మ్యాక్స్ (వస్త్ర తయారీ సంస్థ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మ్యాక్స్ ఫ్యాషన్ రీటెయిల్
రకంSubsidiary of ల్యాండ్ మార్క్ గ్రూప్
స్థాపితం2004
ప్రధానకార్యాలయంయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
సేవా ప్రాంతముసౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, బాహ్రెయిన్, కతార్, ఓమన్, టర్కీ, ఈజిప్టు, యెమెన్ మరియు భారతదేశం
పరిశ్రమరీటెయిల్
ఉత్పత్తులువస్త్రాలు, పాదరక్షలు, గృహోపకరణాలు
వెబ్‌సైటు[1]

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ఒక రెడీమేడ్ వస్త్ర తయారీదారు. వస్త్రాల తో బాటు కూలింగ్ గ్లాసులు, పాదరక్షలు, ఆభరణాలు, గృహోపకరణాలను తయారు చేస్తుంది. ఇది ప్రఖ్యాత ల్యాండ్ మార్క్ గ్రూప్ కు చెందిన ఒక సంస్థ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 2004 లో ప్రారంభించబడ్డ మ్యాక్స్ ఇప్పుడు సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, బాహ్రెయిన్, కతార్, ఓమన్, టర్కీ, ఈజిప్టు, యెమెన్ మరియు భారతదేశం లాంటి 11 దేశాలలో 94 స్టోరులను కలిగియున్నది. మధ్యతరగతి కొనుగోలుదారునికి అందుబాటులో ఉంటూనే, ఫ్యాషన్ లో రాజీ పడకుండా దుస్తులు, పాదరక్షలు తయారు చేయటం మూలాన మ్యాక్స్ మధ్యప్రాచ్య దేశాలలో అతి పెద్ద ఫ్యాషన్ రీటైలర్ గా స్థానం దక్కించుకొన్నది. సౌదీలో దీని పేరు సిటీ మ్యాక్స్. దీని ఉప శీర్షిక "Look Good. Feel Good."

పరిశోధనల ద్వార మ్యాక్స్ మధ్యతరగతి కొనుగోలుదారులు తాహతు మేరకు తన 80% ఉత్పత్తులు రూ.199/- నుండి రూ.599/- లోపే నిర్దేశించినది. ఈ ధరలో ఇంత అత్యాధునిక వస్త్రాలను రూపొందించటం మ్యాక్స్ ప్రత్యేకత. ప్యాంటలూన్స్, వెస్ట్ సైడ్ లకి ఇది గట్టి పోటీదారు.

మ్యాక్స్ స్టోరులలో 20% సాంప్రదాయిక దుస్తులు, 20% పాశ్చాత్య దుస్తులు, 20% శాతం పిల్లల దుస్తులు, 25% పురుషుల దుస్తులు మరియు 15% పాదరక్షలు ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా మ్యాక్స్ టర్నోవర్ రూ. 2,000 కోట్లు కాగా ఇందులో 10 శాతం భారతదేశం నుండి చేరుతుంది.

భారతదేశంలో మ్యాక్స్ స్టోరులు[మార్చు]

భారతదేశంలోని ఈ క్రింది పట్టణాల్లో మ్యాక్స్ స్టోరులు కలవు.

మూలాలు[మార్చు]

1. http://www.mydigitalfc.com/companies/max-retail-open-20-more-fashion-stores-099 2. http://www.thehindubusinessline.com/2010/04/22/stories/2010042251080500.htm

బాహ్య లంకెలు[మార్చు]