రామ్‌లీల (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్‌లీల
రామ్‌లీల సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీపురం కళ్యాణ్
నిర్మాతరాసరి కిరణ్ కుమార్
తారాగణంహవీష్‌
అభిజిత్
నందిత
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
సంగీతంచిన్న
నిర్మాణ
సంస్థ
రామదూత క్రియేషన్స్
విడుదల తేదీs
27 ఫిబ్రవరి, 2015
దేశంభారతదేశం
భాషతెలుగు

రామ్‌లీల, 2015 ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు సినిమా. రామదూత క్రియేషన్స్ బ్యానరులో దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ సారథ్యంలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించాడు. ఇందులో హవీష్, అభిజిత్, నందిత ప్రధాన పాత్రల్లో నటించగా, చిన్న సంగీతం అందించాడు.[1] బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయం పొందింది.[2][3]

కథా సారాశం[మార్చు]

క్రిష్ (అభిజిత్) యుఎస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఒకరోజు టీవీలో సస్య (నందిత) ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. అభిజిత్ తిరిగి భారతదేశానికి వచ్చి సస్యను వివాహం చేసుకోవాలని ఏదో ఒకవిధంగా అమెను ఒప్పిస్తాడు. ఈ జంట హనీమూన్ కోసం మలేషియాకు వెళుతుంది. సస్య, క్రిష్ ను వదిలి తన మాజీ ప్రియుడిని కలవాలని నిర్ణయించుకున్నప్పుడు కథలో ట్విస్ట్ మొదలవుతుంది. అభిజిత్ తన భార్యను తిరిగి ఎలా తీసుకొస్తాడు, ఇందులో రామ్ (హవీష్) భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మిగతా కధ.[1]

నటవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

2014 నవంబరులో నిర్మాణాన్ని ప్రారంభించిన ఈ సినిమా డిసెంబరులో పూర్తయింది. మలేషియా, భారతదేశంలో 38 రోజులు చిత్రీకరించారు.[4]

పాటలు[మార్చు]

  1. మూజిక్ బిట్ (శివమణి, రాకేష్, మాళవిక)
  2. మనసులోని మాటలన్ని (దీపక్)
  3. భజన భజన (సింహ)
  4. నువ్వు లేని (దీపక్)
  5. ఏమైందో ఎగిరే (దీపక్, శరణ్య)

విడుదల, స్పందన[మార్చు]

ఈ పినిమా 2015, ఫిబ్రవరి 27న విడుదలైంది.[5] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[3]

స్పందన[మార్చు]

"ఈ సినిమా చూడడంకంటే అదే పేరుతో సంజయ్ లీలా భన్సాలీ తీసిన బ్లాక్ బస్టర్ ను మల్ళీ చూడండి" అని ది హిందూ పత్రికకు చెందిన సంగీత దేవి దుండూ వ్రాసింది.[1] "దర్శకుడు శ్రీపురం కిరణ్ వైవాహిక బంధం ముఖ్యమని నడిపించాడడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వ్రాసింది.[6] ప్రేమకథా చిత్రమ్, లవర్స్ వంటి సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్న నందిత ఈ సినిమాలో అంతగా ఆకట్టుకోలేకపోయింది" అని న్యూస్ 18 పత్రిక ఒక సమీక్షలో రాసింది.[7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Dundoo, Sangeetha Devi (27 February 2015). "Ram Leela: What were they thinking?". The Hindu – via www.thehindu.com.
  2. Hooli, Shekhar H. (2015-02-27). ""Ram Leela" (Ramleela) Movie Review Roundup: Havish-Abhijeeth-Nanditha Starrer Disappoints Critics". International Business Times, India Edition (in english). Retrieved 2021-05-23.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. 3.0 3.1 "I am still in the game: Actor Havish". The New Indian Express.
  4. "Interview with Havish - Telugu cinema actor". www.idlebrain.com.
  5. "Ram Leela to release on Feb 27 - Times of India". The Times of India.
  6. Rao, Ch Sushil (26 April 2016). "Ramleela Movie Review". Retrieved 2021-05-23.
  7. "'Ram Leela' review: This film will leave you wondering why on earth did you decide to go to see it in the first place". News18. Retrieved 2021-05-23.

బయటి లింకులు[మార్చు]