Jump to content

వంశీకృష్ణ శ్రీనివాస

వికీపీడియా నుండి
(వంశీకృష్ణ శ్రీనివాస్‌ నుండి దారిమార్పు చెందింది)
వంశీకృష్ణ శ్రీనివాస్‌

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 డిసెంబర్ 2021 - 2024 మార్చి 12
నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 5 ఫిబ్రవరి 1974
విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
జీవిత భాగస్వామి పద్మజ
సంతానం సాయిసందీప్, లహరిప్రవల్లిక

చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 1974 ఫిబ్రవరి 5లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన ఎంఏ వరకు చదువుకున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి, 2011లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తరువాత పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా నియమితుడై పార్టీ బలోపేతానికి కృషి చేశాడు.

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2019లో టికెట్ దక్కలేదు. ఆయన 2021లో మహా విశాఖ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచాడు. ఆయనను విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2021 నవంబరు 12న వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ప్రకటించింది. ఆయన 2021 నవంబరు 21న నామినేషన్ దాఖలు చేశాడు.[2]

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2021 నవంబరు 27న ఏకగ్రీవంగా ఎన్నికై[3], 2021 డిసెంబరు 8న శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4]

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2023 డిసెంబరు 27న వైసీపీకి రాజీనామా చేసి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరాడు.[5][6]

వంశీకృష్ణ శ్రీనివాస్‌ వైసిపి నుండి జనసేన పార్టీలోకి ఫిరాయించడంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైసిపి నేత, మండలిలో చీఫ్‌ విప్‌ మేరిగ మురళీధర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేయగా ఆయన నుండి వివరణ తీసుకొని, సమగ్ర విచారణ అనంతరం ఆయనపై అనర్హత వేటు వేసినట్లు 2024 మార్చి 12న శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Andhrajyothy (21 November 2021). "ఎమ్మెల్సీ పదవులకు వంశీకృష్ణ, కళ్యాణి నామినేషన్‌". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  3. Prajasakti (27 November 2021). "'స్థానిక' ఎమ్మెల్సీలుగా వంశీకృష్ణ, కల్యాణి ఏకగ్రీవం | Prajasakti". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
  4. Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  5. A. B. P. Desam (28 December 2023). "జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ - పవన్ సమక్షంలో చేరిక !". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  6. Andhrajyothy (28 December 2023). "జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ". Retrieved 28 December 2023.
  7. NT News (12 March 2024). "పార్టీ ఫిరాయింపు.. ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.