మాధవ్ ఆప్టే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాధవ్ ఆప్టే (Madhavrao Laxmanrao Apte) భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను 1932 అక్టోబర్ 5మహారాష్ట్ర లోని ముంబాయిలో జన్మించాడు. 1952 నుంచి 1953 వరకు ఇతడు భారత క్రికెట్ జట్టు తరఫున 7 టెస్టులలో ప్రాతినిధ్యం వహించాడు. 49.27 సగటుతో టెస్టులలో 542 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ మరియు 3 అర్థ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 163 నాటౌట్.