వాడుకరి:సుల్తాన్ ఖాదర్/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా ఇసుకతిన్నె కు స్వాగతము.

స్వాగతము[మార్చు]

సుల్తాన్ ఖాదర్/ప్రయోగశాల

ప్రేమకధ పాటలు[మార్చు]

గాయనీ గాయకులు : రాజేష్, అనురాధ శ్రీరామ్
సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

దేవుడు కరునిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన కడ దాక సాగనా ||దేవుడు||

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం
ఎవరేమి అనుకున్న ||దేవుడు||

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు
ఎటెల్లేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వూ నీ నవ్వూ నాతొ లేకుంటే
నేనంటూ ఉంటానా ||దేవుడు||


దేవుడు కరుణిస్తాడని
చిత్రం : ప్రేమకథ
గాయనీ గాయకులు : రాజేష్, అనురాధ శ్రీరామ్
సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

3 Wikipedia logos

...text after a nested table

...text after centered table



కళ్ళు చిదంబరం[మార్చు]

<ref name="ఆ 'కళ్లు' వెంటాడుతూనే ఉంటాయ్ ">{{cite web|url=http://www.eenadu.net/Homeinner.aspx?item=break240|title="ఆ 'కళ్లు' వెంటాడుతూనే ఉంటాయ్ " |publisher=[[ఈనాడు]] |date= 2015-10-23|accessdate=2015-10-23}}</ref> చింతనిప్పుల్లాంటి కళ్లు కావు.నేరేడు పళ్లులాంటి కళ్లు కానే కావు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కళ్లు అస్సలు కావు.కానీ అవి సమ్‌థింగ్ స్పెషల్.రెండు కళ్లకూ క్షణం కూడా పడదన్నట్టు.. గత జన్మలో అత్తా కోడళ్లయినట్టు ఓ కన్ను కాశ్మీరు, మరో కన్ను కన్యాకుమారి చూస్తుంటాయ్.కానీ మనం మాత్రం ఆ కళ్లనే చూస్తుంటాం. అదీ.. కళ్లు చిదంబరం స్పెషాలిటీ.ఆ కళ్లతోనే ఫేమస్ అయిపోయారు చిదంబరం.ఎన్నో సినిమాల్లో నవ్వులు పంచిన ఆ కళ్లు.. ఇప్పుడు (అక్టోబరు 19) మాయమైపోయాయి.శాశ్వతంగా రెప్పలు మూసుకొన్నాయ్. 'ఏటంటావు..' అంటూ ఆ కళ్లు మిటకరిస్తే చాలు.. నవ్వులు పూసేస్తాయి. నిజానికి కొన్నిసార్లు కళ్లు చిదంబరం ప్రత్యేకించి సంభాషణలేం చెప్పకపోయినా ఓ నవ్వు తొంగి చూస్తుంటుంది. కారణం ఆయన బాడీ లాంగ్వేజీ. ఉఫ్ఫుమంటే పడిపోయే శరీకం, చిగురుటాకు వణికినట్టు ఊగిపోతుంటే ఆ చేతులు, ఒక్క డైలాగుకే అష్టవంకర్లు తిరిగే ఆ బాడీ.. అన్నింటికంటే ఆ కళ్లు. సేమ్ టూ సేమ్ ఈ తరహా పాత్రలతోనే దాదాపు 300 సినిమాల్లో నటుడిగా రాణించేశారాయన. తొలి సినిమా 'కళ్లు' ఆయనకు తెలుగు తెరపై ఓ చోటు ఇచ్చింది. ఆ పేరునే ఇంటిపేరుగా మార్చుకొని.. స్థిరపడిపోయారాయన. వంశీ, ఈవీవీ సినిమాలంటే.. కళ్లుకో ప్లేసు గ్యారెంటీ. రాంగోపాల్ వర్మ కూడా కళ్లు చిందంబరం కోసం వెరైటీ క్యారెక్టర్లు రాశారు.

క్షణం క్షణం'లో ఈ కళ్లే శ్రీదేవిని భయపెట్టేస్తుంటాయి. ఆ సినిమాలో హోటల్‌లో పనిచేసే బోయ్ కళ్లు చిదంబరం. ఈ సినిమాలో కళ్లు బాడీలాంగ్వేజే డిఫరెంటుగా ఉంటుంది. ఎలాంటి హావభావాలూ లేకపోవడమే అతని బాడీలాంగ్వేజ్. కళ్లు: కాఫీ ఎన్ని గంటలకు పంపాలి శ్రీదేవి: ఆరూ.. ఆరున్నర కళ్లు: ఆరా.. ఆరున్నర...? డైలాగులు మామూలుగా ఉన్నా, కళ్లు చిదంబరం నటన చూస్తే మాత్రం భయమేసేస్తుంటుంది. దానికి తోడు.. వర్మ టేకింగ్ ఒహటి. మొత్తానికి కళ్లుని వర్మ కళ్లతో డిఫరెంట్‌గా చూపించారు ఈ సినిమాలో. 'అమ్మోరు'లోనూ చిదంబరానికి విశిష్టమైన పాత్రే దక్కింది. 'ఆ ఒక్కటీ అడక్కు'లో మాట్లాడే మేకను కొనుక్కొన్న అమాయకత్వం, 'ఏప్రిల్ 1 విడుదల'లో పెంటమీద టీవీని నూటపదహార్లకు అమ్ముకొన్న మేధావితనం ప్రేక్షకుల్ని బాగా నవ్వించాయి. 'లేడీస్ టైలర్'లో శవాలకు ఫొటోలు తీసే స్పెషల్ ఫొటోగ్రాఫర్‌గా మరోసారి నవ్వించారు. గోవిందా గోవిందా, మనీ, అనగనగా ఒకరోజు తదితర చిత్రాలు చిదంబరానికి మంచి గుర్తింపు తెచ్చాయి. 'కళ్లు' చిదంబరం అసలు పేరు కొల్లూరు చిదంబరరావు. స్వస్థలం విశాఖపట్నంలోని అక్కయపాలెం. 36వ యేట వరకూ ఆ కళ్లు బాగానే ఉండేవి. నాటకాలమీద పిచ్చితో ఏకంగా 16 ఏళ్లపాటు సరైన నిద్ర, తిండి లేక.. ప్రతీరోజూ నాటకమే ప్రాణంగా, నాటకం చూస్తూనో, వేస్తూనో గడపడం వల్ల ఆ ప్రభావం కళ్లపై పడింది. దాంతో నెమ్మదిగా వంకరపోయాయి. ఆ వంకరకళ్లతోనే సినీ జీవితం ప్రసాదించి.. దేవుడు లెక్క సరిచేసేశాడు. చిదంబరం రైలుబండి నాటకాన్ని ప్రదర్శిస్తున్న సమయలోనే దర్శకుడు ఎం.వి.రఘు 'కళ్లు' చిత్రానికి కొత్త నటుల కోసం విశాఖపట్నం వచ్చారు. ఆ నాటకంలో చిదంబరం నటన చూసి ఆయనకు సినిమా అవకాశం ఇచ్చారు. అలా 'కళ్లు'తో సినీరంగ ప్రవేశం చేసిన చిదంబరం 'కళ్లు' చిదంబరంగా సుపరిచితులయ్యారు. ఓ వైపు విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే.. సినీ రంగం నుంచి పిలుపొచ్చిన ప్రతీసారీ... రైలెక్కి మద్రాస్, హైదరాబాద్ అంటూ చక్కర్లు కొట్టేవారు. 1600 మంది కళాకారులతో సకల కళల సమాఖ్య ఏర్పాటు చేశారు. సొంత ఖర్చుతో నాటకాలను స్వయంగా నిర్వహించడంతో పాటు అప్పుడప్పుడూ నటించేవారు. పద్నాలుగేళ్ల పాటు రైలుబండి, భజంత్రీలు, బ్రహ్మచారులు సహా మరెన్నో నాటకాలు విరివిగా ప్రదర్శించారు. ఆర్దిక సమస్య వల్ల కళ్లకు చికిత్స చేయించుకోలేకపోయిన చిదంబరం, ఆ తర్వాత అవకాశాల కోసం వాటిని అలాగే ఉంచుకున్నారు. 'కళ్లు' విజయోత్సవ వేడుకలో 'ఈ కళ్లని బాగు చేయించుకొని... ఎవరికైనా నేత్రదానం చేస్తా' అని నిర్ణయించుకొన్నారు చిదంబరం. అయితే ఆ కోరిక తీరకుండానే కన్ను మూశారు. చిత్రమైన ఆ కళ్లు ఇప్పుడు శాశ్వత విశ్రాంతిని తీసుకొన్నా.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆ కళ్లు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.

తెల్ల జుట్టు[మార్చు]

తెల్ల జుట్టు కనిపిస్తే చాలు ఎక్కడి లేని ఆందోళన మొదలవుతుంది. తెల్లజుట్టు కనిపించకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మార్కెట్లో కనిపించిన ప్రతి షాంపూ, హెన్నాను వాడటం మొదలుపెడతారు. దీనివల్ల తెల్లజుట్టు మాట పక్కన పెడితే ఉన్నజుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది. నిజానికి హోమ్‌రెమెడీస్‌తోనే తెల్లజుట్టు రాకుండా చూసుకోవచ్చు. శిరోజాలను దృఢంగా చేసుకోవచ్చు. ఆ రెమెడీస్‌ ఇవి.

హెన్నాప్యాక్‌ : గోరింటాకు ఆకులను మెత్తగా నూరుకోవాలి. దానికి మూడు టీస్పూన్ల ఉసిరికాయపొడి, ఒక టీస్పూన్‌ కాఫీ పౌడర్‌, కొంచెం పెరుగు చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పట్టించి ఆరిపోయే వరకు ఉండనివ్వాలి. తరువాత మైల్డ్‌ షాంపూతో కడిగేసుకోవాలి. [1]

పొటాటో పీల్‌ ప్యాక్‌ : ఐదు బంగాళదుంపలను తీసుకుని వాటి పొట్టు తీయాలి. ఆ పొట్టును ఒక కప్పులో వేసుకుని రెండుకప్పుల నీరు పోయాలి. తరువాత చిన్న మంటపై ఉడికించాలి. చల్లారిన తరువాత నీటిని మరో పాత్రలోకి వొంపుకోవాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల శాండల్‌వుడ్‌ ఆయిల్‌ను చేర్చాలి. దీన్ని ఒక బాక్స్‌లో భద్రపరచుకుని తల సాన్నం చేసిన తరువాత కురులకు పట్టిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రావడం తగ్గిపోతుంది.

బ్లాక్‌ టీ రెమెడీ : కప్పు నీటిలో రెండు టీస్పూన్ల టీ పౌడర్‌ వేసి బాగా మరిగించాలి. చల్లారిన తరువాత జుట్టుకు పట్టించాలి. టీ వాటర్‌ను షాంపూతో కలిపి ఉపయోగించకూడదు. పంచదార, పాలు కలపకూడదు.

కొబ్బరినూనె రెమెడీ : ఆరు నుంచి ఎనిమిది టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని అందులో మూడు టీస్పూన్ల లెమన్‌జ్యూ్‌సను వేసి కురులకు పట్టించాలి. ఒకగంటపాటు అలా ఉంచి తరువాత షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా క్రమంగా తెల్ల జుట్టు రావడం ఆగిపోతుంది.

  1. "తెల్ల జుట్టుకు చెక్‌". andhrajyothy.com. 2015-12-01. Retrieved 2016-12-27.