రూపా రాణి టిర్కీ
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | భారతీయురాలు | |||||||||||||||||||||||||||||||||||||||||
జననం | రాంచీ, జార్ఖండ్, భారతదేశం | 1987 సెప్టెంబరు 27|||||||||||||||||||||||||||||||||||||||||
క్రీడ | ||||||||||||||||||||||||||||||||||||||||||
క్రీడ | లాన్‌బౌల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||
కోచ్ | మధుకాంత్ పాఠక్ | |||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
రూపా రాణి టిర్కీ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ మహిళా లాన్ బౌల్స్ క్రీడాకారిణి. ఆమె 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో లాన్‌బౌల్స్‌లో భారత మహిళల జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి, స్వర్ణ పతకం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది.[1][2]
క్రీడా జీవితం
[మార్చు]రూపా రాణి టిర్కీ 2009 నుండి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె ఆసియా పసిఫిక్ బౌల్స్ ఛాంపియన్‌షిప్‌లో మూడు కాంస్య పతకాలను గెలుచుకుంది, ఆమె ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి రెండు కాంస్యం & ఒక రజత పతకాన్ని గెలుచుకుంది. రూపా రాణి టిర్కీ ఆస్ట్రేలియాలో 2019లో క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ బౌల్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. రూపా రాణి టిర్కీ నాలుగు కామన్వెల్త్ గేమ్‌లలో (2010, 2014, 2018, 2022) పాల్గొని ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలిచిన జట్టులో లవ్లీ చౌబే, నయనమోని సైకియా & పింకీ సింగ్‌లతో ఉంది.
ఇవి కూడా చుడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (3 August 2022). "బంతులాటలో బంగారం". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
- ↑ Sakshi (3 August 2022). "ఊహించని ఫలితం.. 'ఆనందం నాలుగింతలు'". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.