వాడుకరి చర్చ:Adithya.indicwiki
స్వాగతం
[మార్చు]Adithya.indicwiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 09:02, 7 డిసెంబరు 2020 (UTC)
ఆదిత్య పకిడే గారు, నమస్కారమండి. తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకుని కొత్త పేజీలు సృష్టిస్తున్నారు. జర్మన్ నాటక రంగము పేజీలు సృష్టించారు. కానీ తెలుగు వికీపీడియా నియమాలకు అనుగుణంగా చాలావరకు లేదు, ముందు మీరు కొత్త పేజీలు సృష్టించడం . ఆపండి. ముందు నియమాలు చదువుకోండి. తరువాత కొత్త పేజీ లను రాయడం ప్రారంభించండి. ఎందుకంటే అందులో కొన్ని దోషాలు ఉన్నవి పర్వాలేదు. ముందుముందు తెలుస్తాయి. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. ఇంతకుముందున్న పేజీలను చూడండి, కొంత అనుభవం వచ్చాక కొత్త వ్యాసాలు రాయవచ్చు. ఎందుకంటే మూలాలు లేకపోతే మన సొంత అభిప్రాయాలు అనుకుంటారు. అలాంటివాటిని తొలగిస్తారు. అధికారులు, కంగారు పడకండి, ఇది మామూలు విషయం. ఇంతకుముందున్న పేజీలను చూడండి. వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. ఇవి మీకు పనికివస్తాయి. చూడండి.
ఇందులో ఉన్న పేజీలు అన్నిటినీ గమనించండి. కొత్త వ్యాసాలు ఎలా రాయాలి అనేది కూడా గమనించండి. అనుభవం వచ్చాక రాయడం ప్రారంభించండి. మీలాంటి వారి అవసరం వికీపీడియాకు చాలా ఉంది రాయాలి అనే అభిలాష మీలో ఉంది, కాబట్టి అన్ని చదవండి, గమనించండి, తర్వాత రాయండి. ఏమైనా అనుమానాలు ఉన్నా ఏమైనా సహాయం కావలసి వచ్చినా అడగండి తప్పకుండా చేస్తాను. -- ప్రభాకర్ గౌడ్ నోముల <font color="blue"> చర్చ 08:06, 10 డిసెంబరు 2020 (UTC)
- ధన్యవాదాలువాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు మీరు చెప్పిన విధం గానే ముందు మీరు పెట్టిన వ్యాసాలను చదివి అర్ధం చేసుకుని నేను రాసిన వ్యాసం లోని దోషాలను సవరించుకుంటాను.#Adithya.indicwiki (చర్చ) 07:17, 12 డిసెంబరు 2020 (UTC)
- Adithya.indicwiki గారు, మంచిది, మరే విధమైన అనుమానం వచ్చిన సహాయం కావలసి వచ్చినా అడగండి. ధన్యవాదాలు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 07:31, 12 డిసెంబరు 2020 (UTC)
మూలంలో ఉన్నది ఉన్నట్టు రాయకూడదు
[మార్చు]ఆదిత్య గారూ, మీరు రాస్తున్న జర్మన్ జర్మన్ నాటక రంగము వ్యాసం చూస్తున్నాను. ఒక పుస్తకాన్ని మూలంగా చేసుకుని వ్యాసం అభివృద్ధి చేయాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ, పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా రాయకూడదు. దాన్ని వికీపీడియా శైలిలోకి మార్చుకుని, వాక్యాలను అచ్చంగా రాయకుండా సారం స్వీకరించి మనదైన భాషలో రాయాలి. ఇది ఎలా చేయాలి అంటే మీరు ఒక ఉదాహరణ తీసుకోండి. ఆంగ్లం నుంచి మీకు పోల్చుకోగల అంశంతో ఉన్న ఒక మంచి వ్యాసాన్ని (మంచి వ్యాసం ఏమిటి, ఎలా గుర్తించాలి తర్వాత చెప్తాను) ఇస్తున్నాను - :en:Gujarati cinema. జర్మన్ భాష బదులు గుజరాతీ, నాటక రంగం బదులు సినిమా రంగం - రెండూ దృశ్యమాధ్యమాలే కనుక మీరు పోల్చుకోవడానికి, ఉన్న సమాచారం ఆ పద్ధతిలో రాయడానికి పనికివస్తుంది. ఇది మంచి వ్యాసం కనుక మనదీ మంచిగా తయారు కావచ్చు. మరొక ముఖ్య విషయం. దీన్ని నేను మీ వాడుకరి పేరుబరికి మారుస్తున్నాను. ఇకపై అక్కడ మీ కృషి కొనసాగించండి. (వాడుకరి పేరుబరికీ, మొదటి పేరుబరికీ తేడా మీకు వికీ నేర్పుతున్నవారిని అడిగి చూడండి.) --పవన్ సంతోష్ (చర్చ) 06:28, 12 డిసెంబరు 2020 (UTC)
ఇదిగో మీ వాడుకరి పేరుబరిలో మీ వ్యాసం తరలించాను: వాడుకరి:Adithya.indicwiki/జర్మన్ నాటక రంగము ఇక్కడ దీన్ని మెరుగుపరిచి తర్వాతే మరొకటి ఎత్తుకొమ్మని సూచిస్తున్నాను. అభినందనలు, ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:30, 12 డిసెంబరు 2020 (UTC)
- ధన్యవాదాలు(వాడుకరి చర్చ:Pavan santhosh.s గారు మీరు చెప్పిన విధం గానే ముందు మీరు పెట్టిన వ్యాసాన్ని చదివి అర్ధం చేసుకుని నేను రాసిన వ్యాసం లోని దోషాలను సవరించుకుంటాను. Adithya.indicwiki (చర్చ) 07:05, 12 డిసెంబరు 2020 (UTC)