తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే
కుండ్లి–ఘజియాబాద్–పల్వేల్ ఎక్స్‌ప్రెస్‌వే
పటం
ఎరుపు రంగులోతూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI)
పొడవు135 కి.మీ. (84 మై.)
Existed2018 మే 27–present
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరకుండ్లి,, సోనీపత్, హర్యానా
దక్షిణ చివరధోలాగఢ్, పల్వాల్, హర్యానా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుహర్యానా, ఉత్తర ప్రదేశ్
Major citiesసోనీపత్, బాగ్‌పత్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్, పల్వాల్
రహదారి వ్యవస్థ

తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే (EPE) హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్ళే 135 కి.మీ. (84 మై.) ల[1][2] 6- వరుసల ఎక్స్‌ప్రెస్‌వే.[3][4] ఇద్ కుండ్లీ, సోనిపట్ వద్ద పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వేతో కూడలి వద్ద మొదలై,[5] ఉత్తర ప్రదేశ్ లోని బాగ్‌పట్, ఘజియాబాద్, నోయిడా జిల్లాల గుండా వెళ్ళి, హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా ధోలాఘర్, పల్వాల్ సమీపంలో తిరిగి పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వేతో కలుస్తుంది.[6] [7] దీన్ని కుండ్లి-ఘజియాబాద్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే (KGP ఎక్స్‌ప్రెస్‌వే) అని కూడా అంటారు. తూర్పు, పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వేలు రెండూ కలిసి, ఢిల్లీ చుట్టూ అతిపెద్ద రింగ్ రోడ్‌ను ఏర్పరచాయి.[8][9] 2006 మార్చిలో తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వేను నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే 2 (NE-2) గా ప్రకటించారు.[10]

ఫరీదాబాద్-ఘజియాబాద్ భాగంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికీ, కాలుష్యానికి కారణమయ్యే వాణిజ్య వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరోధించడానికీ, ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ 11 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు.[11][12] NHDP ఆరవ దశ కింద బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించడం కోసం 2015 ఆగస్టులో భారత ప్రభుత్వం నిధులందించేందుకు ఆమోదించింది.[13]

ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరట్‌ను అనుసంధించే క్రమంలో, భారతదేశంలోకెల్లా అత్యంత విశాలమైన 14-వరుసల ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేని దాటుతుంది.

తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ నుండి 50,000 కంటే ఎక్కువ ట్రక్కులను మళ్లిస్తూ, ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని 27% తగ్గిస్తుంది.[14][15] 2018 మే 27 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని బాగ్‌పత్‌లో ప్రారంభించాడు. [16] గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ సమీపంలోని జగన్‌పూర్ అఫ్జల్‌పూర్ గ్రామంలో తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే, ఇంటర్‌చేంజ్ ద్వారా యమునా ఎక్స్‌ప్రెస్‌వేతో కలుస్తుంది.[17]

విశేషాలు

[మార్చు]

భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన అనేక విశేషాలు ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఉన్నాయి. [18]

  • 135 కి.మీ పొడవున్న ఎక్స్‌ప్రెస్‌వేలో ఉన్న సుంకం వ్యవస్థలో మొత్తం పొడవుపై కాకుండా, ప్రయాణించిన దూరంపై మాత్రమే సుంకం వసూలు చేస్తారు.
  • ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేలా ఎలక్ట్రానిక్ టోల్ వసూలు చేసే వీలు ఉంది.
  • పరిమితికి మించిన బరువున్న వాహనాలు ఎక్స్‌ప్రెస్‌వేలోకి రాకుండా ప్రవేశాల వద్ద కదులుతూండగానే బరువు చూసే ఏర్పాట్లు ఉన్నాయి. సెన్సార్‌లు అన్ని ప్రవేశ స్థలాల వద్ద రెండు గేట్‌లతో ఈ సెన్సార్లను ఏర్పాటు చేసారు. ఒకటి ఎక్స్‌ప్రెస్‌వేకి దారి తీస్తుంది, రెండవది అధిక బరువున్న వాహనాలను దారి మళ్లిస్తుంది.
  • అధిక బరువున్న వాహనాలు బరువు ప్రమాణాలకు అనుగుణంగా కొంత సరుకును దించేసి, మళ్ళీ ఎక్స్‌ప్రెస్‌వే ఎక్కడానికి వీలుగా ట్రక్కుల పార్కింగ్ సదుపాయం ఉంది.
  • వేగాన్ని తనిఖీ చేయడానికి, ప్రతి 2 కిలోమీటర్లకు కెమెరాలను అమర్చారు. ఓవర్-స్పీడ్ వాహనాలకు సుంకం కేంద్రాల వద్ద చలాన్ జారీ చేస్తారు. సుంకం మొత్తానికి చలాన్ మొత్తాన్ని కలుపుతారు.
  • ప్రతి 500 మీటర్లకు వర్షపు నీటిని సేకరించే సౌకర్యం కల్పించారు.
  • హైవే వెంబడి 2.5 లక్షల చెట్లను నాటారు, వాటికి బిందు సరఫరా వ్యవస్థ ద్వారా నీరందించనున్నారు
  • ఎక్స్‌ప్రెస్‌వేకు ఇరువైపులా 2.5 మీటర్ల సైకిల్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేశారు
  • ఎక్స్‌ప్రెస్‌వే లైటింగు కోసం విద్యుత్తును అందించేందుకు వివిధ ప్రదేశాలలో సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రెస్‌వే పక్కన మొత్తం 4,000 కిలోవాట్ల (4 మెగావాట్ల ) సామర్థ్యంతో 8 సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు.
  • హైవే నిర్మాణంలో నేల చదును చేసేందుకు అవసరమైన మట్టిలో 33%, బొగ్గు విద్యుత్ ప్లాంట్‌ల నుండి వచ్చే ఫ్లై యాష్‌ని ఉపయోగించారు. కాలుష్యాన్ని తగ్గించడంలో అది దోహదపడింది.
  • ఎక్స్‌ప్రెస్‌వేలో 4 ప్రధాన వంతెనలు, 46 చిన్న వంతెనలు, 3 ఫ్లైఓవర్‌లు, 7 ఇంటర్‌ఛేంజ్‌లు, 221 అండర్‌పాస్‌లు, 8 రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు (ROB) - క్మొత్తం 406 నిర్మాణాలు ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "3 projects in Haryana to be completed soon". The Hindu.
  2. Barman, Sourav Roy (28 May 2018). "First 'Smart' highway holds out hope for a congested, choking capital". Indian Express. Retrieved 5 June 2018.
  3. "Eastern Peripheral Expressway - Invitation of Proposals" (PDF). Retrieved 9 January 2016.
  4. "Reliance Infrastructure is sole bidder for Eastern Peripheral Expressway". The Economic Times. 26 December 2008. Retrieved 9 January 2016.
  5. "After 9-yr delay, KMP eway to be completed by August". Archived from the original on 2018-07-30. Retrieved 2024-08-17.
  6. "Chaos, theft, accident: All is not well with Delhi's 'smart' eastern expressway".
  7. "Eastern Peripheral Expressway: Some way to go for the brand new expressway". The Hindu.
  8. "PM Modi to inaugurate Western Peripheral Expressway: All you need to know". The Times of India.
  9. "Ring around Delhi: Final piece to fall in place as Western Peripheral Expressway opens today". The Times of India.
  10. Notification dated March 30, 2006
  11. "Eastern Peripheral Expressway, Built At Rs 11,000 Crore, To Be Inaugurated Tomorrow". NDTV. Retrieved 26 May 2018.
  12. Keelor, Vandana (3 June 2014). "New expressway to link Noida with Faridabad". Times of India. Retrieved 5 June 2018.
  13. "Government approves 17,000-crore highways upgradation projects". The Economic Times. Retrieved 9 January 2016.
  14. Bhattacharya, Somreet (29 May 2018). "Day 1 of Eastern Peripheral Expressway: 50,000 fewer trucks in Delhi". Times of India. Retrieved 5 June 2018.
  15. "Eastern Peripheral Expressway inaugurated by PM Modi is likely to decrease Delhi pollution by 27 per cent". India Today. 28 May 2018. Retrieved 5 June 2018.
  16. "Prime Minister Narendra Modi to Inaugurate Eastern Peripheral Expressway on May 27". News18. Retrieved 2018-05-25.
  17. "Interchange at Yamuna Expressway to connect Eastern Peripheral Expressway". The Times of India.
  18. "India's Eastern Peripheral Expressway boasts of many firsts, to be ready within 500 days". The Economic Times. 23 April 2018. Archived from the original on 23 June 2018. Retrieved 5 June 2018.