వర్ధమాన మహావీరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహావీరుడు

వర్ధమాన మహావీరుడు (ఆంగ్లం :Mahavira (హిందీ : महावीर, అర్థం : మహావీరుడు) (540 – 468 క్రీ.పూ.) జైనమత స్థాపకులలో ఒకడు. సంప్రదాయాలనుసారం ఇతను 24 మరియు ఆఖరి తీర్థంకరుడు. ( జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు ) జైనగ్రంధాలలో ఇతని పేర్లు వీర లేదా వీరప్రభు, ...సన్మతి, అతివీర మరియు జ్ఞానపుత్ర కానవస్తాయి. బౌద్ధుల పాలీ సూత్రాలలో ఇతని పేరు నిగంథ నాటపుత్ర. మహావీరుడుని జినుడు, నిర్గ్రంధుడు అని కూడా పిలుస్తారు.

జైన సాంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు... మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు లేక ఆదినాఠుడు (ఈ మత స్థాపకుడు)... 22 వ తీర్థంకరుడు నేమినాఠుడు ఈయన శ్రీకృష్ణునికి పినతండ్రి అని జైన సాంప్రదాయం చెబుతున్నది.......23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు.. ఈయన మహావీరునికి 200 సంవత్సరాలు ముందు జీవించాడు. ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. ఒక అంచనా ప్రకారం జైనం అత్యంత ప్రాచీనమైనది (5000 సం.లకు ముందేఉన్నట్టుగా).. దానికి ప్రస్తుత రూపం ఇచ్చినవారు వర్ధమాన మహావీరుడు.

జననం[మార్చు]

ఇతడు వైశాలీ నగరం సమీపంలో జన్మించాడు

జీవిత విశేషాలు[మార్చు]

మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరువాత ' మహావీరుడు ' అని పేరు పొందాడు. ఈయన భార్య పేరు యశోద. వీరికి ' ప్రియదర్శి ' అను పుత్రిక ఉంది. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలిని వివాహమాడింది. వర్థమానుడు తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్దిని పొందాడు. తదనంతరం... వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని పాగపురిలో నిర్యాణం పొందాడు.

బోధనలు[మార్చు]

వీరి ప్రకారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు. పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనేదానిని వర్ధమానుడు కలిపాడు. ఈ ఐదింటిని పంచవ్రతాలు అంటారు. వీటిని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం బోధిస్తుంది. బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించాడు. పవిత్రమైన జీవనం గడుపుతూ, తపస్సు చేస్తే ఎవరైనా కైవల్యం పొందవచ్చునని బోధించాడు.

ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశ స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీ గారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.

మహావీరుని జననం, కల్పసూత్ర, నుండి (1375-1400).

పాదపీఠికలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]