విజయ్ మర్చంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్ మర్చంట్
Vijay Merchant 1936.jpg
విజయ్ మర్చంట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు విజయ్ సింగ్ మాధవ్‌జీ మర్చంట్
జననం (1911-10-12)1911 అక్టోబరు 12
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా
మరణం 1987 అక్టోబరు 27(1987-10-27) (వయస్సు 76)
బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడి చేతి వాటం
బౌలింగ్ శైలి రైట్ ఆర్మ్ మీడియం
పాత్ర బ్యాట్స్ మాన్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు భారతదేశం
టెస్టు అరంగ్రేటం(cap 15) 15 డిసెంబర్ 1933 v ఇంగ్లాండ్
చివరి టెస్టు 2 నవంబర్ 1951 v ఇంగ్లాండ్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1929–1951 బాంబే
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫస్ట్ క్లాస్
మ్యాచులు 10 150
చేసిన పరుగులు 859 13470
బ్యాటింగ్ సరాసరి 47.72 71.64
100s/50s 3/3 45/52
అత్యధిక స్కోరు 154 359*
బౌలింగ్ చేసిన బంతులు 54 5,087
వికెట్లు 0 65
బౌలింగ్ సరాసరి 32.12
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 1
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0
ఉత్తమ బౌలింగ్ 5/73
క్యాచులు/స్టంపులు 7/– 115/–
Source: ESPNcricinfo, 21 మార్చ్ 2019

బాల్యం, జీవిత విశేషాలు[మార్చు]

1911, అక్టోబర్ 12న జన్మించిన విజయ్ మర్చంట్ (Vijaysingh Madhavji Merchant) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 71.64 సగటును కలిగియుండి ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ తరువాత అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.భారతదేశపు దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు రంజీ ట్రోఫిలో మరింతమెరుగ్గా 98.75 సగటును కలిగియున్నాడు.

విజయ్ మర్చంట్ 10 టెస్టులు ఆడి 47.72 సగటుతో 859 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 3 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 154 పరుగులు. ఈ స్కోరును అతని చివరి టెస్టులో ఇంగ్లాండుపై ఢిల్లీలో 1951-52లో సాధించాడు. ఇదే టెస్టులో ఫీల్డింగ్ చేయుసమయంలో దురదృష్టవశాత్తు భుజానికి గాయమై క్రికెట్ నుంచే నిష్క్రమించవలసి వచ్చింది.

1937లో విజ్డెన్ ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ దొ ఇయర్ అవార్డు పొందిన ఐదుగురిలో విజయ్ మర్చంట్ ఒకరు. అంతేకాదు భారతదేశం నుంచి టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ పూర్తిచేసిన తొలి బ్యాట్స్‌మెన్‌లలో విజయ్ ఒకడు. తన తొలి సెంచరీని 1951-52లో ఇంగ్లాండుపై 40 ఏళ్ళ వయసులో సాధించాడు.

మరణం[మార్చు]

1987, అక్టోబర్ 27న విజయ్ మర్చంట్ మరణించాడు.

మూలాలు[మార్చు]