మోసగాళ్ళు
మోసగాళ్ళు | |
---|---|
దర్శకత్వం | జెఫ్రీ గీ చిన్ |
రచన | మంచు విష్ణు |
నిర్మాత | మంచు విష్ణు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | షెల్డన్ చౌ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | సామ్ సి.ఎస్ |
నిర్మాణ సంస్థలు | ఏవిఏ ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ |
విడుదల తేదీs | 19 మార్చి, 2021[1] |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు ఇంగ్లీష్ |
బడ్జెట్ | ₹51 కోట్లు |
మోసగాళ్ళు, 2021 మార్చి 19న విడుదలైన తెలుగు సినిమా. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లలో మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించాడు. ఇందులో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రూహి సింగ్, నవదీప్, నవీన్ చంద్ర, కర్మ మెక్కెయిన్ తదితరులు నటించారు. సాంకేతిక కుంభకోణాలకు సంబంధించిన నిజమైన సంఘటనల ఆధారంగా[2] తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమా రూపొందింది.[3]
కథా నేపథ్యం
[మార్చు]తరాల మధ్య; తూర్పు పడమర మధ్య; ధనిక పేద మధ్య భారతదేశంలో కాల్ సెంటర్ కుంభకోణంలో భారతీయ ఐటి పరిశ్రమను కదిలించిన, 380 మిలియన్ డాలర్లు (2,800 కోట్లు) సంపాదించిన నిజమైన సంఘటనల ఆధారంగా[4] ఈ సినిమా రూపొందింది. ఈ కుంభకోణంలో మిలియన్ డాలర్ల యుఎస్ పన్ను చెల్లింపుదారుల డబ్బు కొల్లగొట్టబడుతుంది.[5]
నటవర్గం
[మార్చు]- మంచు విష్ణు (అర్జున్)[6]
- కాజల్ అగర్వాల్ (అను)[7]
- సునీల్ శెట్టి (ఎసిపి కుమార్)[8]
- రూహి సింగ్ (మోహిని)[9]
- నవదీప్ (విజయ్)[10]
- నవీన్ చంద్ర (సిద్)[11]
- మహిమా మక్వానా (సోహా)[12]
- నాగినీడు
- రఘుబాబు
- రాజా రవీంద్ర
- రవివర్మ
- జూలియట్ ఆడ్రీ
- ప్రిస్సిలా అవిలా
- కాట్లిన్ ఆన్ క్లార్క్
- సౌరభ్ గోయల్
- శివం జెమిని
నిర్మాణం
[మార్చు]2019, జూన్ లో షూటింగ్ ప్రారంభమైంది.[13] ఈ సినిమా 2020, జూన్ 5న విడుదలకావాల్సి ఉంది. కాని కరోనా-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ₹51 కోట్ల (US $ 7 మిలియన్) బడ్జెట్‌తో నిర్మించబడింది. ఇది విష్ణు కెరీర్‌లో అత్యంత ఖరీదైన సినిమాగా నిలిచింది.[14]
విడుదల
[మార్చు]ఈ సినిమా 2021, మార్చి 19న విడుదలైంది.[15] ఈ సినిమాను హిందీ, తమిళం, కన్నడం, మలయాళ డబ్ వెర్షన్లలో విడుదల చేయనున్నారు.[16]
మూలాలు
[మార్చు]- ↑ "Mosagallu Releasing On March 19th!". Gulte. 3 February 2021.
- ↑ "Mosagallu unravels world's biggest IT scam". Bechuzi. 18 September 2020. Archived from the original on 18 సెప్టెంబరు 2020. Retrieved 20 మార్చి 2021.
- ↑ "Kajal Aggarwal and Vishnu Manchu's 'Mosagallu' release date announced". The News Minute. 2021-03-04. Retrieved 2021-03-20.
- ↑ "Vishnu Manchu's next to be based on call centre scam where NRIs in US were cheated". The News Minute. 24 March 2017. Retrieved 2021-03-20.
- ↑ "Suniel Shetty starts shooting for Hollywood film call centre inspired by a true life scam". Bangalore Mirror. 14 October 2019. Retrieved 2021-03-20.
- ↑ "Mosagallu first look out. Vishnu Manchu and Kajal Aggarwal join hands for film on IT scam". India Today. November 23, 2019.
- ↑ "Kajal Aggarwal's first look from Mosagallu out". The New Indian Express.
- ↑ "Suniel Shetty nails it as top cop in Mosagallu". Telangana Today.
- ↑ "Vishnu Manchu promises explosive action Mosagallu". Telangana Today.
- ↑ "Vishnu Manchu's next with Jeffrey Gee Chin titled Mosagallu; first look poster unveiled". The Times of India. 23 November 2019. Retrieved 2021-03-20.
- ↑ "Kajal Aggarwal's new poster from Mosagallu creates intrigue". The Times of India. 29 June 2020. Retrieved 2021-03-20.
- ↑ "Exclusive! Shubharambh's Mahima Makwana Talks About Lockdown, Her Film Mosagallu, Dealing With Anxiety During Quarantine & More". Newsbreak.[permanent dead link]
- ↑ "Manchu Vishnu begins filming sequence of 'Mosagallu' in US". The Minute. 5 February 2020.
- ↑ "51 Cr budget for Manchu Vishnu's Mosagallu". Hans News Service.
- ↑ "Coronavirus Halts Even A Big 'Filmy Scam'..!". SakshiPost. 27 March 2020. Retrieved 25 July 2020.
- ↑ Balach, Logesh (October 3, 2020). "Mosagallu: Allu Arjun unveils the teaser of Vishnu Manchu and Kajal Aggarwal's film". India Today.