Jump to content

యమునా ఎక్స్‌ప్రెస్‌వే

వికీపీడియా నుండి
యమునా ఎక్స్‌ప్రెస్‌వే
పటం
ఎరుపు రంగులో యమునా ఎక్స్‌ప్రెస్‌వే
Yamuna Expressway Delhi Agra India August 2013.jpg
జేవార్ వద్ద యమునా ఎక్స్‌ప్రెస్‌వే
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA)
పొడవు165.537 కి.మీ. (102.860 మై.)
Existed2012 ఆగస్టు 9–present
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరపరీ చౌక్, గ్రేటర్ నోయిడా
దక్షిణ చివరకుబేర్‌పూర్ పాత ఎన్‌హెచ్-2, ఆగ్రా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఉత్తర ప్రదేశ్
Major citiesగ్రేటర్ నోయిడా, జేవార్, బృందావన్, హాత్‌రస్, మథుర, ఆగ్రా
రహదారి వ్యవస్థ

యమునా ఎక్స్‌ప్రెస్ వే 6- వరుసల వెడల్పుతో (8 వరుసలకు కి విస్తరించగలిగే వీలుతో), 165.5 కి.మీ. (102.8 మై.) పొడవుతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్ వే. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేలలో ఆరవది. ఇది గ్రేటర్ నోయిడాను ఆగ్రాతో కలుపుతుంది. పాత ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-2) పైన రద్దీని తగ్గించడానికి ఇది నిర్మించబడింది.

ఎక్స్‌ప్రెస్‌వే 12,839 crore (US$1.6 billion) పెట్టుబడితో నిర్మించిన ఈ రహదారిని 2012 ఆగస్టు 9 న అప్పటి యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రారంభించాడు.[1] [2] స్థానిక ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ వేలోకి వెళ్లేందుకు రహదారి పొడవునా 13 సర్వీస్ రోడ్లు నిర్మించారు.[3] గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ సమీపంలోని జగన్‌పూర్ అఫ్జల్‌పూర్ గ్రామంలో నిర్మించిన ఇంటర్‌చేంజ్ ద్వారా యమునా ఎక్స్‌ప్రెస్‌వే, తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేతో కలుస్తుంది.[4]

చరిత్ర

[మార్చు]

సంవత్సరాల ఆలస్యం తర్వాత, 2012 మేలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తయింది.[5] 2012 ఆగస్టు 9 న అధికారికంగా ప్రారంభించారు.[1] అనుకున్న సమయం కంటే దాదాపు రెండు సంవత్సరాలు ఆలస్యంగా ఇది పూర్తైంది.[6]

ఫైటర్ జెట్‌ల ల్యాండింగ్

[మార్చు]

భారతదేశంలో మొదటిసారిగా, 2015 మే 21 న మథుర లోని రాయ గ్రామ సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై డస్సాల్ట్ మిరాజ్ 2000 యుద్ధవిమానం విజయవంతంగా ల్యాండైంది.

సైనిక విమానాల ద్వారా అత్యవసర ల్యాండింగ్‌ల కోసం హైవేలను ఉపయోగించడం యొక్క ప్రయోజనాన్ని అంచనా వేయడానికి ఈ డ్రిల్ ఒక అభ్యాసం. [7]

విశేషాలు

[మార్చు]

యమునా ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో సుంకం లేని హెల్ప్‌లైన్‌తో పాటు SOS బూత్‌లు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌వే వెంట ప్రతి 5 కి.మీ. (3.1 మై.) కు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కనిష్ట, గరిష్ట వేగ పరిమితులకు అనుగుణంగా పర్యవేక్షించడానికి మొబైల్ రాడార్లు ఉన్నాయి; ప్రతి 25 కి.మీ. (16 మై.) కు ఒక హైవే పెట్రోలింగ్ ఉంది. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రతిరోజూ 1,00,000 వాహనాలు ఉపయోగిస్తాయని, గ్రేటర్ నోయిడా, ఆగ్రాల మధ్య ప్రయాణ సమయం నాలుగు గంటల నుండి ఒక గంట 40 నిమిషాలకు తగ్గిందని భావిస్తున్నారు.[8] మార్గంలో సగాన తప్పల్ వద్ద పెట్రోలింగ్ స్టేషన్ ఉంది. తప్పల్, నోయిడా సెక్టార్ 37 లేదా నోయిడా సిటీ సెంటర్ నుండి 60 కి.మీ. (37 మై.) దూరంలో ఉంది.[9]

మెట్రో రైలు కనెక్టివిటీ

[మార్చు]

భవిష్యత్తులో పరీ చౌక్ నుండి యమునా ఎక్స్‌ప్రెస్‌వే సెక్టార్ 18, 20 వరకు మెట్రో రైలు మార్గం నిర్మిస్తామని అధికారులు తెలిపారు.

అభివృద్ధి

[మార్చు]
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వే

యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA), ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 3 దశల్లో అభివృద్ధి చేసింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్‌కు కాంట్రాక్ట్‌ను అప్పగించింది:

  • దశ 1: గ్రేటర్ నోయిడాకు, ప్రతిపాదిత తాజ్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ హబ్ (గౌతమబుద్ధ నగర్ జిల్లా దక్షిణ కొనలోని జేవార్ గ్రామం సమీపంలో) కూ మధ్య ఈ ఎక్స్‌ప్రెస్‌వే సాగుతుంది
  • దశ 2: ప్రతిపాదిత తాజ్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ హబ్, దానికీ ఆగ్రాకీ మధ్య ఉన్న ఒక స్థలం వరకు ఎక్స్‌ప్రెస్ వే సాగుతుంది.
  • దశ 3: రెండవ దశ బిందువు నుండి, ఆగ్రా వరకు ఎక్స్‌ప్రెస్ వే సాగుతుంది.

ఎక్స్‌ప్రెస్‌వేలో వేగ పరిమితిని 100 km/h (62 mph) గా విధించారు. ఎక్స్‌ప్రెస్‌వేలో కుడివైపు వరుసను ఓవర్‌టేక్ చేయడానికి మాత్రమే కేటాయించారు.[10] భారీ వాహనాల వేగాన్ని గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేసారు.[11]

ఆగ్రా-లక్నో కనెక్టివిటీ 302 కి.మీ. (188 మై.) ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును 15,000 కోట్ల అంచనా బడ్జెట్‌తో పూర్తి చేసారు. దీని ద్వారా యమునా ఎక్స్‌ప్రెస్‌వే నుండి లక్నో వరకు వేగవంతమైన రవాణాకు వీలు కలుగుతుంది. యమునా ఎక్స్‌ప్రెస్ వే ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్‌వే 11.9 కి.మీ. (7.39 మై.) ద్వారా ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించబడింది. ఇది దూరాన్ని తగ్గించడమే కాక, ఆగ్రాలో ట్రాఫిక్‌ వత్తిడిని తగ్గిస్తుంది, పర్యాటకులు నేరుగా తాజ్ మహల్ చేరుకోవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Yamuna Expressway opens, one-way toll Rs 320, free ride till Aug 15". The Times of India. Times News Network. 9 August 2012. Retrieved 6 June 2018.
  2. "Yamuna Expressway is ready, says Jaypee Infra". Business Line. 3 August 2012. Retrieved 6 June 2018.
  3. "Yamuna Expressway - Verdict Traffic". Archived from the original on 2024-07-19. Retrieved 2024-08-17.
  4. "Interchange at Yamuna Expressway to connect Eastern Peripheral Expressway". The Times of India. 10 August 2018.
  5. "Expressway ready: Jaypee team tells UP officials". 9 May 2012.
  6. "Yamuna e-way opens on Aug 9". The Times of India. 3 August 2012.
  7. "IAF successfully test-lands Mirage on Yamuna e-way". The Times of India. 22 May 2015.
  8. "About Us | Yamuna Expressway Industrial Development Authority". Yamunaexpresswayauthority.com. 24 April 2001. Archived from the original on 21 ఏప్రిల్ 2012. Retrieved 17 ఆగస్టు 2024.
  9. "Salient Features of the Yamuna Expressway Project (Yamuna Expressway Industrial Development Authority)". YEIDA. Archived from the original on 7 December 2013.
  10. "Yamuna Expressway: From Dec, zoon to Agra at 120 km/h". The Times of India. 9 November 2011.
  11. Hussain, Raza Rahil (2012-08-10). "Yamuna Expressway - Everything You Need to Know" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-05.