పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే
పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే | |
---|---|
కుండ్లీ–మనేసర్–పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే | |
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HSIIDC) | |
పొడవు | 135.6 కి.మీ. (84.3 మై.) |
Existed | 2018 నవంబరు 19–present |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తర చివర | కుండ్లీ, సోనీపత్ |
దక్షిణ చివర | ధోలాగఢ్, పల్వల్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | హర్యానా |
Major cities | సోనీపత్, ఖర్‌ఖోడా, బహదూర్‌గఢ్, బద్లీ, ఝజ్జర్, మనేసర్, నూహ్, సోహ్‌నా, హాథిన్, పల్వల్[1] |
రహదారి వ్యవస్థ | |
పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే (వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే -WPE) హర్యానా రాష్ట్రం గుండా వెళ్ళే 135.6 కి.మీ. (84.3 మై.) పొడవైన 6-వరుసల ఎక్స్‌ప్రెస్ వే [2][3][4][5] దీన్ని కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే (KMP ఎక్స్‌ప్రెస్‌వే) అని కూడా అంటారు. తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే, పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే ల ద్వారా ఢిల్లీ నుండి 50,000 కంటే ఎక్కువ భారీ వాహనాలను మళ్లించవచ్చని అంచనా వేసారు.[6][7] ఇది ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.[8] ఈ రెండు ఎక్స్‌ప్రెస్‌వేలు కలిసి ఢిల్లీ చుట్టూ అతిపెద్ద రింగ్ రోడ్‌ను ఏర్పరుస్తాయి.[9][10] ఈ మార్గంలో 10 సుంకంతో కూడిన ప్రవేశాలు, నిష్క్రమణలూ ఉన్నాయి. ఉత్తరం నుండి దక్షిణానికి అవి: కుండ్లీ, ఖర్ఖోడా, బహదూర్‌గఢ్, బద్లీ, ఫర్తుఖ్‌నగర్, పంచగావ్, మనేసర్, తావోరు, సోహ్నా, పల్వల్. [11] 2018 డిసెంబరులో సుంకాలు కార్లకు ఒక కి.మీకు రూ 1.35, తేలికపాటి మోటారు వాహనాలకు ఒక కి.మీకి రూ 2.18, ట్రక్కులు, బస్సులకు రూ 4.98 సుంకం ఉండేది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.[11]
ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా ఉన్న రెండు కిలోమీటర్ల ప్రాంతాన్ని నియంత్రిత జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రదేశంలో ఢిల్లీ-సోనిపట్-రోహ్తక్-గురుగ్రామ్-ఫరీదాబాద్ సమ్మేళనంలో భాగంగా ఒకదాని పక్కన ఒకటి ఉండే ఐదు కొత్త గ్రీన్‌ఫీల్డ్ నగరాలను అభివృద్ధి చేస్తారు. ఢిల్లీ మెట్రో 5 వ దశలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే వెంట కొత్త మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు.[12]
చరిత్ర
[మార్చు]53 కి.మీ.ల పొడవున్న మనేసర్ - పల్వాల్ విభాగాన్ని 2016 ఏప్రిల్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించాడు.[13][14] ఎక్స్‌ప్రెస్‌వేలో మిగిలిన 83 కి.మీ. కుండ్లి - మనేసర్ విభాగాన్ని 2018 నవంబరు 19 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు.[15] 2018 డిసెంబరులో KMP ఎక్స్‌ప్రెస్‌వేపై సుంకం వసూలు ప్లాజాలను ప్రారంభించారు.[16]
135.6 కి.మీ.ల పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వేను బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (BOT) పద్ధతిలో నిర్మించాలని 2003 లో మొదట ప్రతిపాదించారు. కుండ్లి, సోనిపట్ సమీపంలోని NH-1 నుండి పల్వాల్ సమీపంలోని NH-2 వరకు నాలుగు వరుసల యాక్సెస్-నియంత్రిత రహదారిగా దీన్ని ప్రతిపాదించారు.[17] ఈ రహదారి పైకి వాహనాలను దారి మళ్లించడం వల్ల ఢిల్లీకి ప్రయోజనం ఉంటుంది కాబట్టి, ఎక్స్‌ప్రెస్‌వే భూసేకరణ ఖర్చులో సగం భరించేందుకు ఢిల్లీ రాష్ట్రం అంగీకరించింది.[18] 2006 లో హర్యానా ప్రభుత్వం పశ్చిమ పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌పై పని ప్రారంభించింది.[19] టెండర్‌ను KMP ఎక్స్‌ప్రెస్‌వేస్ లిమిటెడ్‌కు అప్పగించారు. జూన్ 2009 లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కావాల్సి ఉండగా, దాన్ని 2013 మే కి మార్చారు.[20] 2016 లో పదేపదే ఆలస్యం చేయడం వల్ల హర్యానా ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి, KMP ఎక్స్‌ప్రెస్‌వేస్‌కు, రుణదాతలకూ పరిహారంగా రూ 1,300 కోట్లు చెల్లించింది.[21] [22] 2016 జనవరిలో భారత సుప్రీంకోర్టు జోక్యం తర్వాత, ప్రాజెక్టును పునరుద్ధరించి, కొత్త బిడ్‌లను ఆహ్వానించారు.[23] ప్రణాళికను నాలుగు వరుసల నుండి ఆరు వరుసలకు పెంచారు.[24] పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వేను 2018 నవంబరులో ప్రారంభించారు.
మార్గం, ఇంటర్‌ఛేంజ్‌లు
[మార్చు]ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 10 సుంకం వసూలు చేసే ప్రవేశాలు, నిష్క్రమణలూ ఉన్నాయి. కింది వాటితో సహా, 52 అండర్‌పాస్‌లు, 23 ఓవర్‌పాస్‌లు ఉన్నాయి.[25] [26] [27] : [26]
- 4 రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు
- జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై క్రాసింగ్‌ల వద్ద 10 ఓవర్‌పాస్‌లు, అండర్‌పాస్‌లు ,
- ప్రధాన జిల్లా రోడ్లు మరియు గ్రామ రహదారులపై క్రాసింగ్‌ల వద్ద 7 ఓవర్‌పాస్‌లు, 9 అండర్‌పాస్‌లు, 27 అండర్‌పాస్‌లు
- 33 వ్యవసాయ వాహనాల అండర్‌పాస్‌లు, 31 పశువులు దాటే మార్గాలు, 61 పాదచారులు దాటే మార్గాలు.
ఇంటర్‌చేంజ్‌ల జాబితా
స్థానం | హైవే | మార్గం | ఇంయ్టర్‌చేంజ్ రకం | సంబంధిత మల్టీమోడల్ ప్యాసింజర్ ఇంటర్‌చేంజ్ |
---|---|---|---|---|
కుండ్లి | NH 44 | ఢిల్లీ - పానిపట్ - అంబాలా Gరోడ్ | క్లోవర్లీఫ్ | కుండ్లి MMTS |
ఖర్ఖోడా | NH18 | ఢిల్లీ- బవానా -ఖార్ఖోడా-రోహ్తక్ | రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్ | |
బహదూర్‌ఘర్ | NH 9 | ఢిల్లీ- రోహ్తక్ - హిసార్ - సిర్సా | క్లోవర్లీఫ్ | బహదూర్‌ఘర్ MMTS |
బద్లీ | SH123 | ఝజ్జర్ - బద్లీ - గుర్గావ్ | రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్ | |
ఫరూఖ్‌నగర్ | NH15A | ఢిల్లీ- ఝజ్జర్ | రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్ | |
పంచగావ్ | NH48 | గురుగ్రామ్- భివాడి - రేవారి - జైపూర్ | క్లోవర్లీఫ్ | పంచగావ్ చౌక్ MMTS |
టౌరు | NH 919 | గురుగ్రామ్-సోహ్నా-భివాడి-జైపూర్ | రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్ | |
సోహ్నా | NH 248A | గురుగ్రామ్- నుహ్ - ఫిరోజ్‌పూర్ జిర్కా | రౌండ్‌అబౌట్ ఇంటర్‌చేంజ్ & ఫ్లైఓవర్ | |
పాల్వాల్ | NH19 | ఫరీదాబాద్ - హోడల్ - మధుర - ఆగ్రా - యమునా ఎక్స్‌ప్రెస్ వే | క్లోవర్లీఫ్ | బలరాంగర్ MMTS |
సౌకర్యాలు
[మార్చు]ఈ ఎక్స్ప్రెస్వేలో ఇంధనం నింపే స్టేషన్లు, 2 ట్రక్ స్టాప్లు, 4 బస్ స్టాండ్లు, హెలిప్యాడ్తో కూడిన 1 మెడికల్ ట్రామా సెంటర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, రిఫ్రెష్మెంట్, వినోద సౌకర్యాలతో కూడిన 5 ప్యాసింజర్ మల్టీమోడల్ ట్రాన్సిట్ స్టేషన్లు (ఎంఎంటిఎస్) ఉన్నాయి.
ఇచి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Kumar, Ashok (9 April 2015). "Work on KMP Expressway to start soon". The Hindu. Retrieved 9 January 2016.
- ↑ WPE opens in November 2018, Times of India, November 2018.
- ↑ "Delhi to get new stretch of Western Peripheral Expressway, vehicular pollution to go down".
- ↑ "3 projects in Haryana to be completed soon".
- ↑ Barman, Sourav Roy (28 May 2018). "First 'Smart' highway holds out hope for a congested, choking capital". The Indian Express. Retrieved 5 June 2018.
- ↑ "83km Kundli-Manesar-Palwal stretch may not be opened on Haryana Diwas". Retrieved 5 June 2018.
- ↑ Roy, Sidhartha (19 November 2018). "Western Peripheral Expressway: 50,000 vehicles may go off Delhi roads". The Times f India. Retrieved 20 November 2018.
- ↑ "Residents of Delhi to wait for another 3 months to get breather from heavy vehicles, subsequent air pollution".
- ↑ "PM Modi to inaugurate Western Peripheral Expressway: All you need to know".
- ↑ "Ring around Delhi: Final piece to fall in place as Western Peripheral Expressway opens today".
- ↑ 11.0 11.1 Toll booths to open at all KMP entries, exits, December 2018.
- ↑ "KMP Expressway- Western Peripheral Expressway Route Map, Toll Charges and More - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-06-27. Retrieved 2024-07-06.
- ↑ "After 9-yr delay, KMP eway to be completed by August". Archived from the original on 2018-07-30. Retrieved 2024-08-30.
- ↑ "Kundli-manesar stretch of western peripheral e-way ready before time".
- ↑ "Gurgaon: Kundli-Manesar expressway inauguration today". Retrieved 5 November 2018.
- ↑ "7 toll plazas begin operations on KMP e-way, 200 marshals deployed to manage traffic".
- ↑ "KMP Expressways achieves financial closure of BOT project". Money Control. 9 January 2007. Archived from the original on 4 March 2016. Retrieved 9 January 2016.
- ↑ Nangia, Tarun (14 July 2013). "Rough road ahead". The New Indian Express. Archived from the original on 18 July 2013. Retrieved 9 January 2016.
- ↑ "Western Peripheral Expressway likely to open next month".
- ↑ Nair, Vishwanath (5 April 2013). "Lenders ask developer to give up". The Financial Express. Retrieved 9 January 2016.
- ↑ Rao, Hitender (1 December 2014). "BJP govt in dilemma over KMP E-way project". Hindustan Times. Archived from the original on 25 January 2015. Retrieved 9 January 2016.
- ↑ Dash, Dipak K (23 January 2015). "Haryana asks Centre to take over incomplete expressway". The Times of India. Retrieved 9 January 2016.
- ↑ Bhatnagar, Gaurav Vivek (24 February 2015). "KMP Expressway put on fast track". The Hindu. Retrieved 9 January 2016.
- ↑ Dash, Deepak K (9 April 2015). "Finally, work on bypass e-ways begins". The Times of India. Retrieved 9 January 2016.
- ↑ "KMP e-way to partially open in March". The Indian Express. 22 December 2010. Retrieved 22 May 2016.
- ↑ 26.0 26.1 "Chaos, theft, accident: All is not well with Delhi's 'smart' eastern expressway".
- ↑ "KMP to miss August deadline too, could take 3 more months".