వల్లూరు (ఆచంట)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వల్లూరు (ఆచంట)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఆచంట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,962
 - పురుషుల సంఖ్య 4,483
 - స్త్రీల సంఖ్య 4,479
 - గృహాల సంఖ్య 2,637
పిన్ కోడ్ 534 269
ఎస్.టి.డి కోడ్

వల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 534 269. ఈ ఊరు కరుగోరుమిల్లి, కందరవల్లి,ఆచంట వేమవరం, అబ్బిరాజుపాలెం, భీమలాపురం, వద్దిపర్రు, కంచుస్తంబంపాలెమ్, గుంపర్రు మొదలగు 10 ఊళ్ళకు ప్రధాన కేంద్రం. ఈ గ్రామమున అన్ని సదుపాయములు అనగా ఆసుపత్రులు, పసువుల ఆసుపత్రి,సినిమా హాల్సు,రైసుమిల్లులు,సంతలతో ముఖ్య కూడలిగా ఉంది.

గ్రామవివరాలు,అభివృద్ధి[మార్చు]

వల్లూరు తన చుట్టూ 14 పాలెములు (హేమ్లెట్స్), 2800 ఎకరముల ఆయకట్టు, 12000 జనాభా కలిగిన పెద్ద గ్రామ పంచాయతి. ఈ గ్రామవాసి అయిన వల్లూరి నరసింహముర్తి 1940 నుండి గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరముగా పాటుపడిరి. వీరి హయాములో గ్రామములో అన్ని పాలెములను కలుపుతు రోడ్లు, ఊరికి సంబంధించిన జిల్లా పరిషత్ రహదారులు తారు రోడ్లు గాను, గ్రామానికి పూర్తిగా కరెంటు సదుపాయము, సహకార సంఘము, హై స్కూలు, ఎలిమెంటరి పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పసువుల ఆసుపత్రి, బ్రిడ్జిలు మొదలైన సదుపాయములు ఎన్నియొ కలెగెను.

వల్లూరు గ్రామంన నాలుగు రోడ్ల కూడలి కలదు ఒక వైపు 1) (తూర్పు)గా ఉన్న రోడ్డు గోదావరి లంక గ్రామాలకు పోవు మార్గము. పడమరగా ఉన్న రోడ్డు 2). పాలకొల్లు, నరసాపురం, భీమవరం తదితర పట్టణాలకు పోవు బస్సు మార్గము,3). ఉత్తరం వైపుగా రాజమండ్రి,సిద్దాంతం,ఆచంట,కొడమంచిలి,పెనుమంచిలి తదితర గ్రామాలకు పోవు రోడ్డు మార్గము, 4). దక్షిణము వైపు పోవుమార్గము పాలకొల్లు,దొడ్డిపట్ల,గుంపర్రు,ఇలపకుర్రు తదితర గ్రామాలకు పోవును. గ్రామంలో ఒక హై స్కూలు,బస్టాండు,పశువుల ఆసుపత్రి,ఒక శివాలయము,గవర్నమెంట్ హాస్పటల్,పెద్ద మార్కెట్ (ప్రతి మంగళవారము ఇచట సంత (మార్కెట్)జరుగును)పెద్ద చెరువు ఉన్నాయి. గ్రామ చుట్టు ప్రక్కల దాదాపు అందరూ ఎక్కువ శాతం మంది వల్లూరు గ్రామ మార్కెట్ లో నే వారికి అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకుంటారు.

వ్యవసాయ విశేషాలు[మార్చు]

ప్రధాన వ్యవసాయపంటలు వరి, చెరకు, కొబ్బరి. ఇక్కడ లెక్కకు మిక్కిలిగా చెరకును బెల్లముగా మార్చు బట్టీలు ఉన్నాయి. తీరప్రాంత గ్రామం కనుక కూరగాయల, పూల తోటలు కూడా కనిపిస్తాయి.

సౌకర్యాలు[మార్చు]

విద్య

ఒక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, పది బోర్డు పాఠశాలలు ఉన్నాయి.

రవాణా
నీటి వనరులు

ఊరిలో మంచినీటి చెరువులు మూడు, ఊర చెరువు ఒకటి ఉన్నాయి. రెండు కాలువలు గ్రామము ప్రక్కగా ప్రవహించుచున్నవి.

దేవాలయములు[మార్చు]

ఈ గ్రామములో సుమారు వెయ్యి సంవత్సరముల క్రితము తూర్పు చాళిక్యుల కాలములో నిర్మించిన అతి సుందరమైన శివాలయము ఉంది. రెండు అడుగుల ఎత్తు గల తెల్లని శివలింగము, పెద్ద నంది ఉన్నాయి. ఈ పుష్పేశ్వర స్వామి వారి ఆలయము మరియు ఆ కాలమునందే నిర్మించిన మదనగోపాలస్వామి వారి ఆలయమును ఏబది సంవత్సరముల క్రితము వలూరి నరసింహమూర్తి గారిచే పునరుద్ధరింపబడినవి. ఇక్కడ సీతలాంబిక మరియు వనుమలమ్మ అను గ్రామదేవతల గుడులు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసములో ఉత్సవములు జరుగును.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ వి.కె.రావు గారు (ICS)ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతము హైదరాబాదులో నివసించుచున్నారు.

గ్రామ సమస్యలు[మార్చు]

గ్రామమునందు మరియు చుట్టు ప్రక్కల గ్రామములందు 10 వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఇంటరు మీడీయట్ చదువుటకు కావలసిన కాలేజి, ఐ టి ఐ చదువుటకు కావలసిన సంస్థ లేకపోవడము ముఖ్య సమస్యలు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,962 - పురుషుల సంఖ్య 4,483 - స్త్రీల సంఖ్య 4,479 - గృహాల సంఖ్య 2,637

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8959.[1] ఇందులో పురుషుల సంఖ్య 4511, మహిళల సంఖ్య 4448, గ్రామంలో నివాస గృహాలు 2154 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు