Jump to content

రామ్‌నాథ్ కెన్నీ

వికీపీడియా నుండి
రామ్‌నాథ్ కెన్నీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రామ్‌నాథ్ బాబూరావ్ కెన్నీ
పుట్టిన తేదీ(1930-09-29)1930 సెప్టెంబరు 29
బొంబాయి, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1985 నవంబరు 21(1985-11-21) (వయసు 55)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి offbreak
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 87)1958 డిసెంబరు 31 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1960 జనవరి 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1950-51 to 1960-61Bombay
1961-62బెంగాల్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 5 59
చేసిన పరుగులు 245 3079
బ్యాటింగు సగటు 27.22 50.47
100లు/50లు 0/3 11/11
అత్యధిక స్కోరు 62 218
వేసిన బంతులు - 1041
వికెట్లు - 15
బౌలింగు సగటు - 31.19
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - 0
అత్యుత్తమ బౌలింగు - 4/8
క్యాచ్‌లు/స్టంపింగులు 1/- 26/-
మూలం: Cricinfo

రాంనాథ్ బాబూరావు కెన్నీ (1930 సెప్టెంబరు 29 - 1985 నవంబరు 21) 1958 - 1960 మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెటరు. [1] అతను ఒక సొగసైన రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, "పటిష్ఠమైన డిఫెన్స్‌తో కూడిన ఫ్రంట్ ఫుట్ ప్లేయర్" [2] అప్పుడప్పుడు ఆఫ్-బ్రేక్ బౌలింగు కూడా చేసేవాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

డేవిడ్ సాసూన్ & కో.లోని ఒక మిల్లు నిర్వాహకుని కుమారుడు, [3] కెన్నీ కింగ్ జార్జ్ హై స్కూల్, RN రుయా కాలేజ్, సిద్ధార్థ్ కాలేజీలో చదువుకుని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. [4] 1961లో ఇంగ్లండ్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు. [4] అతని జీవితంలో తరువాత, అతను బొంబాయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను, మహీంద్రా & మహీంద్రాలోనూ పనిచేశాడు. [3]

క్రికెట్ కెరీర్

[మార్చు]

కెన్నీ కామన్వెల్త్ XI కి వ్యతిరేకంగా బొంబాయి తరపున తొలి ఫస్ట్ క్లాస్ ఆడే ముందు, బాంబే యూనివర్శిటీ తరపున కొన్ని సీజన్లలో క్రికెట్ ఆడాడు. [5] ఒక నెల తర్వాత, అతను రంజీ ట్రోఫీలో తన మొదటి మ్యాచ్ ఆడుతూ, మహారాష్ట్రపై 52 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో కెరీర్‌లో అత్యధికంగా 217* పరుగులు చేసిన దత్తు ఫడ్కర్‌తో కలిసి 147 పరుగులు జోడించాడు. [6] ఈ సమయంలో అతను ఓవర్‌త్రోల సహాయం లేకుండా పరుగెత్తి ఆరు పరుగులు చేశాడు. కెన్నీ బంతిని ఎక్‌స్ట్రా కవర్‌లోకి కొట్టాడు. అక్కడ అది బౌండరీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఫీల్డర్, జాత్ రాజా, బంతిని తిరిగి వేసే లోపు, కెన్నీ, ఫడ్కర్లు ఆరు పరుగులు తీసారు. [7]

బాంబే టీమ్‌లో ఇంకా రెగ్యులర్‌గా లేనప్పటికీ, అతను టూరింగ్ జట్లకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల తరపున బాగా రాణించాడు, 1951-52లో ఇంగ్లండ్‌పై 86* పరుగులు చేశాడు. [8] 1952-53లో పాకిస్తాన్‌పై 99 చేసాడు. [9] 1953-54లో కామన్వెల్త్ XIకి వ్యతిరేకంగా బొంబాయి తరపున 143 పరుగులు చేసాడు. కేవలం 148 నిమిషాల్లోనే తన సెంచరీని చేరుకున్నాడు.[10] అతను రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. అతను వాటిలో 65, 33 & 11* పరుగులు చేశాడు. [11] భారత క్రికెట్ వార్షికం అతన్ని 1953–54 సంవత్సరానికి "క్రికెటర్స్ ఆఫ్ ఇయర్"గా ఎంపిక చేసింది.


అనేక సీజన్లలో ఒక మాదిరిగా ఆడిన తర్వాత కెన్నీ, 1956-57 రంజీ ట్రోఫీలో వికసించాడు. మహారాష్ట్రతో జరిగిన వెస్ట్ జోన్ ఫైనల్లో బాంబే, రెండో రోజు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 469 పరుగులు చేసి 298 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బాంబే కెప్టెన్ మాధవ్ మంత్రి మూడో రోజు పిచ్‌పై హెవీ రోలర్‌ను నడిపించాడు. లైఫ్‌తో, అనూహ్యమైన బౌన్స్‌తో ఉన్న ఈ పిచ్‌పై కెన్నీ 139 పరుగులు చేశాడు. ఐదుగురు బ్యాట్స్‌మెన్లు 50కి పైగా స్కోరు చేశారు. అయితే ఇండియన్ క్రికెట్ ఫీల్డ్ వార్షిక సంచిక కోసం రాసిన వ్యాసంలో డిక్కీ రుత్నాగుర్, కెన్నీ ఇన్నింగ్స్‌ను సాంకేతికంగా మ్యాచ్‌లో అత్యంత పర్ఫెక్ట్ ఇన్నింగ్స్‌గా పరిగణించాడు. [12]

క్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌తో బాంబే తలపడింది. జూట్ మ్యాటింగ్‌పై, సిఎస్ నాయుడు బాంబేను 5 వికెట్లకు 111కి తగ్గించాడు. కెన్నీ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ, 131 పరుగుల మ్యాచ్ విన్నింగ్ పార్ట్‌నర్‌షిప్‌లో భారత కెప్టెన్ పాలీ ఉమ్రిగర్‌ను అధిగమించాడు. నాయుడు బౌలింగ్‌పై ఆధిపత్యం చెలాయించాడు. "తనకు ఇషటం వచ్చిన చోటికి" బంతిని కొట్టాడు. 191 నిమిషాల్లో 16 ఫోర్లతో 132 పరుగులు చేశాడు. [13]

బాంబే జింఖానాలో జరిగిన సెమీఫైనల్‌లో కెన్నీ మద్రాస్‌పై కెరీర్‌లో అత్యుత్తమంగా 218 పరుగులు చేశాడు. స్పిన్నర్లకు సహకరించిన మరో వికెట్‌పై బాంబే ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. కెన్నీ, రుసీ మోడీతో కలిసి 289 పరుగులు, హోషాంగ్ అమ్రోలివాలాతో కలిసి 152 పరుగులు జోడించాడు. అతను స్పిన్నర్లను ఆత్మవిశ్వాసంతో ఆడాడు. "బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. ఫైన్ లెగ్ గ్లాన్స్ నుండి ఎక్స్‌ట్రా కవర్ డ్రైవ్‌ల వరకు, అతని బ్యాట్ నుండి స్ట్రోకులు ప్రవహించాయి". [14] ఇది వరుస ఇన్నింగ్సులలో మూడో సెంచరీ.

అతను సర్వీసెస్‌తో జరిగిన ఫైనల్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో అది అతని ఏకైక వైఫల్యం. రెండవ కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్న సురేంద్రనాథ్ వేసిన బంతిని కెన్నీ స్లిప్‌లోకి పంపాడు, అక్కడ కాబోయే ఎయిర్ మార్షల్ జ్ఞానేంద్రనాథ్ కుంజ్రూ క్యాచ్‌ను జారవిడిచాడు. కానీ సురేంద్రనాథ్ వేసిన తర్వాతి ఓవర్‌లో, కెన్నీ హుక్‌ చెయ్యబోయి షార్ట్ ఫైన్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. [15] కెన్నీ 1956-57 రంజీ మొత్తంలో 529 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. [16] కంగా లీగ్‌లో కష్టతరమైన వికెట్లపై బ్యాటింగ్ చేయడంలో అతను అప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. [17]

టెస్ట్ కెరీర్

[మార్చు]

బాంబే 1957-58లో రంజీ ట్రోఫీలో ప్రారంభంలోనే నిష్క్రమించింది. అయితే ఆ తర్వాత సీజన్‌లో కెన్నీ మహారాష్ట్రపై 142 పరుగులు చేశాడు. 4 గంటల్లో ఒక ఐదు, 19 ఫోర్లతో ఆ స్కోరు చేసాడు. జట్టు స్కోరు 320కి చేరుకుంది, అక్కడ మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా 35 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు [18] వెస్టిండీస్‌తో తర్వాతి వారం ప్రారంభమయ్యే మూడో టెస్టుకు అతను ఎంపికయ్యాడు. రెండో రోజు ఆలస్యంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, రెండు వికెట్లు కోల్పోయింది. బౌలర్లు వెస్ హాల్, రాయ్ గిల్‌క్రిస్ట్, సోనీ రామధిన్ నుండి సీనియర్ బ్యాట్స్‌మెన్ విజయ్ మంజ్రేకర్, పాలీ ఉమ్రిగర్‌లను రక్షించడానికి కెప్టెన్ గులాం అహ్మద్, కెన్నీ, ఘోర్పడేలను ముందుగానే బ్యాటింగుకు పంపాడు. [19] ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఆ రోజు బతికి బయటపడ్డారు. అయితే కెన్నీ మూడో రోజున 16 కు రెండో ఇన్నింగ్సులో 0 కూ హాల్‌కు పడిపోయాడు.[19] భారత్ ఇన్నింగ్స్, 336 పరుగుల తేడాతో ఓడిపోయింది, [20] ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌లో అదే అత్యంత ఘోర పరాజయం. అప్పుడు జట్టు నుండి తొలగించబడిన అనేక మంది ఆటగాళ్లలో కెన్నీ ఒకడు.

కెన్నీ, ఆ సిరీస్‌లోని మిగిలిన టెస్టుల్లో ఆడలేదు. 1959లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. కానీ భారతదేశం చాలా వేగంగా ఆటగాళ్లను, కెప్టెన్లనూ ఎంపిక చేస్తూ, తీసేస్తూ ఉన్న సమయంలో అతనికి తరువాతి అవకాశం [21] కొన్ని నెలల తర్వాత ఆస్ట్రేలియా భారతదేశాన్ని సందర్శించినప్పుడు వచ్చింది. 1959 మార్చిలో బెంగాల్‌తో జరిగిన రంజీ ఫైనల్‌లో కెన్నీ మరో వంద పరుగులు చేశాడు. అతను ఇప్పుడు మాధవ్ ఆప్టే ఆధ్వర్యంలో బాంబే జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆప్టే, కెన్నీ ఇద్దరూ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌లై, రెండో ఇన్నింగ్స్‌లో శతకాలు చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 243 పరుగులు జోడించారు. [22]

ఆస్ట్రేలియాతో కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో కెన్నీ తన భారత కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. జాసూ పటేల్ తొమ్మిది వికెట్లు పడగొట్టినప్పటికీ, స్పిన్‌కు సహకరించే వికెట్‌పై ఆస్ట్రేలియా 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. స్కోరు 153 వద్ద నం.7వ స్థానంలోకి వచ్చిన కెన్నీ, చందూ బోర్డేతో కలిసి 61 పరుగులు, బాపు నాదకర్ణితో కలిసి 72 పరుగులు జోడించాడు. భారత్ 291 పరుగులు చేసిన తర్వాత, పటేల్, పాలీ ఉమ్రిగర్ లు ఆస్ట్రేలియాను 105 పరుగులకు ఆలౌట్ చేసి సుప్రసిద్ధమైన విజయాన్ని సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో సున్నా తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కెన్నీ 51 పరుగులు చేశాడు. [23]

సిరీస్‌లో మరో రెండు అర్ధశతకాలు సాధించాడు. బ్రాబౌర్న్ స్టేడియంలో, చివరి రోజు అతను చేసిన 55* పరుగులు, అబ్బాస్ అలీ బేగ్‌తో కలిసి నెలకొల్పిన 109 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను కాపాడటానికి సహాయపడింది. [24] ఒక ప్రేక్షకురాలు మైదానంలోకి పరిగెత్తి బేగ్‌ని ముద్దుపెట్టుకున్నప్పుడు అతను మరో ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. [17] కెన్నీ తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో 62 పరుగులు చేశాడు. [25]

తర్వాత కెరీర్

[మార్చు]

కెన్నీ బాంబే తరఫున మరొక సీజన్ ఆడాడు. వరుస పరాజయాల తర్వాత, అతను జట్టు నుండి తొలగించబడ్డాడు. వాసూరావ్ పరాంజపే, "మ్యాచ్ ఉదయం బాంబే సెలెక్టర్లు అతనిని తొలగించినప్పుడు, సెలెక్టర్లు ఎంతలా అపరాధభావంతో ఉన్నారంటే, ఆ సంగతి అతనికి చెప్పడానికి ఎవరూ ఇష్టపడలేదు. అతని పట్ల నీచంగా వ్యవహరించారు. తక్కువ నాణ్యత కలిగిన ఆటగాళ్లు భారత్‌కు ఆడగా, రామ్‌కి మాత్రం కేవలం 5 టెస్టులే వచ్చాయి. అది అన్యాయం." అని అన్నాడు. [17] ఏడాది పాటు బెంగాల్ తరఫున ఆడాడు. 1961 డిసెంబరులో అస్సాంపై చేసినది అతని 11వ, చివరి ఫస్ట్ క్లాస్ శతకం. 1963లో రెండు అనధికారిక మ్యాచ్‌ల తర్వాత, కెన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుండి అదృశ్యమయ్యాడు. కానీ చాలా సంవత్సరాలు బాంబే లోకల్ క్రికెట్‌లో ఆడటం కొనసాగించాడు. అతను 1965లో టైమ్స్ షీల్డ్‌లో జూపిటర్ జనరల్ ఇన్సూరెన్స్‌పై మహీంద్రా తరపున 310 పరుగులు చేశాడు.[4]

తరువాతి జీవితంలో

[మార్చు]

కెన్నీ కంబర్‌ల్యాండ్ క్రికెట్ లీగ్‌లో పెన్రిత్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు, కోచ్‌గా పనిచేసాడు. [2] 1961లో హవేరిగ్ క్లబ్‌పై హ్యాట్రిక్ సాధించాడు. [4] కోచ్‌గా అర్హత సాధించిన తర్వాత, అతను బొంబాయిలో కోచ్‌ల కోసం BCCI క్యాంపులో దులీప్‌సిన్హ్జీకి సహాయం చేశాడు. [4] BCCI అతనికి 1977-78లో బెనిఫిట్ మ్యాచ్ జరిపింది. [26]

అతను 1985 లో గుండెపోటుతో తన కార్యాలయంలో మరణించాడు. [4]

మూలాలు

[మార్చు]
  1. "Ramnath Kenny". CricketArchive. Retrieved 5 March 2021.
  2. 2.0 2.1 Martin-Jenkins, Christopher, World Cricketers : A Biographical Dictionary (1996), p.442
  3. 3.0 3.1 Cashman, Richard, Patrons, Players and the Crowd, Orient Longman (1980), p. 181
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Obituary in Indian Cricket 1986, pp. 683-684
  5. Bombay v Commonwealth XI, 21–23 November 1950
  6. Bombay v Maharashtra, 22–25 December 1950
  7. Phadkar and Modi in irresistible form, Bombay Chronicle, 23 December 1950
  8. Indian Universities v MCC, 5–7 October 1951, Bombay
  9. Indian Universities v Pakistanis, 5–7 December 1952, Bangalore
  10. Kenny saved Bombay CA with fine 143, Indian Express, 30 November 1953, p.5
  11. Commonwealth XI in India, 1953-54, Scorecards
  12. Indian Cricket Field Annual 1957-58, p.103
  13. Indian Cricket Field Annual 1957-58, p.135
  14. Masterly 218 by Kenny, Indian Express, 18 March 1957, p.10
  15. Ranji final, Indian Express, 31 March 1957, p.6
  16. Ranji aggregates for the 1956-57 season, Cricketarchive (accessed 19 February 2022)
  17. 17.0 17.1 17.2 Kenny played the right way in the wrong era, Times of India, 22 August 2012
  18. Maharashtra v Bombay, 25–27 December 1958, Poona
  19. 19.0 19.1 Dicky Rutnagur, Indian Cricket Field Annual, 1959-60, p.109
  20. Indian v West Indies, 31 December 31, 1958 – 4 January 1959, Calcutta
  21. From the 1958-59 West Indies series till the second Test in England, India used 6 captains in 7 Test matches.
  22. Apte, Kenny hit hundreds, Indian Express, 11 March 1959, p.8
  23. India v Australia, 19–24 December 1959, Kanpur
  24. India v Australia, 1–6 January, Bombay
  25. India v Australia, 23–28 January, Calcutta
  26. Sportsweek, 27 August, 1977, p.35