Jump to content

చెరువు

వికీపీడియా నుండి
(మురుగు నీటి చెరువులు నుండి దారిమార్పు చెందింది)
ప్రగతి నగర్ చెరువు, హైదరాబాద్
విశాఖ జిల్లా, పద్మనాభం వద్ద వాన నీటితో నిండిన ఒక చెరువు

చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశం. చాలా చెరువులు వర్షo మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అంటారు.ఇలా తయారైన నాగార్జునసాగర్ ఒక సముద్రం లాగా ఉంటుంది

చెరువులలో రకాలు

[మార్చు]
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు గ్రామ ప్రాంతములో ఒక మంచినీటి చెరువు.

గొలుసు కట్టు చెరువులు

[మార్చు]
పాకాల చెరువు, వరంగల్ జిల్లా

గొలుసు కట్టు చెరువులు అంటే ఒక వూరి చెరువు నిండి అలుగు పోస్తే ఆ వృథా నీరు మరో పల్లెలోని చెరువు,కుంటల్లోకి వెళ్తుంది. ఇదీ గొలుసుకట్టు చెరువులు,కుంటల పరిస్థితి.. అయితే ఈ గొలుసుకట్టు చెరువులు,కుంటలకు అనుబంధంగా ఏఎమ్మార్పీ కాల్వలను తవ్వారు. ఈ కాల్వల ద్వారా ఎగువభాగంలో ఒక చెరువు,లేదా కుంటలోకి తూముల ద్వారా చేరవేసిన నీళ్లు వాగులు, వంకలద్వారా పారుకుంటూ దిగువ ప్రాంతంలోని సాగునీటి వనరులను నింపుతున్నాయి. దీంతో వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు కృష్ణా జలాలతో నిండి పల్లెల్లో తాగు, సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నాయి.రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసు కట్టూ చెరువుల విధానం శాస్త్రీయవిధానం ప్రపంచం మొత్తంలో తెలంగాణలో తప్ప మరెక్కడ కనిపించవు. రాణి రుద్రమా దేవి చూచించ వ్యవసాయ శాస్త్రీయా విధానం 800 సం||లు దాటినా తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రదాన మూలాదారాం ప్రతి గ్రామానికీ ఊర చెరువులు, కుంటలు లక్నవరం, పాకాల, రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు వారి పరిపాలనదక్షతకు నిదర్శనం. వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది.[1][2].[3] [4]

చెరువుల నుంచి సాధారణంగా నీటిని బయటకు రాబట్టడానికి తూములు అనబడే ద్వారాలు ఉంటాయి. వీటి ద్వారా నీటిని కొద్ది కొద్ది పరిమాణాల్లో నీటిని పంటలకు వదులుతూ ఉంటారు. వేసవి సమయంలో మరీ నీరు అడుగంటినపుడు మోటార్లు, ఇంజన్ల ద్వారా కూడా నీటిని బయటకు తోడుతారు. వర్షాకాలంలో చెరువులు పూర్తిగా నిండినపుడు పెద్ద మొత్తంలో నీటిని బయటకు విడిచిపెట్టడానికి కలుజులు కూడా ఉంటాయి. ఇవి నీళ్ళు నిండిన చెరువులు తెగిపోకుండా కాపాడుతాయి.

చేపల చెరువులు

[మార్చు]

చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.చేపలచెరువుల తవ్వకాల వల్ల సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతోంది. నిషిద్ధ క్యాట్‌ ఫిష్‌ను సైతం అక్రమంగా పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.కొత్తగా చేపల చెరువుల తవ్వకాలకు ఇకపై జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందటం తప్పనిసరి. చేపల చెరువుల రైతులకు ఇకపై 16 ఎకరాల వరకూ వాణిజ్యపన్ను చెల్లింపు నుంచి మినహాయింపు లభించనుంది. చేపల చెరువుకు ఎకరా ఆదాయం రూ. 30 వేలనుండి ( ఒక పంటకు ) రూ. 10 వేలకు కుదిస్తూ నిర్ణయం వెలువడింది. చేపల సాగును కూడా రొయ్యి, గుడ్డు, మాంసం వంటి వాటిపై ఎలాంటి వాణిజ్య పన్ను లేనట్లుగా వ్యవసాయ రంగం పరిధిలో చేర్చితే పన్నులుండకపోగా వ్యవసాయ రంగాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అందించే సాయం, నష్ట పరిహారం చేపల చెరువుల రైతులకు కూడా అందుతుంది.ఒడిషా, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో చేపల చెరువులపై పన్ను లేదు.

మురుగునీటి చెరువులు

[మార్చు]
పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో తామర పూలతో నిండి వున్న చెరువు

మురుగు నీటి చెరువులు మురుగు నీరు చేరి నిలువద్వారా ఏర్పాటైన చెరువులు.

కుంటలు

[మార్చు]
విశాఖ జిల్లా పెద్దిపాలెం వద్ద చెరువు]]
విశాఖ జిల్లా పెద్దిపాలెం వద్ద చెరువు

చిన్న పాటి చెరువులు.చిక్కిశల్యమైన చెరువులు కుంటల చరిత్ర తెలుసుకునేందుకు మండలాల వారీగా సర్వే జరుపు తున్నారు.2007లో 100 ఎకరాల ఆయకట్టులోపు ఉన్న చెరువులను పంచాయతీరాజ్‌శాఖ నుంచి నీటిపారుదలశాఖకు బదిలీ చేశారు.దురాక్రమణ, తూములు పాడవడం, పారని చప్టాలు, ఫీడర్‌ ఛానెళ్లు లేకపోవడం, సాగునీరు అందే సమయంలో గట్లకు గండిపడడం ఇలా ఎన్నో అవస్థలున్నాయి. చెరువు ఆయకట్టు ఎంత ? ప్రస్తుతం ఏ దశలో ఉంది ? ఎంత ఆక్రమణలకు గురైంది తదితర వివరాలు సేకరిస్తారు. తూముల వివరాలు, వాటి పరిస్థితిని గుర్తిస్తున్నారు. ఫీడర్‌ ఛానెళ్ల పరిస్థితి అంచనా వేస్తారు. చెరువు గట్ల పరిస్థితి, చప్టాలు నిర్మించారా ? వాటి స్థితిగతులు ఏమిటి అన్న అంశాలు పరిగణలోనికి తీసుకుంటారు. వీటితో పాటు ఆయా చెరువులు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే భౌగోళికంగా అక్కడి పరిస్థితులను బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది పరిశీలిస్తారు.ఇలా 44 అంశాలతో సమాచారం మొత్తం క్రోడీకరించి సమగ్ర రికార్డులు తయారుచేస్తారు.100 ఎకరాలు దాటిన ఆయకట్టు చెరువుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయిస్తోంది.

ఆలయాలలో చెరువులు

[మార్చు]

కోనేరు, దేవాలయాలలో దేవుని భక్తులకోసం ఏర్పాటుచేసిన చెరువు.

ప్రముఖమైన చెరువులు

[మార్చు]

ప్రదర్శన

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.andhrajyothy.com/artical?SID=572719[permanent dead link]
  2. https://www.ntnews.com/district/wanaparthy/article.aspx?contentid=786037[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-25. Retrieved 2019-03-25.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-25. Retrieved 2019-03-25.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చెరువు&oldid=4339438" నుండి వెలికితీశారు