మూడు ముక్కలాట (సినిమా)
మూడు ముక్కలాట (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
తారాగణం | జగపతి బాబు , రంభ , సౌందర్య |
సంగీతం | ఎం.ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
మూడు ముక్కలాట 2000 సెప్టెంబరు 1 న విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం.[1] ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రామోజీ రావు నిర్మించాడు.ఇందులో జగపతి బాబు, రంభ , సౌందర్య, రాసి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించింది.[1]
కథ
[మార్చు]శాంతి స్వరూప్ ( జగపతి బాబు ) ఒక అందమైన కళాశాల లెక్చరర్. లహరి ( రంభ ) అదే కళాశాలలో లైబ్రేరియన్. శ్రావణి ( [సౌందర్య(నటి)]), అలివేణి ( రాశి ) అక్కడ చదువుకుంటున్నారు. ఈ ముగ్గురు అమ్మాయిలు శాంతి స్వరూప్ తో ప్రేమలో పడతారు. అతను శ్రావణిని ప్రేమిస్తాడు. శ్రావణి తన వివాహిత సోదరి ( ప్రియా ) తో కలిసి ఉంటోంది. దీనిలో ఆమె బావ పరమహంస ( ప్రకాష్ రాజ్ ) కు ఆమెపై కన్నుంది. ఏదో రకంగా శ్రావణిని పెళ్ళి చేసుకోవాలని కలలు కంటున్నాడు. శ్రావణి అక్కకు పక్షవాతం. పరమహంసే తన భార్యకు స్లో పాయిజన్ ఇచ్చాడని, అందుకే ఆమెకు పక్షవాతం వచ్చిందనీ తరువాత తెలుస్తుంది. ఆ సాకుతో శ్రావణిని పెళ్ళి చేసుకోవచ్చని అతడి ప్లాను. లహరి పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు యుగంధర్ ( నాసర్ ) ముద్దుల చెల్లెలు. కొన్ని సంఘటనల కారణంగా శాంతి స్వరూప్ తనను ప్రేమిస్తున్నాడని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. అతను శ్రావణిని ప్రేమిస్తున్నాడని లహరికి తెలియగానే, ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న యుగంధర్, తన సోదరిని పెళ్ళి చేసుకోకపోతే శాంతి తల్లిని ( అన్నపూర్ణ ) చంపేస్తానని శాంతిని బెదిరిస్తాడు. దీనిని నివారించడానికి శాంతి లహరిని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అలివేణి ప్రసిద్ధ రౌడీ అయిన బర్రెల బాల రాజు (తనికెళ్ళ భరణి ) దంపతుల ఏకైక కుమార్తె. అలివేణి శాంతిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న తరువాత, ఆమె శాంతి కారణంగా గర్భవతి అయినట్టు నాటకం ఆడ్తారు. అలివేణి ఆత్మహత్యను నివారించడానికి, శాంతి ఆమెను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. శాంతి ముగ్గురు స్త్రీలనూ పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. పరమహంస, యుగంధర్, బాలరాజు అతని అంతు చూసేలా ఉన్నారు. అతను ఆ కష్టాలను ఎలా అధిగమిస్తాడు, ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడు అనేది మిగతా కథ
నటవర్గం
[మార్చు]- జగపతి బాబు - శాంతి స్వరూప్
- రంభ - లహరి
- సౌందర్య - శ్రావణి
- రాశి - అలివేణి
- ప్రకాశ్ రాజ్ - పరమహంస
- నాజర్ - యుగంధర్
- వర్ష - భాస్కర లక్ష్మీ
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "చినవాడా చినవాడా" | చంద్రబోస్ (రచయిత) | మనో, నిత్యశ్రీ | 5:41 |
2. | "పాలకోవా" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:34 |
3. | "ప్రేమా ప్రేమా అంది" | చంద్రబోస్ | సుఖ్వీందర్ సింగ్, సుజాత | 4:36 |
4. | "రాశి చూస్తే" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఉదిత్ నారాయణ్, చిత్ర | 3:49 |
5. | "ప్రేమ విక్రమార్కుడు" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వసుంధరా దాస్ | 4:53 |
6. | "వాన కన్యకా" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:48 |
మొత్తం నిడివి: | 24:21 |