Jump to content

మొహమ్మద్ నబీ

వికీపీడియా నుండి
మొహమ్మద్ నబీ
2014 లో నబీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ నబీ ఐసఖీల్
పుట్టిన తేదీ (1985-01-01) 1985 జనవరి 1 (వయసు 39)[A]
లోగార్, ఆఫ్ఘనిస్తాన్
మారుపేరుది ప్రెసిడెంట్,[4] మిస్టర్ ప్రెసిడెంట్[5]
ఎత్తు6 అ. 0 అం. (1.83 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 5)2018 జూన్ 14 - ఇండియా తో
చివరి టెస్టు2019 సెప్టెంబరు 5 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 7)2009 ఏప్రిల్ 19 - స్కాంట్లాండ్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.7
తొలి T20I (క్యాప్ 5)2010 ఫిబ్రవరి 1 - ఐర్లాండ్ తో
చివరి T20I2023 జూలై 16 - బంగ్లాదేశ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.7
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–2009/10పాకిస్థాన్ కస్టమ్స్ క్రికెట్ జట్టు
2013/14–2014/15Mohammedan Sporting Club
2013Sylhet Royals
2015Rangpur Riders
2016Chittagong Vikings
2017Comilla విక్టోరియాns
2016Quetta Gladiators
2017–2021సన్ రైజర్స్ హైదరాబాద్
2017St Kitts and Nevis Patriots
2017Mis Ainak నైట్స్
2017/18–2021/22Melbourne Renegades
2018లీసెస్టర్‌షైర్
2018Balkh Legends
2019కెంట్ (స్క్వాడ్ నం. 77)
2020St Lucia Zouks (స్క్వాడ్ నం. 7)
2021–2022Karachi Kings
2022Colombo Stars
కోల్‌కతా నైట్‌రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫక్లా
మ్యాచ్‌లు 3 145 109 35
చేసిన పరుగులు 33 3,085 1,885 1,284
బ్యాటింగు సగటు 5.50 27.06 22.25 24.22
100లు/50లు 0/0 1/15 0/5 2/5
అత్యుత్తమ స్కోరు 24 116 89 117
వేసిన బంతులు 546 6,825 1,990 4,848
వికెట్లు 8 154 87 94
బౌలింగు సగటు 31.75 31.75 27.89 23.17
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/36 4/30 4/10 6/33
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 63/– 56/– 20/–
మూలం: ESPNcricinfo, 2023 జూన్ 7

మొహమ్మద్ నబీ ఈసాఖిల్ (జననం 1985 జనవరి 1[A]) ఆఫ్ఘన్ క్రికెటరు, ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. నబీ ఒక అటాకింగ్ బ్యాటింగ్ ఆల్-రౌండరు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా ఆడుతున్నాడు. [6]

ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్నత స్థాయికి ఎదగడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. 2009 ఏప్రిల్లో వారి మొదటి వన్డే ఇంటర్నేషనల్, 2018 జూన్లో వారి మొదటి టెస్టు మ్యాచ్ రెండింటిలోనూ ఆడాడు. అతను 2010 ఫిబ్రవరి 1న ఐర్లాండ్‌తో జట్టు ఆడినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి T20I జట్టులో భాగంగా ఉన్నాడు. అతను ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు ఐదవ క్యాప్ అయ్యాడు. 2010 ICC వరల్డ్ ట్వంటీ 20 సందర్భంగా గ్రూప్ దశ మ్యాచ్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ తమ మొదటి T20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడినప్పుడు, అతను ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కూడా సభ్యుడు. [7] 2014 ఆసియా కప్, 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లలో వారి మొదటి ప్రదర్శనల సమయంలో అతను కెప్టెన్‌గా ఉన్నాడు. నబీ అనేక ట్వంటీ 20 ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ వేలంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎంపికైన మొదటి ఆటగాడు.

2019 సెప్టెంబరులో, అతను తన పరిమిత ఓవర్ల క్రికెట్ కెరీర్‌ను పొడిగించేందుకు టెస్టు క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. [8] 2020 ఆగస్టులో, నబీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులో సభ్యునిగా చేరాడు. [9]

తొలి జీవితం, కెరీర్

[మార్చు]

నబీ ఆఫ్ఘనిస్తాన్‌లోని లోగర్ ప్రావిన్స్‌లో జన్మించాడు. కానీ అతని కుటుంబం సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్‌లోని పెషావర్‌కు వెళ్లింది. [10] [11] 10 సంవత్సరాల వయస్సులో అతను పెషావర్‌లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. [10] 2000 లో అతని కుటుంబం తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లింది. అక్కడ అతను మొహమ్మద్ షాజాద్, అస్గర్ ఆఫ్ఘన్, షాపూర్ జద్రాన్‌లతో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. వీరంతా తరువాత ఆఫ్ఘన్ జాతీయ జట్టులో ముఖ్యమైన సభ్యులయ్యారు. [12] నబీ, 2003లో రహీమ్ యార్ ఖాన్ క్రికెట్ అసోసియేషన్‌పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరపున తన మొదటి పోటీ మ్యాచ్‌లో ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు పేలవంగా ఆడినప్పటికీ, నబీ 61 పరుగులతో జట్టుకు అత్యధిక స్కోరు చేశాడు. [11] [13] ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌కు వారి స్వంత క్రికెట్ గేర్ లేదు. దానిని పాకిస్తాన్, భారతదేశం నుండి కొనుగోలు చేయాల్సి వచ్చింది.[12]

2006లో, నబీ ఆఫ్ఘనిస్తాన్ తరపున ముంబయిలో మార్లెబోన్ క్రికెట్ క్లబ్ (MCC)తో జరిగిన టూర్ మ్యాచ్‌ ఆడాడు. అపుడూ సాధించిన పెద్ద విజయంలో అతను 116 పరుగులతో ఆఫ్ఘనిస్తాన్ తరపున అత్యధిక స్కోరు చేసాడు.[14] మాజీ ఇంగ్లీష్ టెస్టు కెప్టెన్ మైక్ గాటింగ్ అతన్ని గుర్తించాడు. [10] ఆ తర్వాత ఇంగ్లాండ్‌లోని MCC యంగ్ క్రికెటర్స్ ప్రోగ్రామ్‌లో నబీని చేర్చుకున్నారు. [15] MCCతో కలిసి నబీ, 2007లో శ్రీలంక A తో జరిగిన టూర్ మ్యాచ్‌లో ఫస్టు క్లాస్ రంగప్రవేశం చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో 43 పరుగులతో తన జట్టుకు అత్యధిక స్కోరింగ్ చేశాడు. [15] దీని తరువాత అతను పాకిస్తాన్ కస్టమ్స్ తరపున పాకిస్తాన్‌లో దేశీయ క్రికెట్ ఆడాడు. [16] అతను 2007/08 ABN-AMRO కప్ సమయంలో 2008 మార్చి 20న నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్‌పై పాకిస్తాన్ కస్టమ్స్ తరపున తన తొలి లిస్టు A మ్యాచ్ ఆడాడు. [17] ఆఫ్ఘన్ చీతాస్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

ఆఫ్ఘనిస్తాన్ వన్‌డే స్థాయికి ఎదుగుదల (2008–2009)

[మార్చు]

ప్రపంచ క్రికెట్ లీగ్‌లోని ఐదవ డివిజన్ నుండి వన్డే ఇంటర్నేషనల్ హోదాకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క "అస్థిరమైన" పెరుగుదలలో మొహమ్మద్ భాగం. [10] ఇది 2008 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఐదులో ప్రారంభమైంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. [18] టోర్నమెంట్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌లలో నబీ 108 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.[19] ఈ విజయం తర్వాత 2008 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఫోర్, ఆఫ్ఘనిస్తాన్ కూడా గెలిచింది. [20] నబీ 5.35 సగటుతో 14 వికెట్లు తీసి 25.66 సగటుతో 154 పరుగులు చేసి, [21] మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. [22]

నబీ 2009 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ త్రీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కూడా ఉన్నాడు, వారు 2009 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌కు చేరుకున్నారు. [23] ఆఫ్ఘనిస్తాన్ 2011 క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించనప్పటికీ, వారు వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) హోదాను సాధించారు. టోర్నమెంట్‌లో వారి చివరి మ్యాచ్, స్కాట్లాండ్‌తో జరిగిన ఐదవ ప్లే-ఆఫ్, జట్టుకు మొట్టమొదటి వన్‌డే. తన వన్‌డే రంగప్రవేశంలో నబీ 58 పరుగులు చేసి, తన తొలి వన్‌డే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [24] [25]

ప్రారంభ అంతర్జాతీయ కెరీర్ (2009–2013)

[మార్చు]

2009-10 ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో జింబాబ్వే XIకి వ్యతిరేకంగా నబీ ఆఫ్ఘనిస్తాన్ తరపున తన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడుతూ, మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి 3/90 తీసుకున్నాడు. [26] [27] అతను ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ముఖ్యమైన భాగంగా కొనసాగాడు. 2010 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్‌లో జట్టు కోసం కీలక పాత్ర పోషించాడు, [28] దీని ద్వారా ఆఫ్ఘనిస్తాన్ 2010 ICC వరల్డ్ ట్వంటీ20 కి అర్హత సాధించింది.

నవ్రోజ్ మంగళ్ కెప్టెన్సీలో వైస్-కెప్టెన్‌గా ఉంటూ స్థిరమైన ప్రదర్శన కనబరచాడు. 2010 ఆసియా క్రీడలకు ముందు మంగళ్‌ను కెప్టెన్సీ నుండి తొలగించిప్పుడు నబీ, ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. [29] బంగ్లాదేశ్‌తో ఫైనల్‌లో ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్ ఆసియా క్రీడల రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత నబీ కెప్టెన్‌గా కొనసాగలేదు. [30]

కెప్టెన్సీ (2013–2015)

[మార్చు]

2013 మార్చిలో, UAEలో జరిగే ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో జాతీయ జట్టుకు నబీ నాయకత్వం వహిస్తారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రకటించింది. అంతకుముందు నెలలో పాకిస్తాన్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌లో అతని పేళవమైన ప్రదర్శన కారణంగా నవ్రోజ్‌ మంగళ్‌ను కెప్టెన్సీ నుండి తొలగించారు. [30] అతని కెప్టెన్సీలో, ఆఫ్ఘనిస్తాన్ 2014 ఆసియా కప్‌కు వెళ్లింది, ఇది వారి మొట్టమొదటి అతిపెద్ద అంతర్జాతీయ వన్‌డే టోర్నమెంట్. [31] టోర్నమెంట్ సమయంలో వారు బంగ్లాదేశ్‌ను టెస్టు దేశంతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఓడించారు. [32] 2014 ICC వరల్డ్ ట్వంటీ 20, 2015 క్రికెట్ ప్రపంచ కప్ వరకూ నబీ కెప్టెన్‌గా కొనసాగాడు. కానీ అతని పేలవమైన ఫామ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ కప్‌లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందడం కారణాలతో అతను 2015 ఏప్రిల్లో కెప్టెన్‌గా రాజీనామా చేశాడు [33]

కెప్టెన్సీ తర్వాత (2015–ప్రస్తుతం)

[మార్చు]

నబీ కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత జింబాబ్వేతో ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక వన్‌డే సిరీస్ వరకు కొనసాగాడు. సిరీస్ సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ కొత్త కోచ్ ఇంజమామ్-ఉల్-హక్ నబీని బ్యాటింగ్ ఆర్డర్‌ను 6వ ర్యాంక్ నుండి 3వ స్థానానికి పెంచాడు. దాంతో అతని బ్యాటింగు నాటకీయంగా మెరుగుపడింది, సిరీస్‌లో అతని తొలి వన్‌డే సెంచరీ, 223 పరుగులను సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ 3-2తో సిరీస్‌ను గెలుచుకుంది, ద్వైపాక్షిక సిరీస్‌లో అసోసియేట్ జట్టు పూర్తిస్థాయి సభ్యుడిని ఓడించడం ఇదే మొదటిసారి. [34]

గ్రూప్ దశలో హాంకాంగ్, జింబాబ్వేలపై ఆఫ్ఘనిస్తాన్ గెలవడానికి 2016 ICC వరల్డ్ ట్వంటీ 20 లో నబీ ప్రధాన బాధ్యత తీసుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ నబీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 10 రౌండ్‌లోకి ప్రవేశించింది. [35] [36] ఇంగ్లండ్‌తో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో నబీ పటిష్టంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో నబీ ఒక క్యాచ్ తీసుకున్నాడు, బౌలింగులో ఒక వికెట్ పడగొట్టాడు, ఒక రనౌట్ చేశాడు. అయితే ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. [37]


2018 మేలో, అతను భారతదేశంతో ఆడిన వారి ప్రారంభ టెస్టు మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [38] [39] అతను 2018 జూన్ 14న భారతదేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ తరపున తన టెస్టు రంగప్రవేశం చేసాడు [40] 2019 ఫిబ్రవరిలో, అతను భారతదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [41] [42] 2019లో ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 లో 49 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. [43] మళ్లీ 3వ T20Iలో కూడా, నబీ 81 పరుగులు చేశాడు. 0-28(4)తో బౌలింగ్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ గెలుచుకున్నాడు. [44]

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. [45] [46] 2019 జూన్ 29న, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన 200వ వికెట్‌ను తీసుకున్నాడు. [47] అతను టోర్నమెంట్‌ను తొమ్మిది మ్యాచ్‌ల్లో పది మంది ఔట్‌లతో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముగించాడు. [48]

బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ సందర్భంగా, అతను వైట్-బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. [49] 2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [50]

టీమ్ మేనేజ్‌మెంట్‌తో విభేదాలు, జట్టు సన్నద్ధతతో నిరాశ కారణంగా 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత అతను కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. [51] అతని పేలవమైన ప్రదర్శన కారణంగా UAEతో జరిగిన వారి సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ T20I జట్టు నుండి కూడా అతన్ని తొలగించారు. [52] అయితే, 2023 మార్చిలో, అతను పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం T20I జట్టులోకి తిరిగి వచ్చాడు. [53] 2023 మార్చి 24న, మొదటి T20Iలో, అతను 38 బంతుల్లో 38 పరుగులు చేసి, 12 పరుగులకు 2 వికెట్లు తీశాడు. [54] అతని ఆల్ రౌండ్ ప్రదర్శన ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా మొదటిసారిగా పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో సహాయపడింది. [55]

దేశీయ, T20 ఫ్రాంచైజీ కెరీర్

[మార్చు]

నబీ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, వైటాలిటీ బ్లాస్టు, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ట్వంటీ20 ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లలో ఆడాడు. ఐపీఎల్‌ వేలంలో అఫ్ఘానిస్థాన్‌ నుంచి కొనుగోలు చేసిన తొలి ఆటగాడతను.

రికార్డులు

[మార్చు]
  • ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ (టీ20ఐలు)లో ఆఫ్ఘన్ క్రికెటర్ చేసిన అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డు నబీ పేరిట ఉంది. [56]
  • 2018 మార్చి 15న, వెస్టిండీస్‌తో జరిగిన 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో, అతను ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్డే ఇంటర్నేషనల్స్ లో 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్ అయ్యాడు. [57]
  • 2018 ఆగష్టులో, ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్ పర్యటనలో, అతను 100 వన్‌డే మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటరయ్యాడు. [58] ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ఆడిన 100వ వన్డే కూడా ఇది. [58]

ఐర్లాండ్‌తో ఆడుతున్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఐసిసి ప్రవర్తనా నియమావళిని నబీ ఉల్లంఘించినందుకు రెండుసార్లు దోషిగా తేలాడు.

మొదటి సంఘటన 2016 జూలైలో ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో జరిగింది. ఐర్లాండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో, ఐరిష్ బ్యాట్స్‌మెన్ ఎడ్ జాయిస్ రనౌటైనప్పుడు, బంతిని బౌండరీ లోపలే ఆపినట్లు నబీ చెప్పాడు. నబీ మాటపైనే అంపైర్లు బ్యాటరు ఔటైనట్లు ప్రకటించారు. అయితే తరువాత ఫోటోగ్రాఫిక్ ఆధారాల్లో, నబీ బంతిని తాకినపుడూ బౌండరీ వెలుపల ఉన్నట్లు తేలింది. అందువల్ల జాయిస్‌కు అది నాలుగు పరుగులు ఇవ్వాలి. అతను నాటౌటవుతాడు. నబీ "ఆట స్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన"లో దోషిగా తేలడంతో అతన్ని మందలించారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. [59]

రెండో సంఘటన 2017 మార్చిలో ఐర్లాండ్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో జరిగింది. బంతి స్పష్టంగా నేలను తాకినప్పటికీ నబీ క్యాచ్ తీసుకున్నందుకు వేడుక చేసుకున్నాడు. అంపైర్‌కు అప్పీల్ చేశాడు. మళ్లీ, అతను ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు దోషిగా నిర్ధారించబడి, అతనికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. ఆ మ్యాచ్‌ లోనే అతని సహచరుడు దవ్లత్ జద్రాన్‌ను కూడా వేరే సంఘటనకు హెచ్చరించారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్, ఇన్నింగ్స్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. [60]

గమనికలు

[మార్చు]
  1. 1.0 1.1 His date of birth is given as 7 March 1982 by CricketArchive and Sky Sports. Other sources give it as 1 January. 1 January is used by many Afghans as a de facto date of birth, particularly those born during the 1980s and 1990s, as dates of birth were often not recorded accurately or at all, particularly during the wars fought in the country since 1978.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Sieff K (2014) Happy birthday to the Afghans who don’t know when they were born, The Independent, 1 January 2014. Retrieved 28 June 2019.
  2. January 1 popular birth date choice for Afghans who do not know their date of birth, The Straits Times, 31 December 2017. Retrieved 28 June 2019.
  3. Aziz Amin Ahmadzai, Ziauddin Wahaj (2015) Afghanistan, Birthdays and War, The Diplomat, 15 January 2015. Retrieved 28 June 2019.
  4. "Mohammad Nabi-Melboure Renegades-BBL". Melbourne Renegades. Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 8 January 2021.
  5. "Steve Smith better than Virat Kohli, Kane Williamson and Joe Root: Mohammad Nabi". India Today. 25 June 2020. Retrieved 8 January 2021.
  6. "Full Scorecard of Afghanistan vs Ireland 2nd Match 2009/10 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-12-21.
  7. "Full Scorecard of Afghanistan vs India 3rd Match, Group C 2010 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-12-21.
  8. "Bangladesh vs Afghanistan: Mohammad Nabi set to retire from Test cricket". Hindustan Times. Retrieved 6 September 2019.
  9. "Mohammad Nabi inducted into Afghanistan Cricket Board". ESPN Cricinfo. Retrieved 20 August 2020.
  10. 10.0 10.1 10.2 10.3 Brickhill, Liam. "Mohammad Nabi | Afghanistan Cricket | Cricket Players and Officials". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  11. 11.0 11.1 Isam, Mohammad (26 February 2014). "The incredible life of Mohammad Nabi | Cricket". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  12. 12.0 12.1 Basu, Arani (26 September 2018). "Asia cup: Our stories of struggle inspire the youngsters: Mohammad Nabi | Cricket News". The Times of India. The Times Group. Retrieved 18 October 2018.
  13. "Afghanistan v Rahim Yar Khan Cricket Association, 21-23 January 2003". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  14. "Gatting falls for a duck against Afghanistan | Cricket". ESPNcricinfo. 23 March 2006. Retrieved 18 October 2018.
  15. 15.0 15.1 "Sri Lanka A take control of tour opener | Cricket". ESPNcricinfo. 10 July 2007. Retrieved 18 October 2018.
  16. "50th edition of Quaid-e-Azam trophy gets underway | Cricket". ESPNcricinfo. 20 October 2007. Retrieved 18 October 2018.
  17. "Full Scorecard of Pak Customs vs National Bnk Group C 2007/08 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-12-21.
  18. "Afghanistan claim title in Jersey | Cricket". ESPNcricinfo. 31 May 2008. Retrieved 18 October 2018.
  19. "Cricket Records | Records | ICC World Cricket League Division Five, 2008 - Afghanistan | | Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  20. "Afghanistan claim another title | Cricket". ESPNcricinfo. 11 October 2018.
  21. "ICC World Cricket League Division Four 2008/09". CricketArchive. Retrieved 18 October 2018.
  22. "Cricket Records | Records | ICC World Cricket League Division Four, 2008/09 - Afghanistan | | Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  23. "Afghanistan and Ugand through to World Cup Qualifiers | Cricket". ESPNcricinfo. 31 January 2009. Retrieved 18 October 2018.
  24. "Netherlands take third, Afghanistan win again | Cricket". ESPNcricinfo. 19 April 2009. Retrieved 18 October 2018.
  25. "5th Place Play-off, ICC World Cup Qualifiers at Benoni, Apr 19 2009 | Match Summary". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  26. "Taibu keeps Zimbabwe fighting | Cricket". ESPNcricinfo. 18 August 2009. Retrieved 18 October 2018.
  27. "Afghanistan coach wants more from in-form Noor Ali | Cricket". ESPNcricinfo. 23 August 2009. Retrieved 18 October 2018.
  28. McGlashan, Andrew; Dutta, Sahil (8 February 2010). "Associate nations eye Caribbean prize | Cricket". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  29. Momand, Ibrahim (7 November 2010). "Mohammad Nabi named Afghanistan captain | Cricket". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  30. 30.0 30.1 Farooq, Umar (1 March 2013). "Mohammad Nabi named captain ahead of ICC Intercontinental Cup | Cricket". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  31. Isam, Mohammad (24 February 2014). "Afghanistan join Asia's big boys | Cricket". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  32. Isam, Mohammad (5 March 2014). "Afghanistan impress, but batting needs work | Cricket". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  33. "Nabi steps down as Afghanistan captain | Cricket". ESPNcricinfo. 19 April 2015. Retrieved 18 October 2018.
  34. "Mohammad Nabi lauds Afghanistan for 'making history' | Cricket". ESPNcricinfo. 24 October 2015. Retrieved 18 October 2018.
  35. Kishore, Shashank (10 March 2016). "Nabi, Shahzad to the fore in easy Afghanistan win". ESPNcricinfo. Retrieved 13 March 2016.
  36. Moonda, Firdose (12 March 2016). "Afghanistan progress to main draw with thumping win". ESPNcricinfo. Retrieved 13 March 2016.
  37. Dobell, George (23 March 2016). "Moeen Ali staves off an England calamity | Cricket". ESPNcricinfo. Retrieved 18 October 2018.
  38. "Afghanistan Squads for T20I Bangladesh Series and on-eoff India Test Announced". Afghanistan Cricket Board. Archived from the original on 29 మే 2018. Retrieved 29 May 2018.
  39. "Afghanistan pick four spinners for inaugural Test". ESPNcricinfo. Retrieved 29 May 2018.
  40. "Only Test, Afghanistan tour of India at Bengaluru, Jun 14-18 2018". ESPNcricinfo. Retrieved 14 June 2018.
  41. "Mujeeb left out for Ireland Test, Shahzad out of T20Is". ESPN Cricinfo. Retrieved 7 February 2019.
  42. "No Mujeeb in Tests as Afghanistan announce squads for Ireland series". International Cricket Council. Retrieved 7 February 2019.
  43. "Mohammad Nabi sinks Irish hearts". Cricbuzz.
  44. "Rashid hat trick, Nabi 81 help Afg 3-0". Cricbuzz.
  45. "Hamid Hassan picked in Afghanistan's World Cup squad; Naib to captain". ESPN Cricinfo. Retrieved 22 April 2019.
  46. "Asghar Afghan included in Gulbadin Naib-led World Cup squad". International Cricket Council. Retrieved 22 April 2019.
  47. "ICC Cricket World Cup 2019 (Match 36): Pakistan vs Afghanistan – Statistical Highlights". Cricket Addictor. Retrieved 30 June 2019.
  48. "ICC Cricket World Cup, 2019 - Afghanistan: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 4 July 2019.
  49. "Afghanistan's Mohammad Nabi set to retire from Test cricket". Times of India. Retrieved 6 September 2019.
  50. "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.
  51. "Mohammad Nabi steps down as Afghanistan captain, citing disagreements with team management". Sky Sports (in ఇంగ్లీష్). Retrieved 2022-11-05.
  52. "Afghanistan drop Mohammad Nabi for UAE T20I series, Rashid Khan to lead 18-member squad". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-03-25.
  53. "Mohammad Nabi Makes Comeback as Afghanistan Announces Squad for T20I Series Against Pakistan". Saba Sports (in ఇంగ్లీష్). Retrieved 2023-03-25.
  54. AFP, Sharjah (2023-03-25). "Nabi stars as Afghanistan stun Pakistan in T20 series opener". The Daily Star (in ఇంగ్లీష్). Retrieved 2023-03-25.
  55. "Afghanistan's bowlers script their first-ever win over Pakistan". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-03-25.
  56. Mustafi, Suvajit (14 March 2017). "Mohammad Nabi's record onslaught, story of 6 overs and other statistical highlights from Afghanistan-Ireland 3rd T20I at Greater Noida". cricketcountry.com. Retrieved 18 October 2018.
  57. "ICC World Cup Qualifiers 2018, Super Sixes: Mohammad Nabi becomes 1st Afghan to take 100 wickets". Cricket Country. Retrieved 15 March 2018.
  58. 58.0 58.1 "100 ODIs: Mohammad Nabi and Afghanistan's ascension into the cricketing elite". International Cricket Council. Retrieved 29 August 2018.
  59. "Nabi reprimanded for breaching ICC Code of Conduct". ESPNcricinfo. 19 July 2016. Retrieved 18 October 2018.
  60. "Nabi, Dawlat warned for conduct breach". ESPNcricinfo. 3 April 2017. Retrieved 18 October 2018.