Jump to content

ప్రదీప్ రావత్

వికీపీడియా నుండి
(ప్రదీప్ సింగ్ రావత్ నుండి దారిమార్పు చెందింది)
ప్రదీప్ రావత్
జననం
ప్రదీప్ రావత్

1952 [1]
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, బ్యాంకు అధికారి

ప్రదీప్ రావత్ ఒక భారతీయ నటుడు. తెలుగు చిత్రాలలో ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. లగాన్ సినిమాలో దేవా అనే ఒక సర్దార్ పాత్ర పోషించాడు. ఈ సినిమాను చూసిన రాజమౌళి సై సినిమాలో విలన్ గా అవకాశం ఇచ్చాడు.[2]

నేపథ్యము

[మార్చు]

ఇతడు 1952లో న్యూఢిల్లీలో పుట్టాడు. ఇతడి నాన్నగారి పేరు మంగల్‌సింగ్‌ రావత్‌. రిటైర్డ్‌ మేజర్‌. ఇతడి పూర్తి పేరు ప్రదీప్‌ రామ్‌సింగ్‌ రావత్‌. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం సిమ్లాలోని మిలటరీ పాఠశాలలో ఇతడు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ జబల్‌పూర్‌ ప్రభుత్వ సైన్స్‌ కాలేజీలో చేశాడు.[1]

నటన అవకాశాలు

[మార్చు]

జబల్పూరులోని యూకోబ్యాంకులో కొద్ది కాలం ఉద్యోగిగా పనిచేసిన ఆయన దూరదర్శన్‌ ఢిల్లీ ఛానల్‌ నుండి దాదాపు రెండేళ్ళు ప్రసారమైన 'మహాభారత్' మెగా సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో నటించాడు. ఇదే ఇతడి మొదటి సీరియల్‌. ఇతడి నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సీరియల్‌లోకి ఇతడిని తీసుకోమని దర్శకుడు రవిచోప్రాకు ప్రముఖ హిందీనటీమణి స్మితాపాటిల్‌ సిఫార్సు చేయడం అతిముఖ్యమైన విశేషం. దేశంలోని కోట్లాదిమంది ప్రేక్షకులు ఈ సీరియల్‌ చూశారు. బి.బి.సి ఛానల్‌ కూడా దీన్ని ప్రసారం చేసింది. అలా బి.బి.సిలో రావడం అదే మొదటిసారి.

ఈ సీరియల్‌ ఒకవైపు ప్రసారం అవుతున్న సమయంలోనే ఎన్నో స్టేజీ నాటకాల్లో నటించేవాడు. ముంబయి, కోల్‌కత, చెన్నై, ఢిల్లీ నగరాల్లోని పలు ఆడిటోరియమలలో ఎన్నో నాటకాల్లో అనేక పాత్రలు పోషించాడు. ప్రముఖ హిందీ నటుడు రాజ్‌బబ్బర్‌ నాటక సంస్థ ద్వారా ఎన్నో నాటకాల్లో పాల్గొన్నాడు. ఇతడితోపాటు రాజ్‌బబ్బర్‌, అనుపమ్‌ఖేర్‌, ఆయన సతీమణి ఠాకూర్‌కిరణ్‌ ‍, అనితాకవార్‌, అలోక్‌నాథ్‌ నటించేవారు. వారందరితో కలిసి అనే నాటకాల్లో స్టేజీ పంచుకున్నాడు.

బాలీవుడ్ లో అవకాశాలు

[మార్చు]

బాలీవుడ్‌లో ఇతడికి ఎవ్వరూ పరిచయస్థులు లేరు. కానీ ఇతది పర్సనాలిటీ చూసి ఇతడి స్నేహితులు, శ్రేయోభిలాషులు మాత్రం, 'నువ్వు సినిమాల్లో చేరితే బాగా రాణిస్తావు అంటూ ప్రోత్సహించేవారు. మోడలింగ్‌ కూడా చేసేవాడు. ఆ సమయంలో బాలీవుడ్‌లో ఇతడికి ఎలాంటి గైడెన్స్‌గానీ, సపోర్ట్‌గానీ లేదు. స్వయంకృషి, పట్టుదలే ఇతడిని ఇంతవాణ్ణి చేసింది.

తొలి హిందీ చిత్రం

[మార్చు]

హిందీలో ఇతడి మొదటి చిత్రం బాఘి (BAAGHI). కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ 'బాఘి ' ద్వారా ఇతడికి గుర్తింపు వచ్చింది. ఇందులో సల్మాన్‌ఖాన్‌, నగ్మా హీరోహీరోయిన్లు. శక్తీకపూర్‌, కిరణ్‌కుమార్‌, ఆశాసచ్‌దేవ్‌, బీనాబెనర్జీ తదితరులు నటించారు. 1990లో ఈ చిత్రం సూపర్‌హిట్‌ కావడంతో ఇతడి దశ తిరిగి ఇతడి సినీనట జీవితం యూ టర్న్‌ తీసుకోకుండా పురోగమించింది. ఎన్నో చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. దర్శకులకు కాల్‌షీట్లు ఇవ్వలేని నిస్సహాయస్థితిలో పడిన రోజులు కూడా ఉన్నాయి. ఎంతోమంది దర్శకుల పరిచయ భాగ్యం కలిగింది. ఇతడి సినీ జీవితంలో అదో కొత్తదశ.

ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలు

[మార్చు]

పలువురు ప్రముఖ హిందీ దర్శకుల చిత్రాల్లో నటించాడు. అపరాధి, ఇన్‌సానియత్‌, దుష్మని, రాజ్‌కుమార్‌, కోయల, అమితాబ్ హీరోగా నటించిన 'దీవార్‌' , షరాబి, లగాన్‌, గజని చిత్రాలు ఇతడి హిందీ చిత్రజీవితంలో మైలురాళ్ళుగా నిలిచిపోతాయి. ముఖ్యంగా సల్మాన్‌ఖాన్‌ గజని చిత్రం ఇతడికి ఇంకా ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆహ్వానం లభించింది. కోయల చిత్రంలో పోలీస్‌ కమీషనర్‌ పాత్రకు ఇంకా మంచిపేరు వచ్చింది.

తెలుగు చిత్రసీమలో అవకాశాలు

[మార్చు]

దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి లగాన్‌ చిత్రం చూసి ఇతడి నటన మెచ్చుకుంటూ తన మేనేజర్‌ను ముంబయిలోని అమీర్‌ఖాన్‌ ఆఫీసుకు పంపించారు. అక్కడ ఇతడి చిరునామా తెలుసుకుని ఆ మేనేజర్‌ వీరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాడు. ఇతడిని హైదరాబాద్‌ రమ్మని చెప్పారు. ఇతడు వెళ్లి ఆయన కలవడం, ఆయిన ఇచ్చిన ఆఫర్‌కు సై అనడం జరిగాయి. తెలుగులో ఇతడు నటించిన మొదటి చిత్రం సై. సూపర్‌హిట్‌ చిత్రం. ఇక అప్పటినుండి తెలుగులో మంచిపాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది. ఎందరో దర్శకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు. కానీ హిందీ చిత్రాల్లో అగ్రిమెంట్ల కారణంగా తెలుగులో ఎక్కువ కాల్షీట్లు ఇవ్వలేకపోయాడు.

రాజమౌళి మరో చిత్రం ఛత్రపతి లో కూడా ప్రతినాయకుడిగా ఇతడి నటన అద్భుతం అని ఎంతోమంది అభిమానులు ఇతడి పైన అభినందనల వర్షం కురిపించారు. సై చిత్రాన్ని హిందీలో ‘ఆర్‌–పార్‌’ పేరుతో 2004లో నిర్మించారు. దీనినే ‘ఛాలెంజ్‌’ గా మలయాళంలోకి డబ్బింగ్‌ చేశారు. ఛత్రపతి చిత్రాన్ని తమిళంలో అదే పేరుతోనూ, మలయాళంలో ‘చంద్రమౌళి’గా హిందీలో హుకూమత్‌కి జంగ్‌ గా డబ్‌ చేశారు. కన్నడంలో మాత్రం ‘ఛత్రపతి’ పేరుతోనే రీమేక్‌ చేశారు.

తెలుగులో ఇతడు నటించిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్‌, నాయక్‌, రగడ, బలదూర్ ఇతడి టాలీవుడ్‌ కెరీర్‌లో మరువలేని చిత్రాలు. ప్రేక్షకులు ఈ చిత్రాలన్నీ ఆదరించారు. ఉత్తమ విలన్‌గా 'సై' చిత్రానికి ఫిలిమ్‌ఫేర్‌ అవార్డు, ఉమ్మడి ప్రభుత్వ నంది అవార్డు సహా ఎన్నో వందల అవార్డులు అందుకున్నాడు. ఒక ఇంగ్లీషు చిత్రంలో కూడా నటించాను.

మరపురాని సంఘటనలు

[మార్చు]
  • ఇతడు , వినోద్‌ఖన్నా నటించిన హిందీ చిత్రం 'మహాసంగ్రామ్‌ '. పోరాట చిత్రీకరణ ఒక ఓడలో చేశారు. వినోద్‌ఖన్నా ఇతడిని కొట్టుకుంటూ వచ్చే సన్నివేశంలో ఓడ చివరకు రాగానే ఇతడు తప్పించుకోవాలి. కానీ ఇతడు ఓడ పైనుండి సముద్రంలో పడిపోయాడు. ఇతడికి బాగా ఈత వచ్చుగానీ, స్విమ్మింగ్‌పూల్‌లో కొట్టే ఈతవేరు. నదిలో ఈత వేరు. ఇవన్నీ సముద్రంలో అస్సలు పనిచేయవు. అలలు ఎగసిపడుతూ ఉంటాయి. కెరటాలు విసిరికొడతాయి. దురదృష్టం కొద్దీ సముద్రంలో పడి సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఓడ గుండ్రంగా తిరుగుతూ ఉండటం ఇవన్నీ క్షణాల్లో జరిగాపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఓడ కింద ఉన్న ఇంజను ఇతడికి తగిలేదేగానీ, అక్కడ ఒక ఇనుప కమ్మీ ఆసరాగా దొరికింది. ఆ కమ్మీ గట్టిగా పట్టుకుని కేకలు పెడుతూ అక్కడే ఉన్నాడు. ఓడ పైకి ఇతడిని లాగడం సాధ్యంకాదు. చాలా పెద్ద ఓడ. జాలర్లు ఇతడి అరుపులు విని ఇతడి దగ్గరకు వచ్చారు. వెంటనే ఓడ పై నుండి సేఫ్టీ ఫ్లోటింగ్‌ ట్యూబ్స్‌, తాళ్ళు జాలరులకు ఓడ పైనుంచి అందించారు. వాళ్ళు ఆ తాళ్ళు ఇతడి దగ్గరకు విసిరి సేఫ్టీ ట్యూబ్ కూడా అందించారు. వెంటనే ఆ ట్యూబ్‌లోకి దూరి తాడు పట్టుకున్నాడు. జాలరులు ఎలాగో ఇతడిని లాగి ప్రాణాలు రక్షించారు. నిజంగా ఇతడికి అదొక మరపురాని సంఘటన.[1]

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర వివరములు
2023 జనతాబార్ త్రిపాఠి
2023 ఏజెంట్ నరసింహ 117
2022 దహనం వెబ్ సిరీస్
2019 పండుగాడి ఫొటో స్టూడియో
2019 మిస్ మ్యాచ్
2018 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పిసి
2017 ఆకతాయి
2017 ఏంజెల్
2015 సౌఖ్యం [3]
2013 1 (సినిమా)
2013 వాల్ పోస్టర్
2013 మహంకాళి
2013 సేవకుడు బలరామ్ జాదు
2013 నాయక్ మినిస్టర్ రావత్
2012 జీనియస్ ఎం. ఎల్. ఏ. నానాజీ
2012 ఢమరుకం
2012 అధినాయకుడు రామప్ప
2012 పూలరంగడు లాలాగౌడ్
2012 నిప్పు రాజాగౌడ్
2012 ఆల్ ది బెస్ట్
2011 దళపతి
2011 రాజన్న
2011 వీర పెదరాయుడు
2011 చట్టం
2011 మంగళ
2010 రగడ పెద్దన్న
2010 పంచాక్షరి రణదీప్ / బిల్లా భాయ్
2009 కాస్కో
2009 ఓయ్! రస్ బిహారీ
2009 మిత్రుడు
2009 మేస్త్రీ
2009 మస్కా షిండే
2008 రక్ష సనాతన్ బాబా
2008 ఆదివిష్ణు యాదగిరి
2008 బలాదూర్ ఉమాపతి
2008 హోమం పోసీస్ ఆఫీసర్ విశ్వనాధ్
2008 భలేదొంగలు వీర్రాజు
2008 నగరం
2008 వీధి రౌడీ
2007 మైసమ్మ ఐ.పి.ఎస్. ఖాన్ భయ్యా
2007 జగడం మాణిక్యం
2007 మహారధి
2007 యోగి (2007 సినిమా) నర్సింగ్ పహిల్వాన్ అతిధిపాత్ర
2007 దేశముదురు తంబిదురై
2006 స్టాలిన్ (సినిమా) ఎం. ఎల్. ఏ
2006 హనుమంతు కృష్ణమూర్తి
2006 మాయాజాలం
2006 లక్ష్మి (2006 సినిమా)
2005 ఛత్రపతి (సినిమా) రాస్ బిహారీ
2005 జగపతి ఎం. ఎల్. ఏ. గౌడ్
2005 అందరివాడు సత్తి బిహారీ
2005 భద్ర వీరయ్య
2004 సై భిక్షు యాదవ్ ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు పురస్కారము

కన్నడ

[మార్చు]
సంవత్సరం చిత్రం సాత్ర వివరములు బచ్చన్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 ప్రదీప్‌, రావత్‌. "బాలీవుడ్‌లో మోసాలు అందుకే దక్షిణాదిన నటిస్తున్నా: ప్రదీప్‌ రావత్‌". ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. Archived from the original on 2017-04-18. Retrieved 16 ఏప్రిల్ 2017.
  2. సాక్షి ఫన్ డే సెప్టెంబరు 4, 2016 పేజీ 16
  3. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.