రగడ (సినిమా)

వికీపీడియా నుండి
(రగడ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రగడ
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం వీరు పోట్ల
నిర్మాణం డి. శివప్రసాద్ రెడ్డి
కథ వీరు పోట్ల
చిత్రానువాదం వీరు పోట్ల
తారాగణం అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రియామణి, ప్రదీప్ సింగ్ రావత్, కోట శ్రీనివాసరావు, దేవ్ గిల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, మాస్టర్ భరత్, రఘుబాబు, బెనర్జీ, సత్య ప్రకాష్, సుప్రీత్, తనికెళ్ళ భరణి, వీరు పోట్ల
సంగీతం ఎస్.ఎస్. తమన్
సంభాషణలు వీరు పోట్ల
ఛాయాగ్రహణం సర్వేష్ మురారి
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ కామాక్షి మూవీస్
విడుదల తేదీ 24 డిసెంబర్ 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రగడ వీరు పోట్ల దర్శకత్వం వహించిన 2010 నాటి తెలుగు సినిమా. కామాక్షి స్టూడియో పతాకంపై డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఇందులో నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు, ఎస్. తమన్ సంగీతం సమకూర్చాడు.[1][2] ఈ చిత్రం సత్య అనే గ్రామ రౌడీ చుట్టూ తిరుగుతుంది, అతను డబ్బు సంపాదించడానికి నగరానికి వచ్చి, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోరాటంలో ఇష్టపూర్వకంగా పాల్గొంటాడు,

రగడ 2010 డిసెంబరు 24న థియేటర్లలో విడుదలైంది. 2011లో, దీనినిగా తమిళ వంబుగా అనువదించారు.[3] హిందీ లోకి కూడా అదే సంవత్సరం అనువదించారు. ఆదిత్య సంగీతం విడుదల చేసింది.

పెద్దన్న (ప్రదీప్ రావత్) కు వ్యతిరేకంగా ఉన్న అమాయక వ్యక్తిని చంపడానికి దేవుడు ( తనికెళ్ళ భరణి ) ప్రయత్నించడంతో సినిమా మొదలవుతుంది. పెద్దన్న అనుచరులలో ఒకరైన జైరాం దేవుడును చంపేస్తాడు. పెద్దన్న ఆంధ్రలో పెద్ద గూండా. అతనికి ముగ్గురు ప్రధాన అనుచరులు ఉన్నారు. ఈ అనుచరులు జైరామ్, భగవాన్ ( సుప్రీత్ ), నందా ( సుశాంత్ సింగ్ ). తదుపరి సన్నివేశంలో సత్యా రెడ్డి ( అక్కినేని నాగార్జున ) ను పరిచయమౌతాడు. ట్రక్కు దిగి, జికె ( దేవ్ గిల్ ), పెద్దన్నల మధ్య జరుగుతున్న పోరాటంలో కల్పించుకుంటాడు. సత్య జికెకు సాయం చేస్తాడు. అతడు సత్యను తన భాగస్వామిగా చేసుకుంటాడు. సత్య డబ్బు కోసం మాత్రమే పనిచేస్తాడు. జికె ప్రేమించే శిరీష ( అనుష్క శెట్టి ) సత్యతో ప్రేమలో పడుతుంది. అష్టలక్ష్మి ( ప్రియమణి ) ని రౌడీలు వెంబడించడాన్ని సత్య చూస్తాడు. సత్య ఆమెను రక్షిస్తాడు. అష్టలక్ష్మి, ఆమె బ్రాహ్మణ కుటుంబం సత్యతో కొన్ని రోజుల పాటు జీవించడం ప్రారంభిస్తుంది.

పెద్దన్నతో పోరాడటానికి సత్య జికెకు మంచి ప్లాను చెబుతాడు. ఒక పోరాటంలో, జైరామ్ శిరీషను బంధిస్తాడు. జైరామ్ను చంపి సత్య ఆమెను కాపాడుతాడు. అష్టలక్ష్మి కూడా సత్యను ప్రేమిస్తుంది. పచ్చబొట్టు ఉన్న ఓ స్నేహితుడిని శిరీష పబ్ లో కలుస్తుంది. ఇది సత్య గమనిస్తాడు. శిరీష, అష్టలక్ష్మిలతో కలిసి ఒక రెస్టారెంట్‌లో భోంచేస్తూండగా సత్యను భగవాన్ అనుచరులు దాడి చేస్తారు. సత్య, భగవాన్ ఇంటికి వెళ్లి అతనినీ అతని కొడుకునూ చంపుతాడు. దీంతో పెద్దన్న అతడికి శత్రువు అవుతాడు.

ఇక్కడి నుండి చిత్రం సత్య యొక్క ఫ్లాష్‌బ్యాక్కు లోకి దూకుతుంది. అక్కడ అతను అనాథ. మదర్ థెరిసా లాంటి ప్రేమగల వైద్యురాలు అతన్ని సాకుతుంది. ఈ కడప నగర ప్రజలు ఆమెను దేవతలా ఆరాధిస్తారు. రాజకీయ ప్రచారకుడు, పెద్దన్న సోదరుడు దేవేంద్ర (సత్య ప్రకాష్) డాక్టర్ కుమార్తెను కిడ్నాప్ చేసి, తనకే ఓటు వేయమని ఆమె ప్రచారం చెయ్యాలని డిమాండు చేస్తాడు. కానీ ఆమె అలా చేయదు. సత్య వెళ్ళి దేవేంద్ర మనుషులను కొడతాడు. దేవేంద్ర తండ్రి ఆసుపత్రి స్థలాన్ని విరాళంగా ఇచ్చినందున, డాక్టర్ ఆ ఆసుపత్రిని కొనసాగించాలంటే అతను 72 కోట్లు కట్టవలసి ఉందని తరువాత తెలుస్తుంది. సత్య తన సోదరుడిని కొట్టడంతో పెద్దన్న తన ముగ్గురు గూండాలతో వైద్యురాలిని చంపిస్తాడు. డబ్బు సంపాదించడానికి, వైద్యుడిని చంపిన గూండాలపై ప్రతీకారం తీర్చుకోవడానికీ సత్య జికెతో కలుస్తాడు.

ఈ సమయంలో, సత్య తన ఇంటికి తిరిగి వచ్చి, దుఃఖంలో ఉన్న అష్టలక్ష్మి తల్లిదండ్రులను ఓదారుస్తాడు. పెద్దన్న మనుష్యులు చాలా కాలం క్రితం అష్టలక్ష్మి అన్నయ్యను కిడ్నాప్ చేసినట్లు అతను తెలుసుకుంటాడు. సత్య అష్టలక్ష్మి సోదరుడు ఉన్న ప్రధాన కార్యాలయానికి వెళ్లి అతన్ని విడిపిస్తాడు. అప్పుడు, అష్టలక్ష్మి ఆమె ఆమె చెప్పుకుంటున్న వ్యక్తి కాదనీవాస్తవానికి తన సోదరుడి సహాయంతో పెద్దన్న నుండి 180 కోట్లు దోచుకుందనీ తెలుసుకుంటాడు.

అష్టలక్ష్మి, ఆమె సోదరుడు బ్యాంకాక్‌కు పారిపోతారు. సత్య శిరీషను తీసుకుని బ్యాంకాక్ వెళ్తాడు. అష్టలక్ష్మికి డబ్బు లేదని, శిరీష, అష్టలక్ష్మి స్నేహితులని, పబ్ లోని పచ్చబొట్టు అమ్మాయి అష్టలక్ష్మి అని తెలుస్తుంది. వారి ప్రణాళిక గురించి తనకు మొదటి నుంచీ తెలుసునని, తన వద్ద 180 కోట్లు ఉన్నాయనీ సత్య వారికి వెల్లడించాడు. అష్టలక్ష్మి సోదరుడు తన వాటా డబ్బును పొందడానికి నందను అనుసరిస్తాడని సత్యకు తెలుసు కాబట్టి సత్య వాస్తవానికి నందను చంపడానికే ఇక్కడకు వచ్చాడు. సత్య నందను చంపి భారతదేశానికి తిరిగి వస్తాడు. పెద్దన్న సత్య చెల్లెలిని కిడ్నాప్ చేసి చంపి, పాతిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. సత్య పెద్దన్నను చంపి, ఆసుపత్రిని రక్షించి, ప్రతీకారం తీర్చుకుంటాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

పాటలను ఎస్.తమన్ స్వరపరిచాడు. ఆదిత్య సంగీతం వారు విడుదల చేశారు. హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికాలో అభిమానుల మధ్య 2010 నవంబరు 29 న ఆడియోను విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్,, సుశాంత్ సహా అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కినేని ఆడియో సిడిని ఆవిష్కరించి మొదటి భాగాన్ని నాగార్జునకు అందజేశారు.[4]

All tracks are written by రామజోగయ్య శాస్త్రి.

పాటల జాబితా
సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."మీసమున్న మన్మథుడా"శంకర్ మహదేవన్, రీటా త్యాగరాజన్, హిమబిందు4:46
2."శిరీషా శిరీషా"హరిహరన్, శ్రీవర్ధిని తమన్4:07
3."ఒక్కడంటే ఒక్కడే"రమ్య, సుచిత్ర3:20
4."భోలో అష్టలక్ష్మీ"కార్తిక్, గీతా మాధురి4:14
5."రగడ రగడ"బాబా సెహగల్, కె.ఎస్.చిత్ర, రీటా త్యాగరాజన్4:44
6."ఏంపిల్లో యాపిలో"కార్తిక్, అనూరాధ శ్రీరామ్3:53
మొత్తం నిడివి:25:21

మూలాలు

[మార్చు]
  1. "Ready for Priyamani's actioner?". Rediff.com.
  2. "Ragada release date confirmed". Sify.com. Archived from the original on 2010-12-24. Retrieved 2020-08-08.
  3. "Ragada releasing as 'Vambu' in Tamil". Indiaglitz.
  4. "'Ragada' audio launched amidst fanfare - Telugu Movie News". Indiaglitz.com. 2010-11-30. Archived from the original on 2010-12-01. Retrieved 2013-08-12.