Jump to content

రావు కమలకుమారి

వికీపీడియా నుండి
రావు కమలకుమారి
జననం
మండా కమలకుమారి

(1944-04-21)1944 ఏప్రిల్ 21
మరణం2018 ఏప్రిల్ 7(2018-04-07) (వయసు 73)[1]
కొండాపూర్, హైదరాబాద్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు హరికథలు, సాహిత్యం
జీవిత భాగస్వామిరావు గోపాలరావు
పిల్లలురావు రమేష్, క్రాంతికుమార్, సీతాదేవి
తల్లిదండ్రులు
  • మండా సూర్యనారాయణ (తండ్రి)
  • రాజరాజేశ్వరి (తల్లి)

రావు కమలకుమారి (ఏప్రిల్ 21, 1944 - ఏప్రిల్ 7, 2018) హరికథ కళాకారిణి,[2] రంగస్థల, సినీనటులైన రావు గోపాలరావు సతీమణి.[3] ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో 5వేలకుపైగా హరికథలు చెప్పింది.

జననం

[మార్చు]

కమలకుమారి 1944, ఏప్రిల్ 21న మండా సూర్యనారాయణ, రాజరాజేశ్వరి దంపతులకు విజయనగరం లో జన్మించింది. సూర్యనారయణ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా భాగ్ రథీ పురం. కమలకుమారి తాత కలవరాయుని లక్ష్మీనారాయణ శాస్త్రీ విజయనగర సంస్థాన విద్వాంసులు.


కళారంగం

[మార్చు]

కమలకుమారి తండ్రి సూర్యనారాయణ శాస్త్రి విజయనగరం సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలోనూ, పూనాలోని హిందూస్థానీ సంగీతంలోనూ డిప్లొమాలు పొందిన విద్వాంసులు. వీణ, గాత్రం, భరతనాట్యం, హరికథా కళలను అభ్యసించిన కమలకుమారి ఎనమిదేళ్ళ వయసులో తండ్రి హరికథ మధ్యలో భరతనాట్యం చేసేది.

స్వరజతి, వర్ణం, తిల్లాన, స్వరం, శబ్ధం, సాహిత్యం అభ్యసించింది. తన పాటలు తానే పాడుకుంటూ జానపద నృత్యాలు చేసేది. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, అన్నవరం, యాదగిరిగుట్ట మొదలైన పుణ్యక్షేత్రాల్లో హరికథా గానం చేసింది.

వివాహం - పిల్లలు

[మార్చు]

వీరిది ప్రేమ వివాహం. ప్రముఖ రంగస్థల, సినీనటులైన రావు గోపాలరావు తో 1966, జనవరి 16న కమలకుమారి వివాహం జరిగింది. పురాణ కథలను, పౌరాణిక కళలలను ద్వేషించే రావు గోపాలరావు... కాకినాడ లో కమలకుమారి హరికథకు వచ్చి అల్లరిచేయాలనుకున్నారు. ఆరు గంటలపాటు హరికథ విని, ముగ్ధలై కమలకుమారితో ప్రేమలో పడ్డారు.[3] వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు రావు రమేష్ సినీనటుడు. రెండో కుమారుడు క్రాంతికుమార్ అమెరికాలో ఇంజనీర్, కుమార్తె సీతాదేవి.

బిరుదులు

[మార్చు]
  1. సకల కళా విశారద - ప్రవాసాంధ్ర కళాసమితి, టాటా నగరం, మద్రాస్
  2. నాట్యకుమారి, హరికథా శిరోమణి, కోకిల వాణి - కాకినాడ
  3. మధుర గాన సుహాసిని - కలకత్తా
  4. సకల జన రంజన హరికథా కళా ప్రపూర్ణ - ఖరగ్‌పూర్
  5. అభినవ సరస్వతి - బెంగళూరు
  6. శారదావతరిణి - విజయనగరం
  7. ఆదర్శ హరి కథా సుధామతి - గుంటూరు

మరణం

[మార్చు]

2018, ఏప్రిల్ 7న హైదరాబాద్ కొండాపూర్ లోని తన నివాసంలో మరణించారు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "నటుడు రావురమేష్‌కు మాతృ వియోగం". eenadu.net. ఈనాడు. 8 April 2018. Archived from the original on 8 April 2018. Retrieved 8 April 2018.
  2. ది హిందూ. "Benchmark in performance". Retrieved 24 April 2017.
  3. 3.0 3.1 రావు కమలకుమారి, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 200. ISBN 978-81-8351-2824. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "విశిష్ట తెలుగు మహిళలు" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. తెలుగు వి6 న్యూస్, సినిమా వార్తలు (7 April 2018). "రావు రమేష్ తల్లి కన్నుమూత". Archived from the original on 10 April 2018. Retrieved 7 April 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. నమస్తే తెలంగాణ (7 April 2018). "రావు ర‌మేష్‌కి మాతృ వియోగం". Retrieved 7 April 2018.[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]