యేలేశ్వరపు శ్రీనివాసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యేలేశ్వరపు శ్రీనివాసులు ప్రముఖ నాట్యకారుడు.[1] ఆయన కొంతకాలంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి సెద్దేంద్ర యోగి కళాపీఠంలో నృత్య అధ్యాపకునిగా పనిచేస్తున్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందినవారు. ఆయన తండ్రి యేలేశ్వరపు వేణుగోపాల శర్మ. ఆయనది కళాకారుల కుటుంబం అయినందున తల్లిదండ్రులనుండి నాట్య కళను అభ్యసించడానికి మంచి ప్రోత్సాహం లభించింది. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయంలో బి.ఎస్.సి పూర్తి చెసారు. తరువాత కూచిపూడి నాట్యంలో డిప్లొమా పొందారు. యక్షగానం-నాట్యంలో ఎం.ఎ చేసారు.

ఆయన తన ఏడవ యేట నుండి కూచిపూడి నాట్యం నేర్చుకొని ప్రస్తుతం దేశవిదేశాల్లో ఘన కీర్తిని సంపాదించుకున్నారు. యిప్పటికి ఆయన సుమారు 1000 ప్రదర్శనలిచ్చారు. ఆయన తన ఏడవ యేట కూచిపూడికి చెందిన ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం గారి వద్ద శిష్యునిగా చేరి నృత్యకళను అభ్యసించారు. గురువు గారి పర్యవేక్షణలొ అనేక ఏక పాత్ర కేళికలు చేసారు. వేదాంతం సత్యనారాయణ శర్మ వద్ద ఎన్నో స్త్రీ పాత్రలు, వేదాంతం రాధేశ్యాం వద్ద సోలోస్, మహంకాళీ శ్రీరాములు వద్ద ఎంకా ఎన్నో ఉషా పాత్రలలో మెళుకువలను నేర్చుకున్నారు. ఆయన 1984లో కూచిపూడి బాలాత్రిపుర సుందరి ఆలయంలో సాంప్రదాయ బద్దంగా లీలావతి స్త్రీ పాత్రలో రంగప్రవేశం చేసి, తమ తొలి ప్రదర్శనలోనే అందరి మన్ననలందుకున్నారు. అదే యేడాది ప్రెసిడెంట్ స్కౌట్ క్యాంపులో పాత గోవాలో కూచిపూడి నాట్య ప్రదర్శన ఇచ్చారు. గురువు వెంపటి చినసత్యం మాస్టారు గారి ఆధ్వర్యములో 1994, 1998, 2000 సంవత్సరాలలో ఒక్క అమెరికాలోనే 180కు పైగా ప్రదర్శనలిచ్చారు. 1994 లో కెనడాలో, 2001 లో ఫ్రాన్స్ వంటి ఇతర దేశాలతో పాటు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా తన ప్రదర్శనలతో ప్రేక్షకులను రంజింప చేసారు.[2]

కళా సేవలు[మార్చు]

ఆయన యక్షగాన రూపకాలయిన భామాకలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుని పాత్రలు, ఉషాపరిణయంలో ఉషగా, చిత్రలేఖ, అనిరుద్ద, బాణాసురుడు, శివుడిగా, భక్తప్రహ్లాదలో లీలావతి, హిరణ్యకశిపుడు, నరసింహ స్వామిగా, విప్రనారాయణలో మధురవాణిగా, శశిరేఖాపరిణయంలో అభిమన్యుడుగా, పార్వతీ కళ్యాణములో శివుడు, మన్మధుడిగా పాత్రలను పోషించతమే కాకుండా, నృత్యనాటకాలయిన శ్రీనివాస కళ్యాణం లో బ్రహ్మగా, హరవిలాసంలో మన్మధుడు, బ్రహ్మ, నారదుడిగా, క్షీరసాగర మధనంలో ఇంద్రుడు, శివుడిగా, కిరాతార్జునీయంలో శివుడిగా, అర్ధనారీశ్వరంలో శివుడు, బ్రహ్మగా, శాకుంతలంలో కన్వమహర్షిగా, గోపికాకృష్ణలో ఇంద్రుడు, అగ్నిగా, రామాయణంలో జనకరాజు, గౌతముడిగా, నర్తనశాలలో బ్రహ్మ, అర్జునుడిగా, యశోదా కృష్ణలో విష్ణువుగా, గజాననీయంలో శివుడిగా, రుక్మిణీకళ్యాణంలో శిశుపాలుడిగా, మహిషాసుర మర్ధినిలో మహిషాసురినిగా, శ్రీకృష్ణవిజయంలో విష్ణుమూర్తి వంటి పాత్రలకు తన ప్రతిభతో శ్రీనివాసులుగారు జీవం పోసారు. అలాగే శ్రీనివాసులుగారు ఎన్నో అష్టపదులు, పదములు, జావళీలు, కీర్తనలు, తరంగాలు, శబ్దములు, జతిస్వరములు తమ సోలో ప్రదర్శనలతో ప్రజలను మెప్పించారు.

సత్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Kuchipudi dancers enthral audience". STAFF REPORTER. The Hindu. 18 June 2016. Retrieved 11 November 2016.
  2. "బహుపాత్రల ప్రజ్ఞాశాలి........ యేలేశ్వరపు శ్రీనివాసులు గారు". Archived from the original on 2019-01-28. Retrieved 2016-11-12.
  3. కూచిపూడికి చెందిన నలుగురికి సంగీత నాటక అకాడమీ పురస్కారాలు[permanent dead link]
  4. "నాట్యోత్సవం". Archived from the original on 2017-08-25. Retrieved 2016-11-12.

ఇతర లింకులు[మార్చు]