Jump to content

వాడుకరి చర్చ:Ahmed Nisar/పాతచర్చలు 1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Ahmed Nisar/పాతచర్చలు 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. {


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బొమ్మ:Ahmadnisar.jpg

[మార్చు]

అహ్మద్‌గారు నమస్కారం, తెలుగు వికీపీడియాకు స్వాగతం. మీరు ప్రారంభించిన నిసార్ అహ్మద్ సయ్యద్ అనే వ్యాసంలో మీరే ఎక్కించిన Ahmadnisar.jpg బొమ్మను చేర్చాను. కానీ మీరు ఎక్కించిన బొమ్మకు లైసెన్సు వివరాలు తెలుపలేదు, బొమ్మను ఎక్కించటం ఎంత ముఖ్యమో దాని వివరాలు తెలుపటం కూడా అంతే మొఖ్యం. దయచేసి ఆ వివరాలు తెలుపండి. మీ కోసం వీలుగా కాపీహక్కుల పట్టీలను ఎలా చేర్చాలో ఇక్కడ తెలిపారు. కాపీహక్కు పట్టీతో పాటుగా బొమ్మ ఎలా తయారయ్యిందో తెలుపండి, బొమ్మను మీరే సృష్టిస్తే దానిని బొమ్మ పేజీలో తెలుపండి. ఇకనుండి బొమ్మలను అప్లోడు చేస్తునప్పుడే "లైసెన్సు వివరాలు" అని తెలుపుతున్న dropdown నుండి ఆ బొమ్మకు తగిన లైసెన్సును తప్పనిసరిగా ఎంచుకోండి.

అలాగే ఉర్దూ కవులు, ఉర్దూ సాహిత్యం గురించి మరిన్ని వ్యాసాలను తయారు చేస్తారని ఆశిస్తున్నాను. తెలుగు వికీపీడియాలో అవి చాలా తక్కువగా ఉన్నాయి. వికీపీడియాకు సంభందించి మీకెటువంటి సందేహాలొచ్చినా నన్ను అడగండి, నాకు వీలైనంతవరకూ మీ సందేహాలను నివృత్తిపరచగలను. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:52, 23 నవంబర్ 2007 (UTC)

ఉర్దూ భాషా విశేషాలు

[మార్చు]

అహ్మద్ నిసార్ గారు మీరు ఉర్దూ భాషకు సంబందించిన వ్యాసాలు బాగా రాస్తున్నారు. మీ కృషిని ఇలానే కొనసాగించండి.దేవా/DeVచర్చ 16:43, 10 డిసెంబర్ 2007 (UTC)

అహమ్మద్ నిసార్ గారూ! ఉర్దూ భాష, సాహిత్యాలపై మీ వ్యాసాలకు అభినందనలు. --కాసుబాబు 06:59, 11 డిసెంబర్ 2007 (UTC)
ఆహ్మద్ నిసార్ గారికి నా నమస్కారాలు. మీ పరిచయం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడే మీరు వ్రాసిన ప్రోత్సాహకరమైన వాక్యాలు చదివాను, ధన్యవాదాలు. ఏదో ఉడతా భక్తిగా తీరిక వేళలో నేను చేయగలిగినది చేస్తున్నాను. నా మిత్రులను కూడా ప్రోత్సహిస్తున్నాను. మీ గురించిన వ్యాసం కూడా ఇప్పుడే చదివాను. మా ఊరికి చెందిన వ్యక్తి అయిన మీరు ఇలా పేరు ప్రఖ్యాతులు సంపాయించడం ఎంతో ఆనందదాయకం. మీరు ఇస్లాం, ఉర్దూ సాహిత్యానికి సంబంధించి ఎన్నో వ్యాసాలు వ్రాయడం గమనించాను, నా అభినందనలు. మీరన్నట్టు ఎన్నో భాషలు అంతరించి పోతున్నాయి. మన భాషలకు ఆ గతి పట్టకుండా చూడటం మన భాధ్యతే. నాకు ఉర్దూ భాషా పరిఙానం పెద్దగా లేకపోవడం వల్ల మీ ఉర్దూ కవితలకు తగిన రీతిలో స్పందించలేక పోతున్నాను. మీరు ఉర్దూ మరియు తెలుగు భాషలకు చేస్తున్న సేవ కొనసాగిస్తూ ఇతరులను ఇలాగే ప్రోత్సహించాలని నా మనవి. ఇట్లు మీ శ్రేయోభిలాషి,మిత్రుడు. Namboori 22:15, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చా పేజీలు

[మార్చు]

అహ్మద్ గారూ, మీరు సరైన పద్దతిలోనే నాకు సందేశం పంపించారు :) చర్చా పేజీలు పరస్పరం సంభాషించుకోవటానికే. ఇంకో విషయం, ఇలా చర్చా పేజీలలో ఏదయినా రాసిన తరువాత నాలుగు టిల్డేలు (~~~~) పెడితే మీ సంతకం దానంతటదే వచ్చేస్తుంది, అంతే కాదు మీ సభ్యపేజీకు కూడా ఒక లింకు కూడా వస్తుంది. సంతకాలలో ఉండే ఆ లింకు ద్వారా సభ్యపేజీలకు వెళ్ళి అక్కడి నుండి, ఆ సభ్యుల చర్చాపేజీలకు వెళ్ళి సంభాషణ కొనసాగించుకోవచ్చు. ఇక్కడ కొత్తగా చేరినప్పుడు నాకు కూడా కొంత గందరగోళంగా అనిపించేది. ఒక సారి ఈ వ్యాసం చదవండి, వికీపై కొంతవరకూ అవగాహణ వస్తుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:51, 12 డిసెంబర్ 2007 (UTC)

ఉర్దూ బాష

[మార్చు]

అహ్మద్ గారూ నమస్తే. మీరు వ్రాస్తున్న వ్యాసం బావుంది. ఉర్దూ బాష గురించిన వ్యాసంలో కవులు,రచయితల గురించి కూడా రాస్తున్నారు. అలా కాక ఉర్దూ కవులు,రచయితలు, ఉర్దూ గ్రంధాలు మొదలగువాటితో ఉర్దూ సాహిత్యం అనే పేజీ మొదలెడితే బావుంటుందనుకొంటాను. ఇందులో కవులు,కళాకారులు,గ్రందాలు తదితరాలను ఉర్దూబాష వ్యాసంలో నుండి కాపీచేసి వీటి గురించి మరికొంత వివరించవచ్చు. ఈ ఉర్దూ వ్యసంలో కేవలం దానిగురించి మాత్రమే వివరించి మిగిలిన వ్యాసాలను అందులో లింకులుగా ఇవ్వచ్చు. ఏమంటారు?.విశ్వనాధ్. 08:13, 13 డిసెంబర్ 2007 (UTC)

ముస్లింల పవిత్ర స్థలాలు

[మార్చు]

అహ్మద్ గారు మీరు ముస్లింల పవిత్ర స్థలాలు వారి ఆచారాలు వంటి విషయాలపై వ్యాసాలు ప్రారంభించగలరా? దేవా/DeVచర్చ 11:16, 20 డిసెంబర్ 2007 (UTC)

తెలుగు మెడల్
అహ్మద్ గారు మీరు తెలుగువికీలో, ఉర్దూ భాష మరియు ఇస్లాం మతానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం.

--------δευ దేవా 19:00, 16 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాలలో నే చేసిన మార్పులు

[మార్చు]

అహ్మద్ నిసార్ గారూ, ఉర్దూ సాహిత్యం వర్గం లోని ఉపవర్గాలను ఇలా చేద్దామని నా ఉద్దేశ్యం..

ఉర్దూ సాహిత్యం --> ఉర్దూ సాహితీకారులు --> ఉర్దూ కవులు

ఉర్దూ సాహితీకారులు అనే వర్గం మళ్ళీ భారత సాహితీకారులు అనే వర్గంలోకి కూడా చేరుతుంది. ఈ భారత సాహితీకారులు అనే వర్గంలోకే తెలుగు సాహితీకారులు, ఇతర భారతీయ భాషల సాహితీకారుల వర్గాలు చేరతాయి. ఈ విషయమై మీ ఆలోచనలను నా చర్చాపేజీలో రాయండి. __చదువరి (చర్చరచనలు) 10:14, 21 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారు, మీరు ఔరంగజేబు వ్యాసంలో [[వర్గం:ABCD, MNOP, XYZ]] అని చేర్చారు. అలా కాకుండా వర్గాలన్నీ వేరువేరుగా చేర్చాలి. ఉదా. [[వర్గం:ABCD]] [[వర్గం:MNOP]] [[వర్గం:XYZ]].ఆ వ్యాసంలో నేను సరిచేశాను. మునుముందు విడివిగా ఇవ్వండి. --C.Chandra Kanth Rao 18:56, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Ahmadnisar.jpg లైసెన్సు వివరాలు

[మార్చు]

ప్రదీపు గారూ నమస్కారం, మీ సందేశం చూశాను, అప్లోడుబొమ్మ లైసెన్సు వివరాలు అడిగారు, ఈ బొమ్మ నాస్వంతమే, నేనే తయారుచేశాను, కేనన్ కెమెరా ఉపయోగించాను, అది జెపిజి ఫైల్, లైసెన్సు వివరాలు ఎలా అప్ లోడు చేయాలో తెలియరాలేదు. స్వంతమే గాబట్టి లైసెన్సు వివరాలు అనవసరమేమో అని భావించాను. దయచేసి లైసెన్సు వివరాలు ఎలా అప్ లోడు చేయాలో తెలుపగలరు. ధన్యవాదాలు. nisar 18:16, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతానికి ఈ బొమ్మ లైసెన్సు వివరాలను మీ బదులుగా నేనే చేర్చేసాను, ఒక సారి చూసి అభ్యంతరాలుంటే చెప్పండి. ఇక ముందు అప్లోడు చేసేటప్పుడు "లైసెన్సు వివరాలు" అనే drop down box నుండి మీరు చేరుస్తున్న బొమ్మకు సరిపడా లైసెన్సును ఎంచుకోండి. ఈ వివరాలు చేర్చమనేది మిమ్మల్ని కానీ ఇంకెవరినన్నాకానీ తప్పుపట్టటానికి కాదు, ఇది కేవలం నిర్వాహణలో ఒక భాగమే. వీకీపీడియా నాణ్యతను పెంచడానికి కాపీహక్కులను ఉల్లంగించే బొమ్మలను తొలగించటానికే ఈ ప్రక్రియ. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:04, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల జాబితా కోసం ప్రణాళిక

[మార్చు]

అహమ్మద్ నిస్సార్ గారూ!

మీరు వ్రాసే వ్యాసాలతో తెలుగు వికీ క్రొత్త వెలుగులు విరజిమ్ముతోంది. అభినందనలు. వీటి వర్గీకరణ, మూసలపై దృష్టి పెట్టడం అవుసరం. నేను ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా, ఉర్దూ భాష గురించిన వ్యాసాల జాబితా అనే రెండు ఖాళీ వ్యాసాలు సృష్టించాను. ఆయా విషయాల గురించిన వ్యాసాలను ఆ జాబితాలలో చేర్చండి. (మీరు వ్రాసినవి కానీ, మరెవరైనా వ్రాసినవి కానీ). కేవలం సూచనా ప్రాయంగానే నేను కొన్ని విభాగాలు చేశాను. అవసరాన్ని పట్టి వాటిని మీరు మార్చవచ్చును. మీరు వ్రాయ సంకల్పించిన ఇతర ముఖ్య వ్యాసాలను కూడా ఆ జాబితాలో ఉంచండి. ప్రస్తుతానికి అవి ఎర్ర లింకులుగా కనిపిస్తాయి. --కాసుబాబు 11:35, 25 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఉర్దూ సాహిత్యం నుండి అనేక కవితా ఖండాలను ఉదాహరిస్తున్నారు. వాటికి తెలుగు అనువాదం కూడా వ్రాస్తే తెలుగు చదువరులకు మరింత హృద్యంగా ఉంటుందనుకొంటున్నాను. షేర్ వ్యాసంలో నేను ఉదాహరణగా వ్రాశాను. ఈ తరహా అన్ని వ్యాసాలకూ క్రింద [[వర్గం:ఉర్దూ కవిత]] అని చేర్చండి. --కాసుబాబు 04:03, 27 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారు, en:WP:AUTOBIO ప్రకారం మీ గురించి మీరు వ్యాసాలు వ్రాయకూడదు. అందువల్ల నిసార్ అహ్మద్ సయ్యద్ ని తెవికీ నుండి తుడిపేయాలన్నది నా అభిప్రాయం. ఇంకొకటి 221.134.250.177, 221.134.249.175 మరియు 221.134.250.23 కూడా మీరేనని నా అనుమానం. సాయీ(చర్చ) 10:37, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఆ వ్యాసాన్ని ప్రారంభించలేదని అంటారని నాకు తెలుసు. ఆ వ్యాసాన్ని ప్రారంభించింది 221.134.250.177. ఈ IP మార్పులు చేర్పులు చూస్తే, ఎవరికైనా అనుమానం వస్తుంది. ఆ వ్యాసానికి మీరు, దేవా గారు, కాసుబాబు గారు, ప్రదీపు గారు, విశ్వనాథ్ గారు కాకుండ మార్పులు చేసింది పై మూడు IPలు. వాటి మార్పులు చేర్పులు అనుమానకరంగానే ఉనాయి మరి. మీరు ఎంత పెద్ద వారయినా కావచ్చు, వికిపీడియా పాలసి ప్రకారం స్వీయచరీత్రలు వ్రాయకూడదు. అందువల్ల ఆ పేజి తుడిపేయక తప్పదు. నేను మిమ్మల్ని నొప్పించాలని అనుకోలేదు. నొప్పించిఉంటే నన్ను క్షమించండి. మీరు నాతో మాట్లాడలకుంటే, నా చర్చ పేజి వాడండి. నా సభ్యుని పేజి కాదు. అది ఈపాటికి మీకు తెలుసుండాలే. సాయీ(చర్చ) 06:08, 1 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాయి గారు, నాదొక అభిప్రాయం: ఆటోబయోగ్రఫీ అంటే 'నేను, నా జీవితంలో..' అంటూ ఉండాలి కదా? ఆ వ్యాసంలో అలా లేదు. నాకు తెలుగు వికీ గురించి తెలిసినప్పటి నుండి నేను నిసార్ గారి అభిమానిని. వారు చేస్తున్న కృషి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికే వికీలో ఎందరో సాహిత్య రంగానికి చెందిన కవులు మరియు రచయితల గురించిన వ్యాసాలున్నాయి. నిసార్‌గారు కూడా ఆ కోవకే చెందుతారు కాబట్టి వారి గురించి ఒక ప్రత్యేక వ్యాసం ఉండడంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. --Svrangarao 07:30, 1 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే. ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేద్దాం. సాయీ(చర్చ) 12:55, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ గారు ఒకే ఒక్క ప్రశ్న. మీరు Sify తో ఇంటర్నెట్ తీసుకున్నారు కదూ? సాయీ(చర్చ) 13:43, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు కథలు చెప్పొద్దు. మీలాంటి వాళ్ళని ఆంగ్ల వికీ లో చాలా మందినే చూసాను. ఈ సారి తప్పించుకున్నారు. ఇంకోసారి పట్టుకుంటాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి వికిపీడియా కన్ను మీరు కప్పలేరు. ఒకరు కాకపోతే ఇంకోకరు పట్టుకుంటారు. సాయీ(చర్చ) 10:01, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాయి, "కథలు చెప్పొద్దు " "పట్టుకుంటాను "... ఆ మాటలు వాడవలసిన అవసరం ఉందా? ఈ వార్నింగులెందుకు? --Svrangarao 12:19, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అవును రంగారావు గారు. నేను ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాను. ఆ వ్యాసం మెదలుపెట్టింది నిసార్. నేనైతే నిర్వాహకునిగా ఉంటే en:WP:SOCK క్రింద నిసార్ ని కనీసం ఒక వారం బ్లాక్ చేసేవాణ్ణి. సాయీ(చర్చ) 09:13, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దక్షిణ గంగోత్రి

[మార్చు]

అహ్మద్ నిసార్ గారు, దక్షిణ గంగోత్రి వ్యాసంలో దీనికీ హిమాలయాలకు, గంగానదికి సంబంధమున్నట్లు అర్థంవచ్చేటట్లుగా వ్రాసారు. అసలు గంగానది జన్మస్థానానికి (గంగోత్రి), దక్షిణ గంగోత్రికి సంబంధమే లేదుకదా.-- C.Chandra Kanth Rao(చర్చ) 19:29, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావుగారూ నమస్కారం, మీరు ఉద్యోగంలో వుంటూగూడా తెవికీ కొరకు సమయం వెచ్చించి చేస్తున్న సేవ చాలా చక్కనిది. తెలుగు భాష పట్ల మీకున్న అచంచల ప్రేమ, మరియు విషయాలపై పట్టు కొనియాడదగినవి, కృతజ్ఞతలు. దక్షిణగంగోత్రి అనునది అంటార్కిటికా ఖండంలో భారతదేశానికి చెందిన శాస్వత కేంద్రం. దీనికా పేరు ఎందుకొచ్చిందంటే, గంగోత్రి అనునది పెద్ద గ్లేషియర్ గల స్థలం (గంగానది జన్మస్థానం), అది హిమాలయాలలో వున్నది. దక్షిణ గంగోత్రి ప్రదేశముకూడా ఒక గ్లేషియర్ లేదా గ్లేషియర్ లాంటి స్థలం కావున, అంటార్కిటికా ఖండం భూగోళానికి (భారతదేశానికి కూడా) దక్షిణాన గలదు కావున, ఆ ప్రదేశానికి దక్షిణ గంగోత్రి అని పేరు పెట్టారు. గంగానది జన్మస్థలం గంగోత్రి (బ్రహ్మపుత్రానది జన్మస్థలం మానససరోవరం లాగా) అని ప్రస్తావించడం జరిగింది గాని, దక్షిణ గంగోత్రితో సంబంధమున్నట్టు గాదు. అదీ నాఉద్దేశ్యం, మీరు దీనికి సరైన మార్పులతో ఉంచగలరంటే స్వాగతం. ధన్యవాదాలు, మిత్రుడు. nisar 20:51, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అహ్మద్ నిసార్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. అర్థం చేసుకోవడంలోనే పొరపాటు జర్గింది. మరెవరూ అలా అర్థం చేసుకోనట్లు నేను వ్యాసంలో మార్పులు చేస్తాను మరియు వ్యాసాన్ని విస్తరిస్తాను. ఇంకో విషయం మీరు సభ్యులకు అభిప్రాయాలు తెల్పాలంటే సభ్యుల చర్చాపేజీలలోనే వ్రాయండి. సభ్యపేజీలలో వ్యాయరాదని మనవి.---- C.Chandra Kanth Rao(చర్చ) 21:03, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రాకేశ్ శర్మ వ్యాసం

[మార్చు]

అహ్మద్ నిస్సార్ గారు, రాకేశ్ శర్మ వ్యాసం ఇదివరకే ఉంది. మళ్ళీ మీరు కొత్తగా రాకేష్ శర్మ పేరుతో ఇంకో కొత్త వ్యాసం తయారుచేశారు. మీరు చేయవల్సిన మార్పులు చేర్పులు అక్కడే చేస్తే బాగుంటంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 22:26, 2 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వ్యాసాలు

[మార్చు]

అహ్మద్ నిసార్ గారు, మీరు అనువాదం కోసం ఆంగ్లవికీ నుంచి తెచ్చుకున్న వ్యాసాలను పూర్తిగా అనువాదం చేయకనే మళ్ళీ మళ్ళీ కొత్త వ్యాసాలను దిగుమతి చేసుకుంటున్నారు. తెవికీలో ఆంగ్ల వ్యాసాలు ఉండటం సమంజసం కాదు. ఒక వ్యాసం పూర్తిగా అనువాదం చేసుకున్న తరువాతే కొత్త వ్యాసం తెచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పటికే మీరు కాపీ చేసిన ఆంగ్లవ్యాసాలు పేరుకుపోయాయి. నిర్వహణలో భాగంగా వాటిని తొలిగించవలసి రావచ్చు(వ్యాసం లోని ఆంగ్ల భాగాన్ని మాత్రమే) కాబట్టి వెంటనే క్రింద పట్టికలో చూపబడిన వాటిని అనువాదం చేసే పని చేపట్టండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 14:29, 18 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వ్యాసాల జాబితా

[మార్చు]

నిసార్ గారు, మీరు రాస్తున్న వ్యాసాల జాబితా మొత్తం ఎక్కడయినా లభ్యమవుతుందా? లేనిచో అలాంటిది ఒకటి ఉంటే (ఉదాహరణకు మీ పేజీలోఒక table లా) ముందు ముందు అందరికీ చాలా ఉపయోగకరం అవుతుందని భావిస్తున్నాను. --Svrangarao 17:32, 17 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిసార్ గారు, మీ పేజీలో వ్యాసాల అమరిక చాలా బాగుంది.మున్ముందు సభ్యులకు ప్రామాణికంగా మరియు ఉత్సాహ కారకంగా అవుతుంది!! --Svrangarao 14:02, 22 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మక్కా

[మార్చు]

నిసార్ గారు, మక్కా వ్యాసాన్ని 29వ వారపు 'ఈ వారం వ్యాసం' గా ప్రతిపాదించాను. ఇప్పుడు ఉన్నవి మొదటిపేజీలో ఉంచదగిన చిత్రాలుగా అనిపించడం లేదు. మీకు వీలయినపుడు మంచి చిత్రాన్ని వ్యాసముకు జతచేయగలరు. మిత్రుడు --Svrangarao 03:24, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మూసలు, పట్టికల లాంటివి కనిపించకపోతే అలా వదిలేయండి. క్రమంగా ఎవరో ఒకరు సరి చేస్తారు. మీకు కూడా కొద్ది కాలానికి అలవాటు అవుతుంది. బొమ్మలు అప్‌లోడ్ చేయడం గురించి తెలుసుకోవడానికి : బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానం అనే లింకులు చూడండి. మొత్తానికి తెలుగు వికీకి కావలసిన ప్రధాన సహకారం వ్యాసాలు వ్రాయడమే. ఇతర సాంకేతిక అంశాలు తరువాతి కోవలోకి వస్తాయి. కనుక మీరు చేసే పనే సరి. మరో విషయం. ఆంగ్ల వ్యాసాన్ని మీకు తోచినంతలో కుదించవచ్చును. మొత్తాన్ని అనువదించాల్సిన అవసరం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:43, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మసీదు వ్యాసం గురించి

[మార్చు]

అహమ్మద్ నిసార్! మీరు బాధ్యత కలిగిన పౌరుడిగా ఆలోచించారు. అభినందనలు. నా అభిప్రాయాలు (1) మనకు పొలిటికల్ ఎజెండా లేదు. నిజాన్ని వ్రాయడమే (2) అనువాదంలో ఏది ఉంచాలి, ఏది ఉంచదగదు - అన్న నిర్ణయంలో అనువాదకునికి పూర్తి స్వేచ్ఛ ఉంది. మీ ఇష్టం. (3) "సమకాలీన రాజకీయ పాత్ర" అన్న శీర్షిక ఉన్నట్లయితే ఈ విషయాన్ని ప్రస్తావించడం తప్పు కాదు. (4) " బాబ్రీ మస్జిద్ - రామమందిర్ అనే విషయంపై కొందరు స్వార్థ పరులు, దేశంలో గల హిందూ-ముస్లిం సోదరులలో విద్వేషాగ్నిని రగిల్చి, తమ రాజకీయ స్వార్థాలకు ఈ మస్జిద్ ను బలిగొన్నారు " - ఈ వాక్యానికి మనం Reference ను చూపనందువలన ఇందులో Neutral Point of View ను ప్రశ్నించే అవకాశం ఉంది. బాబ్రీ మస్జిద్ - రామమందిర్ అనే వివాదం కారణంగా ఒక మసీదును కూల్చివేయడం ఫలితంగా దేశమంతటా రాజకీయంగాను, మత పరంగాను తీవ్రమైన స్పందనలు, సంఘర్షణలు చోటు చేసుకొన్నాయి అంటే మెరుగనుకొంటున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:12, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మస్జిద్, మూసలు వగైరా

[మార్చు]

ఈ రోజే మస్కట్‌ లో పెద్ద మసీదు ఫొటోలు తీశాను. మస్జిద్ వ్యాసానికి జత చేస్తాను రెండు మూడు రోజులలో. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:10, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

  • నేను దాదాపు రోజూ ఈ మసీదు ముందునుండి వెళుతుంటాను. ఇదివరకు రోడ్ మీది నుండి ఫొటో తీశాను (మస్కట్ వ్యాసంలో ఉంది). క్రితం వారం లోపలికి వెళ్ళి ఫొటో తీశాను.
  • మూసలు: {{ఇస్లాం}}, {{ఉర్దూ}} అనే రెండు మూసలు దేవా తయారు చేశాడు. వీటిని ఇంకా మెరుగు పరచాలి. ఇస్లాంకు చెందిన వ్యాసాల దిగువలో (రిఫరెన్సులకు పైన) {{ఇస్లాం}} మూసను ఉంచండి. అలాగే ఉర్దూ మూస కూడాను.
  • అంతర్వికీ లింకులు: మీరు వ్రాసిన వ్యాసాలకు వీలయినంత వరకు అంతర్వికీ లింకులు ఇవ్వండి. ఉదాహరణకు సూఫీ వ్యాసం. దీనికి ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసం పేరు "Sufism" ( en:Sufism ) - ఈ రెండు వ్యాసాలకూ లింకులు ఇవ్వడం మంచిది. తెలుగు వ్యాసం క్రింది భాగంలో [[en:Sufism]] అని వ్రాయాలి.
  • "సౌర కుటుంబం" అన్న పేరు నాకు ఇదివరకు పరిచయంగా ఉన్న పేరు. మీకు సబబనిపించిన పేరు వాడండి. మిగిలిన పేర్లనుండి దారిమళ్ళింపు పెట్టవచ్చును.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:18, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా పేజీ, చర్చా పేజీ ఫైర్‌ఫాక్స్‌లో అలికేసినట్లుగా కనబడుతున్నాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్‌లో బాగానే కనుపిస్తున్నాయి (నా కంప్యూటర్‌లో) దీనికి కారణం కనుక్కొని సరిచేయడానికి కొంత సమయం పట్టవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:43, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల పేర్ల మార్పులు

[మార్చు]

, మీరడిగిన పేజీల పేర్లు మార్చాను. మీరు ఎప్పుడైనా చర్చా పేజీలో ఏదైనా విషయం గానీ వ్యాసం గురించి గానీ చర్చిస్తే లింకులు ఇవ్వండి. దానివల్ల సభ్యుల పని సులభతరమవుతుంది. వారు మళ్ళీ దాన్ని వెతుకి చేరుకోవాల్సిన అవసరం ఉండదు. δευ దేవా 22:43, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇస్లాం

[మార్చు]

నిస్సార్‌గారూ మీవ్యాసాలు ఇస్లాం గురించి తెలుసుకోవడానికి చక్కగా దోహదం చేస్తున్నాయి.మీకృషి కొనసాగించండి. --t.sujatha 03:58, 1 ఏప్రిల్ 2008 (UTC)

ఈ వారం సమైక్య కృషి

[మార్చు]

నిసార్ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో ప్రస్తుతం ఉన్న మొలకల అభివృద్దే ధ్యేయం. ఐదు వ్యాసాలు సభ్యుల అభిరుచి మేరకు నామినేషన్ చేసి ఎంచుకున్న తర్వాత ఆ వారం వాటిపై కృషి చేద్దాం. δευ దేవా 20:51, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ముహమ్మద్ లేదా మహమ్మద్?

[మార్చు]

మహమ్మద్‌ అని ఇక్కడ వ్రాసారు. ముహమ్మద్ బిన్ తుగ్లక్ లో "ముహమ్మద్" అని వ్రాసారు. ఏది సరి? సాయీ(చర్చ) 12:24, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ లో మహమ్మద్ అనే వ్యాసం మొదలు పెట్టిన రచయిత, మహమ్మద్ అని మహమ్మదు ప్రవక్త అనీ వ్రాశారు.

మహమ్మద్ అనే పదానికి మూలం అరబ్బీ పదం "హమ్ద్" (హ మ్ ద్), అర్థం: "శ్లాఘన" లేదా "కీర్తించుట". ఈ "హమ్ద్" అనే పదానికి Prefix ము (మ్ ఉ) చేర్చిన "ము హ మ్ మద్" ('మ్' ను వత్తి పలికి) అగును. అర్థం "శ్లాఘించబడినవాడు" లేదా "కీర్తించబడిన వాడు". ఈ పేరును, ముహమ్మద్, మొహమ్మద్, మహమ్మద్, మరియు మహమ్మదు (తెలుగులో సాధారణంగా నకారం పొల్లు వచ్చినచో, దానిని 'కొమ్ము' చేరుస్తారు.) వ్రాస్తారు.

ఖురాన్ లో " ముహమ్మద్ " అని వాడబడినది. అరబ్బీ లో సరియైన గ్రాంధిక పదము 'ముహమ్మద్'. వ్యావహారికంలో 'మొహమ్మద్' అని కూడా పలుకుతారు. అరబ్బీ, ఉర్దూ భాషేతరులూ, ఈ పేరును 'మహమ్మద్' అని పలకడం వ్యావహారికంగా సాధారణం. టర్కీ వాసులు ముహమ్మద్ ను Mahmet (మహ్మెట్ లేదా మహమెట్) అని, అహ్మద్ ను Ahmet అనీ పలుకుతారు. ఇది మధ్య యూరప్ లో ఉచ్ఛారణా శైలి.

English Wiki లోని "Muhammad" వ్యాసంలో " Names and appellations in quran " చూడండి. nisar 13:00, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదంతా మహమ్మద్‌ వ్యాసంలో వ్రాసేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:13, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఏది సరైనదో అది వాడండి. కాకపోతే ఒక చోట ఇది ఇంకో చోట అది వాడకండి. దారిమార్పులు పెట్టండి. సాయీ(చర్చ) 11:47, 24 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక proper noun ను వ్రాసేటపుడు, ప్రాంతాలు, భాషలు మున్నగు వాటిని దృష్టిలో పెట్టుకొన్నయెడల, స్పెల్లింగ్ లలోనూ, ఉచ్ఛారణలోనూ తేడాలు వస్తాయి, లింగ్విస్టిక్స్ లో ఇలాంటి స్వల్ప తేడాలు allowed కూడాను. మహమ్మద్ వ్యాసం ప్రారంభించిన రచయిత కూడా ఇదే విషయం దృష్టిలో పెట్టుకొని వ్రాసి ఉండవచ్చును. మహమ్మద్, ముహమ్మద్, మొహమ్మద్, ఇవి మూడూ సరైనవే. వీటిలో ఏది వ్రాసిననూ మనం ఆహ్వానించవలసినదే. nisar 12:25, 24 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను అంగీకరించను అనటంలేదు. అన్ని చోట్లా ఒకటే వ్రాస్తే uniformగా ఉంటింది కాదా అని. దారిమార్పులు ఉన్నదే ఇలాంటి వాటి కోసం. ఆంగ్ల వికీలో అన్ని చోట్లా Muhammad వాడారు. en:Mohammad en:Muhammad కు దారిమార్పు చెందుతుంది చూడండి.చర్చసాయీరచనలు 02:35, 25 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
కాసుబాబు గారూ నమస్తే, మహమ్మద్ అనే వ్యాసానికి ముహమ్మద్ అనే పేరును మార్చి, మహమ్మద్, మహమ్మదు ప్రవక్త, మరియు మొహమ్మద్ లనుండి దారి మార్పులను ఇవ్వగలరా, దీనితో భాషా ప్రామాణికాలను సరితూచవచ్చు. నాకు పేరు మార్పులు దారిమార్పులు ఎలా చేయాలో తెలియదు. nisar 07:41, 26 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాలసీలపై ఒక చర్చ

[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:03, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]