ముంతాజ్ మహల్ స్మృతి చిహ్నంగా దీన్ని నిర్మించాడు. పర్షియన్, టర్కిష్, భారతీయ, ఇస్లామిక్ చిత్రకళ శైలిలోని అంశాలను సొంతం చేసుకున్న ఈ ప్రత్యేక శైలి నిర్మాణం మొఘల్ చిత్రకళకు సంబంధించిన ఒక అత్యద్భుత ఉదాహరణగా పరిగణించబడుతోంది. 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తాజ్ మహల్ ఎంపిక కావడంతో పాటు "భారత దేశంలోని ముస్లిం కళకు సంబంధించిన ఆభరణంగాను, విశ్వవ్యాప్తంగా మెచ్చుకోబడిన ప్రపంచ వారసత్వ సంపదల్లో భాగమైన అద్భుత కళాఖండాల్లో ఒకటిగాను" ఉదహరించబడింది. నిర్మాణాల యొక్క సమీకృత సౌష్టవ సముదాయమైన ఈ కట్టడం 1648 ప్రాంతంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించి ఉస్తాద్ అహ్మద్ లహౌరీని సాధారణంగా ప్రధాన రూపశిల్పిగా భావిస్తారు.[8]

తాజ్ మహల్‌కి సంబంధించిన ప్రధాన ఆకర్షణంతా తెల్లటి పాలరాయితో నిర్మించిన సమాధిలోనే దాగిఉంది, ఐవాన్‌తో కూడిన ఒక సమ విభక్త నిర్మాణంగా భావించే ఒక చతురస్త్ర పునాదిపై ఈ నిర్మాణం నిల్చి ఉంది, పైభాగంలో ఒక పెద్ద గుమ్మటం కలిగిన ఆర్చి రూపంలో ఉండే ప్రధాన ద్వారం దీని సొంతం. అనేక ఇతర మొఘల్ సమాధుల మాదిరిగానే ప్రాథమిక అంశాలన్నీ పర్షియన్ మూలాలకు సంబంధించినవే. పునాది నిర్మాణమనేది ఒక అతిపెద్ద, బహుళ-గదుల నిర్మాణం. పునాది అనేది కచ్చితంగా చాంఫెర్ అంచులతో కూడిన ఒక ఘనాకార నిర్మాణంగా ఉండడంతో పాటు ప్రతివైపూ (కుడివైపు గచ్చు ప్రణాళిక చూడండి) దాదాపు 55 మీటర్లు ఉంటుంది. పొడవు వైపు పైభాగంలో, ఒక భారీ పిష్తాక్, లేదా పైకప్పు కమానుమార్గం అనేవి ఇవాన్‌ను ఒక ఆర్చి-రూపంలోని బాల్కనీతో పోలిన రూపంలో ఏర్పరుస్తాయి. ఇక ప్రధాన ఆర్చి ముందరున్న భాగంపై, అదనపు పిష్తాక్‌లు పైన, కింద పెద్ద మొత్తంలో ఉంటాయి. పోగుపడిన పిష్తాక్‌ల యొక్క చిత్రకళ అనేది చాంఫెర్‌లతో నిండిన మూలల భాగాల్లోనూ కనిపిస్తుంది. భవనం యొక్క అన్ని వైపులా ఈ నిర్మాణం పూర్తిగా సమవిభక్తమై ఉంటుంది. చాంఫెర్ మూలల వైపుగా పునాదికి నలువైపులా ఒక్కోటి చొప్పున నాలుగు మినారెట్‌లు కలిగి ఉండడం ద్వారా ఈ సమాధి రూపొందింది. ప్రధాన గదిలోని ముంతాజ్ మహల్, షాజహాన్‌ల శవపేటికలు నిజమైనవి కావు; వారి నిజమైన సమాధులు అంతకంటే దిగువన ఉన్నాయి. తాజ్ మహల్ వెలుపలి భాగాన కనిపించే అలంకరణలు మొఘల్ వాస్తుకళలన్నిటిలోకి అత్యుత్తమమైనదిగా గుర్తించబడింది. ఇక్కడ కనుగొనబడిన అందమైన తులత్ లిపిని పర్షియన్ హస్త నగిషీల నిపుణుడు అమంత్ ఖాన్ రూపొందించాడు.

ఈ భవనం నిర్మాణం కోసం పనిచేసిన కట్టడం పనివారు, రాతిని తొలిచేవారు, రాళ్లను పొదిగేవారు, శిల్పకారులు, చిత్రకారులు, చేతి నగిషీలు చెక్కేవారు, గుమ్మటం నిర్మించేవారితో సహా ఇతర కళాకారులను మొఘల్ సామ్రాజ్యం నలుమూలల నుంచి రప్పించడంతో పాటు మధ్య ఆసియా, ఇరాన్‌ల నుంచి కూడా రప్పించారు. అంతర్గత నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలను స్థానికంగానే తయారు చేసినప్పటికీ, వెలుపలిభాగంలో అలంకారం కోసం ఉపయోగించిన తెల్ల పాలరాయిని మాత్రం రాజస్థాన్‌లోని మక్రానా నుంచి తెప్పించారు. లోపలి భాగంలో పొదిగేందుకు ఉపయోగించిన విలువైన రాళ్లను భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో సహా సిలోన్ (శ్రీలంక), అఫ్ఘనిస్థాన్‌ల నుంచి తెప్పించారు. విభిన్న రకాల లేతరంగు ఎర్ర ఇసుక రాళ్లను పొరుగున ఉన్న సిక్రీ, ధోల్‌పూర్ గనుల నుంచి రప్పించారు. మొత్తంమీద తాజ్ నిర్మాణం పూర్తయ్యేందుకు 17 ఏళ్లు పట్టింది.

హంపి

[మార్చు]
హంపి
కర్ణాటకలోని హంపిలో ఉన్న విజయనగర రాజ గోపురం

.

ప్రాచీన భారతదేశ వాస్తుకళకు సంబంధించిన దాదాపు ప్రతి వైభవం ఇక్కడి 14వ శతాబ్దం నాటి శిథిలాల్లో భద్రంగా దాగి ఉంది. కోటలు, దేవాలయాలు, విపణి కేంద్రాలు, నిఘా స్థూపాలు, గుర్రపుశాలలు, స్నానఘట్టాలు, ఏకరాతి శిల్పాలు లాంటివన్నీ పెద్ద పరిమాణంలోని బండరాళ్ల మధ్య చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఈ ప్రదేశానికి పటిష్ఠమైన రూపాన్ని, చారిత్రక భావాన్ని సొంతం చేస్తున్నాయి.

అందుకే హంపి శిథిలాలు - యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వర్థిల్లుతున్నాయి,[9] విజయనగర సామ్రాజ్య వాస్తుకళను కళ్లముందుంచే ఈ శిథిలాలు, చాళుక్య, హోయసల, పాండ్య చోళ సామ్రాజ్యాల రూపంలో గత శతాబ్దాల్లో విలసిల్లిన రీతులకు, జాతీయాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.[10][11].హంపి నగరం విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని, 14వ, 16వ శతాబ్దాల మధ్య ఇక్కడ పర్యటించిన యాత్రికులు ఈ ప్రదేశం గురించి గొప్పగా ప్రస్తుతించారు. అయితే, సా.శ. 1565లో దక్కను ప్రాంతాన్ని జయించిన ముస్లిం రాజులచే ఈ ప్రాంతం కొల్లగొట్టబడింది.[12] దీంతో ఈ ప్రాంతంలోని కోటలు, దేవాలయాలు, విపణీ ప్రాంతాలు, నిఘా స్థూపాలు, గుర్రపుశాలలు, స్నానఘట్టాలు, ఏకశిలా విగ్రహాలు లాంటి అపురూప నిర్మాణాలన్నీ శిథిలాల రూపంలో పెద్ద బండరాళ్ల కింద నిక్షిప్తమై పోయాయి, ఇవన్నీ కలిసి ఈ ప్రదేశానికి పటిష్ఠమైన రూపాన్ని, చారిత్రక భావాన్ని సొంతం చేశాయి.

ఈ సామ్రాజ్యం పతనావస్థకు చేరడానికి పూర్వం అనేక సంవత్సరాల పాటు ఇక్కడ వర్థిల్లిన శిల్పకళ, వాస్తుకళ, చిత్రకళలకు ఈ ప్రాంతం వారసత్వంగా నిలుస్తోంది. అలంకృత స్తంభాలతో నిర్మితమైన కళ్యాణమండపం (వివాహ వేదిక), వసంతమండపం (స్తంభాలతో కూడిన బహిరంగ వేదికలు), రాజగోపురం (టవర్) లాంటి నిర్మాణాలు ఆనాటి వైభవానికి ప్రత్యక్ష ముద్రలుగా నిలుస్తున్నాయి. ఆనాటి సామ్రాజ్య కీర్తి చిహ్నాలు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన సమయంలో, దాని రాజధాని అయిన విజయనగరంలో స్మారక చిహ్నాల విశాల బహిరంగ సభా మండపాలు అతిశయించలేదు.[13].

కోణార్క్

[మార్చు]
రాత్రి సమయంలో ఒడిషాలోని కోణార్క్ సూర్య దేవాలయం

.

కోణార్క్ సూర్య దేవాలయం చక్రం

నల్ల గ్రానైట్‌తో నిర్మించబడిన కోణార్క్ సూర్య దేవాలయం (నల్ల గోపురంగా కూడా ప్రసిద్ధి) ను తూర్పు గంగా రాజవంశంకు చెందిన మొదటి నరసింహదేవ (సా.శ. 1236 -సా.శ. 1264) నిర్మించాడు.[14] ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షింపబడుతోంది. 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం, 24 చక్రాలు (ఒక్కోటి 3.3 మీటర్ల వ్యాసంతో) కలిగిన ఒక భారీ రథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్టుగా నిర్మించారు, ఆకాశం వెంబడి సంచరించేందుకు సూర్యభగవానుడైన సూర్యుడు ఈ రథంపై కొలువుదీరి ఉంటాడు.మత సంబంధిత (బ్రాహ్మణులకు చెందిన) వాస్తుశాస్త్రానికి ఈ ఆలయం ఒక అద్భుత స్మారక చిహ్నం. కుపోలా (గాలి లోనికి ప్రవేశించేందుకు వీలుగా పైకప్పులో ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు) ల ద్వారా ప్రత్యేక లక్షణ వక్రరేఖల స్థూపాలతో నిర్మితమైన ఈ సూర్య దేవాలయం భారతదేశ దేవాలయాల యొక్క కళింగ పాఠశాలకు చెందడంతో పాటు సూర్యునికి సమర్పించబడిన ఈ ఆలయం అందుకు ప్రతీకగా తూర్పు-పడమర దిశగా నిర్మితమైంది, ప్రతిరోజూ సూర్యోదయ కిరణాలు ఈ ఆలయం ముఖద్వారాన్ని తాకుతుంటాయి. ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక నాట్‌మందిర్ (వెలుపలి వైపు సముదాయం), జగ్‌మోహన్ (కేంద్ర సముదాయం), గర్భగృహ (సూర్యదేవుని నివాసమైన ప్రధాన సముదాయం) అనే మూడు ఖండాలుగా చిత్రించబడింది. దేవాలయంలోని ప్రధాన మందిరం (69.8 మీ. ఎత్తు) విశాలమైన బహిర్గత ప్రదర్శనకు వీలు కల్పించే ప్రేక్షక సభా మందిరం (39.5 మీ. ఎత్తు) తో కలిపి నిర్మితమైంది. ప్రధాన మందిరంలో ప్రతిష్ఠించబడిన మూల దైవ విగ్రహం కూలిపోయింది. ప్రేక్షక మందిరం ఇప్పటికీ ఉనికిలోనే ఉన్నప్పటికీ, నృత్య మందిరం (నాట్య మందిరం), భోజన మందిరాల (భోగ-మండపం) కు చెందిన చిన్నపాటి భాగాలు మాత్రమే కాల ప్రభావాన్ని తట్టుకుని నిలిచాయి. దేవాలయానికి సంబంధించిన ప్రాంగణ.

దేవాలయ ప్రధాన ద్వారం వద్ద ఉండే రెండు సింహాపు విగ్రహాలు యుద్ధ ఏనుగును తొక్కివేస్తున్నట్టుగా దర్శనమిస్తాయి. పైనుంచి చూసినప్పుడు ప్రతి ఏనుగు మానవ శరీరం మాదిరిగా కనిపిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద, ఒక నట మందిరం లేదా నృత్య మందిరం కూడా కనిపిస్తుంది, సూర్యభగవానుడికి వందనం సమర్పించేందుకు దేవాలయ నృత్యకారులు ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. దేవాలయం మొత్తం మీద వివిధ రకాల పుష్ప సంబంధిత, రేఖాగణిత నమూనాలు దర్శనమిస్తాయి. శృంగారాన్ని ఆస్వాదించే రూపంలో మనుష్యులు, దేవతలు, పాక్షిక దైవత్యం కలిగిన రూపాలు సైతం దేవాలయంలో కనిపిస్తాయి. ఈ రకమైన రూపాలు జంటలుగా శృంగార కార్యాన్ని తలపించేలా కనిపించడంతో పాటు కామ సూత్ర నుంచి దిగివచ్చినట్టుగా దర్శనమిస్తాయి.

నలంద

[మార్చు]
నలందలోని సరిపుత్త స్థూపం

భారతదేశంలోని రాష్ట్రమైన బీహార్‌లో కొలువై ఉన్న నలంద సా.శ. 427 నుంచి సా.శ. 1197 వరకు పాక్షికంగా పాల సామ్రాజ్యం ఆధిపత్యం కింద అభ్యసనకు సంబంధించిన బౌద్ధ కేంద్రంగా విలసిల్లింది.[15].[16] "లిపి రూప చరిత్రలో పేర్కొనబడిన మొట్టమొదటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటి"గా ఇది పిలవబడుతోంది.[16]. చారిత్రక అధ్యయనాల ప్రకారం, సా.శ. 450లో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయానికి గుప్త చక్రవర్తులు, ప్రత్యేకించి కుమారగుప్తుడు పోషకులుగా ఉండేవారు.[15]. నలంద, ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్సిషల్ విశ్వవిద్యాలయంగా భావించబడుతోంది, విద్యార్థుల కోసం ఇక్కడ సత్రాలున్నాయి, ఇవి 10,000కు పైగా విద్యార్థులకు, 2,000కు పైగా అధ్యాపకులకు వసతి సౌకర్యాన్ని కల్పించగలవు. ఒక అత్యుత్తమ గోడ, ఒక ద్వారంతో ఉండే ఈ విశ్వవిద్యాలయం వాస్తుకళకు సంబంధించి ఒక మచ్చుతునకగా భావించబడుతోంది. నలందలో అనేక ఇతర ధ్యాన మందిరాలు, తరగతి గదులతో పాటు ఎనిమిది ప్రత్యేకమైన ప్రాంగణాలు, పది దేవాలయాలు ఉండేవి. ప్రాంగణం లోపల చెరువులు, ఉద్యానవనాలు ఉండేవి. తొమ్మిది అంతస్తుల భవంతిలో ఉండే ఇక్కడి గ్రంథాలయంలో క్షణ్ణంగా పరిశీలించబడిన గ్రంథాల ప్రతులు ఉండేవి. నలంద విశ్వవిద్యాలయంలో బోధించబడే పాఠ్యాంశాలు అభ్యసనకు సంబంధించిన ప్రతి రంగానికి విస్తరించడంతో పాటు కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా, టర్కీలకు చెందిన విద్యార్థులు, నిపుణులను ఆకర్షించింది.[16] టాంగ్ రాజవంశం చైనీస్ యాత్రికుడు జువాన్‌జాంగ్ 7వ శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరణాత్మక ఖాతాలను అందించారు.

ఖజురహో

[మార్చు]
పంచాయతన దేవాలయమైన ఖజురహోలోని లక్ష్మణ దేవాలయం.
భారతదేశంలోని ఖజురహో దేవాలయం

ఖజురహో అనేది మధ్యయుగ (సా.శ. 950, సా.శ. 1050 మధ్య) కాలానికి చెందిన హిందూ, జైన మతానికి చెందిన దేవాలయాలను అతిపెద్ద సంఖ్యలో కలిగిన ప్రదేశం. వాస్తుకళ, శిల్పకళల మేలు కలయికగా ఉండే ఈ ఆలయ ప్రాంగణం, కామకేళి శిల్ప సంపద ద్వారా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడి దేవాలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా సంరక్షించబడుతున్నాయి. కండరియా దేవాలయంలో విస్తారంగా కనిపించే అలంకృత శిల్పకలను భారతదేశానికి సంబంధించిన అత్యద్భుత కళాఖండాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.[17] చందేల రాజవంశం ద్వారా నిర్మితమైన ఈ దేవాలయాలపై మనసును వశపర్చుకునేలా కనిపించే స్పష్టమైన కామకేళి ప్రదర్శిత శిల్పకళ అనేది ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆరోజుల్లో వ్యాప్తిలో ఉన్న భంగిమల రూపంలో కళాకారుల ఊహల నుంచి పుట్టినవిగా గానీ లేదా కామసూత్రలో చెప్పబడిన నియమాల ఆధారంగా పుట్టినవి గానీ అయ్యుండవచ్చు. అనేకమంది శిల్పులు తమ కళాత్మక యాజమానిత్వాన్ని అనేక శిల్పాలపై పేర్కొన్నారు.[18] నలుపు, ఊదా లేదా లేత పసుపు రంగులకు చెందిన వివిధ రకాల వర్ణాలతో కూడిన ఇసుకరాతితో నిర్మితమైన ఈ దేవాలయాలు, శివుడు, విష్ణువు లేదా జైన మత గణాలకు చెందినవి, అయితే ఈ దేవాలయాలను ఒకదాని నుంచి మరొకదానిని వేరుచేసి చూడడం కష్టమైన కార్యం. తూర్పు-పడమర దిశగా నిర్మితమై ఉన్న ఈ దేవాలయాలు, అంతర్గత సంబంధాలు కలిగిన లోపలివైపు గదులను కలిగిన విశాలమైన ప్రణాళికతో చిత్రించబడ్డాయి. ఈ దేవాలయాలకు సంబంధించిన సాధారణ ప్రణాళికలో ఒక ప్రవేశద్వారం, ఒక సభా మందిరం, ఒక చావిడి, ఒక గర్భగుడి లాంటివి భాగాలుగా ఉన్నాయి. ఒక మహిళ లేఖ రాస్తున్నట్టు, కళ్లకు వర్ణాలు దిద్దుకుంటున్నట్టు, తలవెంట్రుకలను దువ్వుకుంటున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు, తన బిడ్డతో ఆడుకుంటున్నట్టుగా మహిళకు సంబంధించిన లెక్కలేనన్ని హావభావాలు, అంశాలకు అద్దంపట్టేలా చిత్రీకరించబడిన శిల్పాలను కలిగిన ఖజురహో దేవాలయాలనేవి స్త్రీకి సంబంధించిన ఒక వేడుక లాంటివని చెప్పబడుతోంది. అలాగే వీటిలో చెక్కబడిన తామ్రపత్రాలు, సమగ్రమైన నైపుణ్యాలతో చెక్కబడిన అమాయకత్వం, కామకేళిలో మహిళ ఆధిపత్యం, చిరునవ్వు, మనహోరం, మోహం, అందం, కామకేళి శిల్పాలు క్లిష్టమైన విధానంతో చిత్రించబడ్డాయి. దీంతోపాటు లౌకికమైన వాంఛలను తీర్చుకోవడమనేది అనంతమైన స్వేచ్ఛకు మూలమైన నిర్వాణ మోక్షాన్ని సాధించేందుకు వేసే ముందడుగు అనే విశ్వాసంతో చందేలులు తాంత్రిక ఆచారాలను అనుసరించి ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యాప్తిలో ఉంది.[19]

మూలాలు

[మార్చు]
  1. timesofindia.indiatimes.com/And_Indias_7_wonders_are/articleshow/2256124.cms-
  2. "And India's 7 wonders are..." Times of India. 5 August 2007. Retrieved 3 December 2015.
  3. శేషాద్రి ఇన్ కామత్ (2001), పుట51
  4. Keay, John (2000). India: A History. New York: Grove Press. pp. 324 (across). ISBN 0802137970.
  5. "Mahamastabhishek". Archived from the original on 2010-10-21. Retrieved 2011-01-24.
  6. 6.0 6.1 Harban Singh; Punjabi University (1998). Encyclopedia of Sikhism. punjabiuniversity.ac.in/pages/index.htm Punjabi University]. ISBN 817380530X.
  7. 7.0 7.1 7.2 స్వర్ణ దేవాలయం, పంజాబీ యూనివర్సిటీ, పర్మ్ బర్క్‌శిష్ సింగ్, దేవేందర్ కుమార్ వర్మ, ISBN 8173805695
  8. "UNESCO advisory body evaluation" (PDF).
  9. "Group of monuments at Hampi (1986), Karnataka".
  10. విజయనగర వాస్తుకళ అనేది వికసించిన ద్రావిడ శైలి అని చిత్రకళ విశ్లేషకుడు పెర్సీ బ్రౌన్ పిలుపునిచ్చాడు (కామత్ 2001, p182)
  11. ఆర్తికేజ్, సాహితీ కార్యకలాపం
  12. "Group of Monuments at Hampi".
  13. "సో ఇన్టిమేట్ ఏర్ ది రాక్స్ అండ్ ది మౌన్‌మెంట్స్ దే వేర్ యూజ్డ్ ఫర్ మేక్, ఇట్ వాజ్ సమ్‌టైమ్స్ ఇంపాజిబుల్ టు సే వేర్ నేచర్ ఎండెడ్ అండ్ ఆర్ట్ బిగెన్" (చిత్రకళ విశ్లేషకుడు పెర్సీ బ్రౌన్, హంపి, ఏ ట్రావెల్ గైడ్ , పుట64లో పేర్కొన్న వాక్యం)
  14. "Konark Sun Temple". Archived from the original on 2009-02-18. Retrieved 2011-01-24.
  15. 15.0 15.1 అల్టేకర్, అనంత్ సదాశివ (1965). ఎడ్యుకేషన్ ఇన్ ఏన్సియెంట్ ఇండియా , సిక్స్త్, వారణాసి: నంద కిషోర్ & బ్రదర్స్.
  16. 16.0 16.1 16.2 "రియల్లీ ఓల్డ్ స్కూల్," గార్టెన్, జెఫ్రీ E. న్యూ యార్క్ టైమ్స్, డిసెంబర్ 9, 2006.
  17. "Kajuraho group of Monuments".
  18. "Beauty of Khajuraho Temples by K.L Kamat".
  19. "Khajuraho Temples, Madhya Pradesh". Archived from the original on 2010-11-02. Retrieved 2011-01-24.

ఇతర లింకులు

[మార్చు]