మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ
మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ
మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ
జననంఆదిలక్ష్మిదేవమ్మ
మరణంఆగస్టు 18, 1953
ప్రసిద్ధిగద్వాల సంస్థానపాలకురాలు
మతంహిందూ మతము

మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాణి. రాజా చిన సీతారామభూపాలుని భార్య. ఆయన అనంతరం పాలనచేశారు. 1946 నుండి 1949 వరకు పాలించారు[1].. ఈమె ఈ సంస్థానపు చివరి పాలకురాలు కూడా. నిజాం నవాబును ఎదురించిన వీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించింది. సీతారామభూపాలునికి సంతానం లేకపోవడంచే నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీఖాన్ తమ రాజ్యంలో గద్వాల సంస్థానాన్ని కలుపుకుంటే, రాణి న్యాయపోరాటం చేసి సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. సంస్థానంలో సంప్రదాయంగా వస్తున్న సాహిత్య పోషణను కొనసాగిస్తూ, ఎందరో కవులను ఆదరించి గద్వాలకు విద్వద్గద్వాలగా కీర్తి రావడానికి కారకులయ్యారు. ఎంతోమంది కవుల పుస్తకాలను ముద్రింపజేశారు. 1949 లో సంస్థానాల, జాగీర్ధారుల పాలనలు రద్దు కావటంతో రాణి సంస్థానపు ఆస్తులను, చారిత్రాత్మక గద్వాల కోటను ప్రభుత్వ పరం చేశారు. 1663లో రాజా పెద సోమభూపాలుడి పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానపు పాలన 1949లో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ పాలనతో ముగిసింది. ఆమె పేరు మీదుగా గద్వాల కోటలో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేశారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటైన మొదటి డిగ్రీ కళాశాల. రాణి 18.08.1953లో అస్తమించారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-61