యేటి కొప్పాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యేటి కొప్పాక, విశాఖపట్నం జిల్లా, ఎలమంచిలి మండలానికి చెందిన గ్రామం.[1]. ఇక్కడఊక పంచదార కర్మాగారం ఉంది. ఈ ఊళ్ళో రంగురంగుల లక్క సామాను తయారు చేస్తారు. ఇక్కడ తరతరాలుగా లక్కబొమ్మలు తయారీ ఒక కుటీర పరిశ్ర్రమగా వెలుగొందుచున్నది. ఇక్కడ తయారయ్యే బొమ్మలు దేశ విదేశాల్లో బహు ప్రాముఖ్యం చెందినవి. ఈ ప్రాంతంలో దొరికే ఒక ప్రత్యేకమైన అంకుడు కలపతో వివిధ రకముల బొమ్మల విడి భాగములు తయారుచేసి వాటిని లక్కతో అతికించడం వలన వీటికి లక్క బొమ్మలు అని పేరు. మా గ్రామం కేవలం లక్క బొమ్మలకే కాక వేరొక విషయంలో కూడా చెప్పుకొదగినది. భారతదేశంలో మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారం ఈ గ్రామంలోనే 1933 సం.లో స్థాపించబడింది. ఈ కర్మాగారం "ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారం" అని పిలవబడుచున్నది. ప్రస్తుతం ఇది దార్లపూడి గ్రామం.[1] లోనికి మార్చబడింది.ఇది మన రాష్ట్రంలో ఉన్న సహకార చక్కెర కర్మాగారములలో మిక్కిలి పేరెన్నికగన్నది.

రహదారి మార్గం[మార్చు]

విశాఖపట్నం నుండి 70 కిలోమీటర్ల దూరం. విశాఖపట్నం నుండి కాకినాడ / రాజమండ్రి మార్గంలో "అడ్డరోడ్డు" (ఎలమంచిలి తర్వాత) అను ఊళ్ళో దిగి అక్కడి నుండి బస్సు గాని ఆటో ద్వారా గాని ఈ గ్రామం చేరుకోవచ్చు.

రైలు మార్గం[మార్చు]

విశాఖపట్నం నుండి రాజమండ్రి మార్గంలో "నర్సీపట్నంరోడ్డు" రైల్వే స్టేషనులో దిగి అక్కడి నుండి బస్సు గాని ఆటో ద్వారా గాని ఈ గ్రామం చేరుకోవచ్చు.

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-14. Cite web requires |website= (help)