రోజాభారతి
స్వరూపం
రోజాభారతి | |
---|---|
జననం | కొమరవోలు రోజా 1989 అక్టోబరు 6 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
బంధువులు | ఖిజర్ యాఫయ్ (భర్త) నిఖిల్ & ఆహిల్ (కుమారులు) |
రోజాభారతి తెలుగు సినిమా, టెలివిజన్ నటి.[1] మొగలిరేకులు, పక్కింటి అమ్మాయి వంటి సీరియళ్ళలో నటించిన రోజాభారతి, బటర్ ఫ్లైస్ సినిమాలో కథానాయికగా నటించింది.[2]
జననం
[మార్చు]రోజాభారతి 1989, అక్టోబర్ 6న రాజమండ్రిలో జన్మించింది. హైదరాబాదులో స్థిరపడింది.
టెలివిజన్
[మార్చు]చిన్నపట్టినుండి నటన అంటే ఆసక్తివున్న రోజా పాఠశాల, కళాశాల స్థాయిలో స్టేజి ప్రదర్శనలు ఇచ్చింది.[3] టెలివిజన్ రంగంలో నటిగా గుర్తింపు పొందిన రోజాభారతి సీరియళ్ళలో నటిస్తూనే జెమిని టీవిలో వివాహబంధం, బుల్లితెర మహారాణి, జీ తెలుగులో బిందాస్, ఈటీవిలో సఖి వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేసింది.[4]
నటించిన సీరియళ్ళు
[మార్చు]- మొగలిరేకులు (జెమినీ టీవీ)
- తీరం (జెమినీ టీవీ)
- గోరింటాకు (జెమినీ టీవీ)
- మావిచిగురు (జెమినీ టీవీ)
- కొత్త బంగారం (జెమినీ టీవీ)
- కలియుగ రామాయణం (జెమినీ టీవీ)
- కొంచెం ఇష్టం కొంచెం కష్టం (జీ తెలుగు)
- పక్కింటి అమ్మాయి (జీతెలుగు)
- మిస్సమ్మ (మాటీవి)
- సుందరాకాండ (మాటీవి)
- అంతఃపురం (ఈటీవి)
- అల్లరే అల్లరి (ఈటీవి)
సినిమారంగం
[మార్చు]2009లో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో నటించింది.
- ఏకె రావు పికె రావు (2014)
- గుండెజారి గల్లంతయ్యిందే
- కీచక
- కాయ్ రాజా కాయ్
- అధినాయకుడు
- మిస్టర్ పెళ్ళికొడుకు
- మా అన్నయ్య బంగారం
- అర్ధ శతాబ్దం
- ప్రవీణ్ ఐపీఎస్
అవార్డులు - పురస్కారాలు
[మార్చు]- ఉత్తమ విలన్ - బుల్లితెర అవార్డు 2017 (03.12.2017)
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రభూమి, హైదరాబాదు (26 December 2017). "'బటర్ ఫ్లయిస్' ఫస్ట్‌లుక్". Archived from the original on 17 ఫిబ్రవరి 2022. Retrieved 6 October 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (25 December 2017). "'బటర్ ఫ్లైస్' అంతా ఆడవాళ్లే." andhrajyothy.com. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.
- ↑ Nettv4u, Telugu TV Actress. "Telugu Tv Actress Roja Komaravolu". www.nettv4u. Archived from the original on 5 October 2018. Retrieved 13 August 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (16 April 2021). "జీవితం చాలా ఇచ్చింది!". Archived from the original on 17 April 2021. Retrieved 17 April 2021.