రమేష్ సక్సేనా
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Ramesh Chand Saxena | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఢిల్లీ, బ్రిటిషు భారతదేశం | 1944 సెప్టెంబరు 20|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2011 ఆగస్టు 16 జంషెడ్‌పూర్, జార్ఖండ్ | (వయసు 66)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Legbreak | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 115) | 1967 జూన్ 8 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2022 నవంబరు 20 |
రమేష్ చంద్ సక్సేనా (1944 సెప్టెంబరు 20 - 2011 ఆగస్టు 16) [1] 1967లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన భారతీయ క్రికెటరు. అతను బీహార్ రంజీ జట్టులో గొప్ప బ్యాటరు. బీహార్, జార్ఖండ్‌లలో చాలా మంది క్రికెటర్లకు అతను మెంటర్‌గా ఉన్నాడు.
జీవితం, కెరీర్
[మార్చు]సక్సేనా 1960/61 సీజన్‌లో 16 ఏళ్ల వయస్సులో ఢిల్లీ వర్సెస్ సదరన్ పంజాబ్ తరఫున ఫస్ట్-క్లాస్ ప్రవేశం చేశాడు. అతని మొదటి ఫస్ట్-క్లాస్ ఇన్నింగ్స్‌లో అజేయంగా 113 పరుగులు చేశాడు. [2] 1965-66 వరకు ఢిల్లీ తరపున ఆడి, తర్వాత బీహార్‌కు మారాడు. 1966-67 నుండి 1981-82 వరకు అక్కడ ఆడాడు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ల తరపున కూడా ఆడాడు. [3] అతని అత్యధిక స్కోరు, 1969-70 లో అస్సాంపై బీహార్ తరఫున 202 నాటౌట్. [4] అతను భారతదేశంలో స్పిన్ బౌలింగ్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఖ్యాతి పొందాడు. [5]
సక్సేనా 1967లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరఫున తన తొలి మ్యాచ్ ఆడాడు. ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 550/4 వద్ద డిక్లేర్ చేసింది. జెఫ్రీ బాయ్‌కాట్ అజేయంగా 246 పరుగులు, సక్సేనా 2 ఓవర్లు వేసాడు. వికెట్లేమీ తీసుకోలేదు. తర్వాత అతను ఫరోఖ్ ఇంజనీర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చేశాడు. అయితే కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. భారత్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యి ఫాలో ఆన్ ఆడింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసి, 510 పరుగులకు ఆలౌటైంది, అయితే 7 వ స్థానంలో బ్యాటింగ్ చేసిన సక్సేనా 16 పరుగులు మాత్రమే చేసాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[6] అతను ఆ సంవత్సరం చివర్లో భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించాడు కానీ ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో దేనిలోనూ ఆడలేదు.[7]
అతను ఐదు సీజన్లలో బీహార్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో అనేక సార్లు ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.
1980 లలో అతను టెస్ట్ సెలెక్టర్‌గా పనిచేశాడు. [8] గుండెపోటుతో, పర్యవసానంగా వచ్చిన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Former India batsman Ramesh Saxena dies" Retrieved 15 September 2013.
- ↑ "Delhi v Southern Punjab 1960-61". Cricinfo. Retrieved 9 April 2019.
- ↑ "Ramesh Saxena". CricketArchive. Retrieved 9 April 2019.
- ↑ "Bihar v Assam 1969-70". CricketArchive. Retrieved 9 February 2020.
- ↑ Murzello, Clayton (21 September 2011). "Remembering Ramesh Saxena". mid-day.com. Retrieved 9 February 2020.[permanent dead link]
- ↑ "1st Test, India tour of England at Leeds, Jun 8-13 1967". Cricinfo. Retrieved 9 February 2020.
- ↑ T. L. Goodman, "India in Australasia, 1967-68", Wisden 1969, pp. 836–58.
- ↑ Wisden, 2012, p. 220.